Types of Rotis । ఎప్పుడూ గోధుమ, జొన్న రొట్టెలేనా? ఇంకా చాలా రకాలు ఉన్నాయి!-here are the different types of rotis you can try replacing regular breads ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Here Are The Different Types Of Rotis You Can Try Replacing Regular Breads

Types of Rotis । ఎప్పుడూ గోధుమ, జొన్న రొట్టెలేనా? ఇంకా చాలా రకాలు ఉన్నాయి!

Nov 27, 2022, 06:53 PM IST HT Telugu Desk
Nov 27, 2022, 06:53 PM , IST

  • Types of Rotis: అన్నంకు బదులుగా రోటీలను తినాలనుకుంటున్నారా? అయితే మనకు గోధుమ చపాతీలు, జొన్న రొట్టెలు ఎక్కువ తెలుసు. ఇవి కాకుండా మరికొన్ని ఆరోగ్యకరమైన రోటీ వెరైటీలు ఉన్నాయి, అవేంటో చూడండి.

మక్క రొట్టె:  వీటిని మొక్కజొన్న పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తేలికగా జీర్ణమవుతుంది. ఫోలిక్ యాసిడ్, విటమిన్లు, ఇతర ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు నియంత్రణ, రక్తంలో చక్కెర నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు మొదలైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

(1 / 6)

రాగి రొట్టె: రాగి పిండితో రాగి రొట్టెలు కూడా చేసుకోవచ్చు. ఈ రకం రొట్టెల్లో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగి రొట్టెలు తింటే బరువు తగ్గడం, మధుమేహం నియంత్రణ, మెరుగైన జీర్ణక్రియ, ఎముకల ఆరోగ్యాన్ని పెంచడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

(2 / 6)

అక్కి రోటీ: ఈ రొట్టెలు కర్ణాటకలో చాలా ప్రసిద్ది. ఇక్కడ అక్కి అంటే బియ్యం. ఈ రోటీని బియ్యప్పిండితో తయారుచేస్తారు. బియ్యంపిండిలో తురిమిన కూరగాయలు, మసాలా దినుసులు కలిపి కూడా ఈ రొట్టె చేయవచ్చు. కూర లేకపోయినా తినేయొచ్చు.

(3 / 6)

తాలిపీఠ్ రోటీ: సజ్జపిండి, జొన్నపిండి కలిపి ఈ రొట్టెలను తయారు చేస్తారు. ఇలాంటి రొట్టెలను మహారాష్ట్రలో ఎక్కువగా చేసుకుంటారు. నెయ్యి పూసి చేస్తే చాలా రుచిగా ఉంటాయి.

(4 / 6)

తాలిపీఠ్ రోటీ: సజ్జపిండి, జొన్నపిండి కలిపి ఈ రొట్టెలను తయారు చేస్తారు. ఇలాంటి రొట్టెలను మహారాష్ట్రలో ఎక్కువగా చేసుకుంటారు. నెయ్యి పూసి చేస్తే చాలా రుచిగా ఉంటాయి.

బులుగురు గోధుమ రొట్టె: దీనిని బక్ వీట్ రోటీ అని కూడా అంటారు. ఇవి గోధుమలలో మరో రకం. ఈ రకం రోటీలలో ఐరన్, ఫైబర్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఈ రోటీలు తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం చేకూరుతుంది.

(5 / 6)

సంబంధిత కథనం

ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మరింత ముదురుతున్నాయి. ఇక మే నెలలో ఎలాంటి పరిస్థితులంటాయో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భారీ అంచనాలతో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. దీంతో ఈ మూవీ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది.సౌత్ కరోలినాలోని సర్ఫ్సైడ్ బీచ్ లో ఏప్రిల్ పింక్ మూన్తీవ్రమైన వేడి వల్ల చర్మం చాలా ప్రభావితం అవుతుంది. ఆ చర్మాన్ని కాపాడుకునేందుకు  సొరకాయ తొక్కను ఉపయోగించాలి. సొరకాయ తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.పచ్చి చేపలను ఉప్పు, పసుపుతో నానబెట్టడం లేదా కడగడం వల్ల వాసన పోతుంది.ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. పరగడుపున నీళ్లు తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు