Dibba Rotti Recipe| బర్గర్ తింటే బొద్దుగా అవుతారు..కానీ దిబ్బరొట్టె తింటే ఫిట్‌గా తయారవుతారు!-this is a healthy burger here is andhra special dibba rotti recipe for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Dibba Rotti Recipe| బర్గర్ తింటే బొద్దుగా అవుతారు..కానీ దిబ్బరొట్టె తింటే ఫిట్‌గా తయారవుతారు!

Dibba Rotti Recipe| బర్గర్ తింటే బొద్దుగా అవుతారు..కానీ దిబ్బరొట్టె తింటే ఫిట్‌గా తయారవుతారు!

HT Telugu Desk HT Telugu
Dec 12, 2022 07:16 AM IST

Dibba Rotti Recipe: ఇది ఆంధ్రా స్పెషల్ బర్గర్, దీని పేరు దిబ్బరొట్టె. ఇది ఎంతో ఆరోగ్యకరమైన రొట్టె. బ్రేక్ ఫాస్ట్, లంచ్, రాత్రి భోజనంగా ఎప్పుడైనా తినొచ్చు. రెసిపీ కూడా చాలా సింపుల్, మీరూ చేసుకోండి.

Dibba Rotti Recipe
Dibba Rotti Recipe (slurrp)

రోటీలలో చాలా వెరైటీలు ఉన్నాయి, మీరు ప్రతిరోజూ జొన్నరొట్టె, గోధుమ రొట్టె, మిల్లెట్లతో చేసిన రొట్టె తింటూ ఉండవచ్చు. కానీ మన తెలుగు ప్రాంతానికే ప్రత్యేకమైన ఒక రొట్టెను చాలా అరుదుగా తింటూ ఉండవచ్చు. అందుకే మరోసారి దాని రెసిపీని ఈరోజు మీ ముందుకు తీసుకు వచ్చాం. అది మరేదో రొట్టె కాదు, దిబ్బ రొట్టె, దీనిని మినప రొట్టె కూడా అంటారు. ఇది చూడటానికి బర్గర్ కోసం ఉపయోగించే బన్ లాగా ఉంటుంది. కానీ రుచిలోనూ, ఆరోగ్యంలోనూ దీనికి సాటిలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిబ్బ రొట్టిని ఉదయం అల్పాహారంగానైనా, సాయంత్రం టిఫిన్ లాగానైనా తింటారు.

ఆంధ్రా స్పెషల్ దిబ్బ రొట్టె మంచి ప్రోటీన్లు నిండిన బ్రేక్ ఫాస్ట్. కాబట్టి ఇది తినడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరగదు. బయట క్రిస్పీగా, లోపలి నుంచి మెత్తగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం, సింగిల్ గా ఉండే బ్యాచిలర్స్ కూడా దీనిని ఈజీగా చేసుకోవచ్చు. మధ్యాహ్నం లంచ్ కోసం కూడా తీసుకెళ్లవచ్చు. బ్యాటర్ సిద్ధమైన తర్వాత దీనిని కేవలం 20 నిమిషాల్లో సిద్ధం చేసుకోవచ్చు. మరి దిబ్బరొట్టె తయారీ కోసం ఏమేం కావాలి, ఎలా తయారో చేయాలో రెసిపీ ఇక్కడ ఉంది. మీరూ ట్రై చేయండి.

Dibba Rotti Recipe కోసం కావాలసినవి

  • 3 కప్పుల మినప పప్పు
  • 2 కప్పుల రవ్వ
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • రుచి తగినంత ఉప్పు
  • అవసరం మేరకు నూనె

దిబ్బ రొట్టె ఎలా తయారు చేయాలి

  1. దిబ్బ రొట్టి చేయడానికి, ముందుగా మినప పప్పును 3 నుండి 4 గంటలు నానబెట్టండి.
  2. నిర్ణీత సమయం తరువాత, పప్పును బ్లెండర్లో రుబ్బి కొని మెత్తని పేస్ట్ సిద్ధం చేయండి.
  3. ఇప్పుడు రుబ్బుకున్న బ్యాటర్ లో రవ్వ, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలిపి గరిటతో కలుపుతూ అరగంట సేపు అలాగే ఉంచాలి.
  4. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ తీసుకొని, అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, మీడియం మంట వేడి చేయాలి.
  5. నూనె వేడి కాగానే పాన్ లో దిబ్బరొట్టెను 2 అంగుళాల మందంతో గుండ్రంగా విస్తరించాలి, మూత పెట్టాలి.
  6. ఒక 15 నిమిషాల తర్వాత దిబ్బరొట్టెకు రంధ్రాలు చేస్తే లోపలి వరకు ఉడుకుతుంది.
  7. అనంతరం 2 నిమిషాల తరువాత, మూత తీసి రోటీని తిప్పండి, మరొక వైపు నుండి కూడా ఎర్రగా కాల్చండి.

అంతే, దిబ్బ రొట్టి తినడానికి సిద్ధంగా ఉంది. మీకు ఇష్టమైన చట్నీ, పచ్చడి లేదా పానకంతో అద్దుకొని తింటూ రుచిని ఆస్వాదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం