Thursday Motivation : మీకు ప్రేమ దొరికితే వదులుకోకండి.. కోపాన్ని దాచుకోకండి..
Thursday Motivation : సమయాన్ని వృథా చేసేముందు ఒకటికి నాలుగు కాదు ఐదు సార్లైనా ఆలోచించాలి. ఎందుకంటే లైఫ్ అనేది చాలా చిన్నది.. బతకడం నేర్చుకోండి. ప్రేమ చాలా అరుదైనది.. మీకు దొరికితే వదులుకోకండి. కోపం అనేది మంచిది కాదు.. దానిని వదిలేయండి. భయం అనేది తాత్కలికం.. ఒక్కసారి బ్యారియర్ దాటితే అది మళ్లీ మన జోలికి రాదు.
Thursday Motivation : అవును మన జీవితంలో సమయం చాలా విలువైనది. లైఫ్ ఎప్పుడు ఏమి ఇస్తుందో.. ఎప్పుడు ఏమి తీసుకుంటుందో ఎవరం చెప్పలేము. కాబట్టి ఈ చిన్ని లైఫ్‌ని ఫుల్‌గా ఆస్వాదించడానికి ప్రయత్నించండి. ఎప్పుడు ఉంటామో.. ఎప్పుడు పోతామో.. తెలియని ఈ జీవితంలో ఒక్క క్షణం పోయినా మళ్లీ తిరిగి రాదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. ఇప్పటికైనా పోయిందేమి లేదు.. జీవించడం నేర్చుకోండి. కొన్ని విషయాలు లైట్ తీసుకున్నా పర్లేదు కానీ.. మన జీవితాన్ని మాత్రం లైట్ తీసుకోకూడదు.
మీ చేతిలో సమయం ఉన్నప్పుడు.. మీకు నచ్చిన పని చేయండి. బాగా అలసిపోయి ఉంటే రెస్ట్ తీసుకోండి. నచ్చిన పాట వినండి. నచ్చిన వ్యక్తితో మాట్లాడండి. ఇలా ఏమి చేసినా.. నచ్చినట్లు బతకండి. మీరు గడిపిన ప్రతి క్షణం మీకో మంచి జ్ఞాపకాన్ని ఇవ్వాలి. మీరు రాత్రి కళ్లు మూసుకున్నప్పుడు ప్రశాంతంగా అనిపించాలి. అలాగే మీ జీవితంలో ప్రేమ దొరికింది అనుకోండి. దానిని వదులుకోకండి.
మీకు మీ జీవితంలో ప్రేమ దొరికితే.. దానిని పట్టుకోవడానికి ప్రయత్నించండి. మీకు అదృష్టం ఉంటే.. దానిని మీరు పట్టుకోగలరు. లైఫ్‌లో అందరికీ ప్రేమను పొందే అదృష్టం ఉండదని తెలుసుకోండి. కాబట్టి మీకు ఆ ప్రేమ దొరికితే.. ఆ అందమైన భావోద్వేగాన్ని పూర్తిగా అనుభవించండి. ప్రేమ అంటే జీవిత భాగస్వామి మాత్రమే ఇచ్చేది కాదు. మీ తల్లి, చెల్లి, తండ్రి, బ్రదర్, ఫ్రెండ్ ఇలా ఎవరైనా మీకు ప్రేమను ఇస్తుంటే.. వారి ప్రేమను ఆస్వాదించండి.
కోపం అనేది కూడా మరొక భావోద్వేగమే కానీ.. మీరు దానిని ఎంత పక్కన పెడితే అంత మంచిది. ఎందుకంటే.. కోపంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని బాధపెడతాయి. కోపం వ్యక్తులను దూరం చేస్తుంది. కోపం మిమ్మల్ని నిస్సహాయులను చేస్తుంది. కోపం అనరాని మాటాలు అనేలా చేస్తుంది. మన కోపం ఇతరులను అన్నింటికన్నా ఎక్కువగా బాధపెట్టేస్తుంది. కాబట్టి ఈ ఫీలింగ్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కోపం వచ్చినా.. దానిని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోండి.
మనం అనుకున్నట్లు అన్ని విషయాలు జరగవు. ఆ సమయంలో కోపం సహజంగా వచ్చేస్తుంది. కాని అది మిమ్మల్ని విచక్షణంగా మార్చకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే అది మీకు హాని చేస్తుంది. లేదా ఇతరులకు హాని చేస్తుంది. అలాగే భయం కూడా. ఇది మన తెగించనంత వరకు మన దగ్గరే ఉంటుంది. ఒక్కసారి ఆ అడ్డుగోడ దాటేసామనుకో.. అది మళ్లీ మన జోలికి రాదు. కాబట్టి ఏ విషయానికి భయపడకండి. ధైర్యంతో అడుగు ముందుకు వేయండి. అనుకున్న వాటిని ధైర్యంగా సాధించండి.
సంబంధిత కథనం