sex knowledge: పెళ్లికి ముందే ఈ శృంగార జ్ఞానం ఉండాలి.. లేదంటే అసంతృప్తే..
sex knowledge: శృంగారం విషయంలో పెళ్లికి ముందే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అపోహలు, అంచనాలు, ఆనందాలు ఇలా ఏవేవో ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి.
పెళ్లంటే కొత్త ప్రపంచం. దాంతో పాటే జీవితంలోకి కొత్తగా వచ్చేది శృంగారం. ఈ విషయంలో ఆసక్తితో పాటే కొన్ని భయాలు కూడా ఉంటాయి. శృంగారం విషయంలో సరైన జ్ఞానం లేకపోవడం, అపోహల వల్ల కొన్ని కొత్త భయాలు పుట్టుకొస్తాయి. వాస్తవానికి దూరంగా ఆలోచనల వల్ల శృంగార జీవితంలో సంతృప్తి ఉండదు. అందుకే పెళ్లికి ముందే అమ్మాయైనా అబ్బాయైనా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
1. సమయం పట్టొచ్చు:
శృంగారం అంటే శరీరాల కలయికే కాదు. రెండు శరీరాలు ఒకే లయలో ఉండటం. దానికి కాస్త సమయం పట్టొచ్చు. మొదటి రాత్రి రోజే గొప్ప శృంగార అనుభవం కలగాలని లేదు. హనీమూన్ అయినా, ఫస్ట్ నైట్ అయినా మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. దాంతోనే దిగులు పడొద్దు. మీరు జీవితం మొత్తం కలిసి ఉండబోతున్నారు. ఒకరితో ఒకరు ముందు సౌకర్యంగా ఫీల్ అయితే గొప్ప శృంగార అనుభూతి దానంతట అదే కలుగుతుంది.
2. వాస్తవాలకు దూరంగా:
సినిమాల్లో, టీవీ షోలో చూసి సెక్స్ గురించి వాస్తవానికి దూరంగా ఊహల్లో ఉండొద్దు. ఎక్కువ సార్లు సెక్స్ చేయడం, లేదా తక్కువ, లేదా మీరనుకున్నట్లు జరగకపోతే బాధ పడొద్దు. జరుగుతున్నదే నిజం కాబట్టి దాన్ని ఆస్వాదించండి. లేదంటే ఆనందం ఉండదు. అసంతృప్తి పెరుగుతుంది. వాటిని చూసి ఊహించుకోవడం కన్నా మీ కాబోయే భాగస్వామికీ మీకూ సౌకర్యాన్ని, ఆనందాన్నిచ్చే మార్గాలేంటో ఆలోచించండి.
3. అసంతృప్తి:
సెక్స్ విషయంలో సంతృప్తి వెంటనే రాకపోవచ్చు. అంత మాత్రానా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు అనుకోవద్దు. మీ బంధం చెడ్డది కాదు. ఏదో తప్పుంది అని తొందరపడొద్దు. ఒక్కరోజుతో నిర్ణయానికి రావద్దు. శృంగారం వల్ల బంధం బలపడొచ్చు కానీ అదే బంధాన్ని నిర్ణయించదు. నెగటివ్ ఆలోచనల్ని తీసేసి బంధం మీద దృష్టి పెట్టండి.
4. మొహమాటం వద్దు:
అవతలి వ్యక్తికి మనం స్పష్టంగా చెప్పగలిగితే ఎలాంటి సమస్యకు అయినా పరిష్కారం ఉంటుంది. మీకు శృంగారం చేసే సమయంలో ఏమైనా ఇబ్బందులున్నా, లేదా మీకేమైనా కోరికలున్నా మీ భాగస్వామికి తెలియజేయాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే గొప్ప శృంగార అనుభూతి పొందుతారు.
5. మీ కోరికలే కాదు:
సెక్స్ లో ఇద్దరి ఆనందం ముఖ్యమే. మీకున్న కోరికల్నే కాదు, మీ భాగస్వామి ఆశల్ని, ఊహల్ని కూడా కనిపెట్టాలి. దానికి తగ్గట్లు మీరుండగలిగితే శృంగార జీవితాన్ని ఇద్దరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆస్వాదిస్తారు.
ఈ సమస్యలు మీకుండాలని లేదు, కానీ అన్నింటికన్నా ముఖ్య కారణం హద్దుకు మించి ఊహల్లో ఉండటం. ఎదుటి వ్యక్తి నుంచి ఎక్కువగా ఆశించడం. ఇవన్నీ గుర్తుంచుకుని అసలైన శృంగార జీవితాన్ని ఆస్వాదించండి.
టాపిక్