Thursday Motivation : మంచి పని ఎప్పుడు చేసినా.. అది మంచి సమయమే అవుతుంది..
Thursday Motivation : ఏదైనా మంచి పని చేయడానికి.. లేదా ఎవరికైనా సాయం చేయడానికి.. మంచి సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మంచి ఎప్పుడూ చేయాలనుకుంటే అప్పుడు చేసేయాలి. మంచి చేయడానికి ఎప్పుడూ చెడు సమయం, దుర్మూహర్తం వంటివి ఉండవు.
Thursday Motivation : మనకి మంచి జరుగుతుంది అనుకున్నా.. మనం చేసే పనివల్ల ఎదుటివారికి మంచి జరుగుతుంది అనుకున్నా.. రైట్ మూమెంట్ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మనం చేసేది మంచి పని అయితే ఎప్పుడైనా చేసేయొచ్చు. మనం చేసే పని వల్ల ఇతరులకు హాని కలగనంతవరకు మనం ఏ పనినైనా.. ఎప్పుడైనా చేయవచ్చు. దానికోసం మంచి మూహుర్తం చూసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని మంచిదైతే.. ప్రకృతి కూడా మీకు సహకరిస్తుంది.
ఒక్కోసారి కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు చేద్దాంలే అని ఆగిపోతారు. కానీ మంచి పని ఎప్పుడు చేస్తే అప్పుడే కరెక్ట్. ఎందుకంటే ఒక్కోసారి మీరు ఆలస్యంగా చేయడం వల్ల.. అప్పటికే డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. అర్రె ముందే చేసి ఉంటే అయిపోతుండే కదా అని మీరు బాధ పడాల్సి వస్తుంది. మీరు సరైన మార్గంలో ఉన్నారని.. మీ ఉద్దేశం సరైనదని మీరు భావిస్తే.. మిమ్మల్ని మీరు ఆపుకోకండి. కరెక్ట్ టైమ్ కోసం వేచి చూడకండి. ఎందుకంటే మీరు మంచి పని చేయడంలో ఆలస్యం చేస్తే.. తర్వాత చేసే అవకాశం మీకు లభించకపోవచ్చు.
సమయం చాలా విలువైనదని అందరికి తెలుసు. జీవితంలో కొన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. రైట్ మూమెంట్ కోసం ఎదురు చూస్తాం. అయితే మంచి చేయడానికి మాత్రం రైట్ మూమెంట్ అవసరం లేదు. మనం ఎప్పుడు చేస్తే.. అప్పుడే రైట్ మూమెంట్. మనం చేసేది కరెక్ట్ అని అనిపించినప్పుడు ఎవరికోసమో ఆగాల్సిన, లేదా ఎవరి ఆజ్ఞ కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు ఓ మంచిపని చేస్తే.. తర్వాత ఇంకేదైనా చేసేందుకు సమయం దొరుకుతుందని గుర్తుంచకోండి. ఇది మీకోసం కావొచ్చు.. ఇతరుల కోసం కావొచ్చు. దానిని ఎప్పుడు వాయిదా వేయకండి.
అందువల్ల మీరు ఏదైనా ప్లాన్ చేసి.. అది అమలుకు సిద్ధంగా ఉందని తెలిస్తే.. వీలైనంత త్వరగా దానినిన చేయండి. మీ మార్గంలో నిరుత్సాహపరిచే అంశాలు కూడా ఉండవచ్చు. కానీ వాటికన్నా.. మీరు చేయాలనుకుంటున్న పనిపై దృష్టి సారిస్తే మంచిది. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. అంతా మంచే జరుగుతుంది. మీ ఉద్దేశం మంచిది అయితే ఏ చెడు కాలం మీతో ఎక్కువ ఉండదు.
ఎవరైనా బాధపడుతుంటే.. సహజంగా స్పందించే సామర్థ్యం ఎక్కువమందికి ఉండదు. అలాంటి మనసు మీకు ఉందంటే.. మీరు చాలా మంచివారని అర్థం. దానిని ఎవరికో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అనుకున్నపనిని అనుకున్నప్పుడు చేస్తే చాలు. టైమ్ కోసం ఆగకుండా ఉంటే చాలు. అప్పుడు మీరే సమాజానికి నిజమైన హీరోలు అవుతారు.
సంబంధిత కథనం