vagina myths: తరచూ సెక్స్ చేయడం వల్ల వజైనా వదులుగా అవుతుందా? యోని గురించి వాస్తవాలు తెలుసుకోండి..-doctor reveals the truth behind common myths about vagina ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Doctor Reveals The Truth Behind Common Myths About Vagina

vagina myths: తరచూ సెక్స్ చేయడం వల్ల వజైనా వదులుగా అవుతుందా? యోని గురించి వాస్తవాలు తెలుసుకోండి..

Akanksha Agnihotri HT Telugu
May 17, 2023 08:00 PM IST

vagina myths: వజైనా విషయంలో కొన్ని అపోహలున్నాయి. ఆ అపోహలేంటో వాస్తవాలేంటో తెలుసుకోండి.

యోని విషయంలో అపోహలు, వాస్తవాలు
యోని విషయంలో అపోహలు, వాస్తవాలు (Unsplash)

స్త్రీ యోని విషయంలో చాలా రకాల అపోహలుంటాయి. పాతకాలం నుంచి ఇప్పటి వరకు వజైనా గురించి అల్లుకున్న ఊహలెన్నో ఉంటాయి. దాంపత్య జీవితంలో అయినా, దాంపత్య జీవితంలోకి అడుగుబెట్టబోయే వారైనా ప్రతి స్త్రీ,పురుషులు అపోహలు, వాస్తవాలకు మధ్య తేడా తెలుసుకోగలగాలి.

డాక్టర్ వందన రామనాథన్ HT లైఫ్ స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యోని విషయంలో ఉండే కొన్ని అపోహలు, వాస్తవాలు తెలియజేశారు.

  1. అపోహ: ఎక్కువ సార్లు సెక్స్ చేయడం వల్ల యోని లూజ్ అవుతుంది

వాస్తవం: ఫోర్ ప్లే వల్ల వజైనా వ్యాకోచం చెందుతుంది. మళ్లీ మామూలు స్థితికి వస్తుంది. రబ్బరులాగే సాగదీసినా కూడా యథాస్థితికి వచ్చే గుణం వజైనా కు ఉంటుంది.

2. అపోహ: వజైనా ఎప్పుడూ బిగుతుగానే ఉంటుంది.

వాస్తవం: గర్భదారణ, వయసు ఇంకేమైనా కారణాల వల్ల వజైనా స్టిఫ్‌నెస్ లో మార్పు రావచ్చు. ఇది ప్రతి ఒక్కరిలో భిన్నంగా ఉంటుంది.

3. అపోహ: వజైనా నుంచి వాసన రావడం అసాధారణం

వాస్తవం: కొన్ని సార్లు యోని దగ్గర వాసన రావడం అనేది ఇన్ఫెక్షన్ కు సంకేతం కావచ్చు. కానీ చాలా తక్కువ వాసన అనేది సాధారణం. రుతుచక్రంలో వివిధ రోజుల్లో ఈ వాసనలో మార్పు కూడా ఉండొచ్చు.

4. అపోహ: ప్రతి మహిళ భావప్రాప్తి పొందుతుంది

వాస్తవం: క్లిటరల్, వజైనా స్టిమ్యులేషన్ వల్ల మహిళల్లో భావప్రాప్తి కలగొచ్చు. యోని భావప్రాప్తి అంటూ ప్రత్యేకంగా ఏముండదు.

5. అపోహ: వజైనాను ఫెమినిన్ వాష్‌తో శుభ్రం చేసుకోవాలి

వాస్తవం: వజైనా సొంతంగా దానికదే శుభ్రం చేసుకునే అవయవం. దాని పీహెచ్ స్థాయులు అదే నియంత్రణలో ఉంచుకుంటుంది. రసాయనాలు, వాష్ లు వాడటం వల్ల ఆ పీహెచ్ స్థాయుల్లో మార్పు వస్తుంది. ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. గోరువెచ్చని నీల్లు, ఎలాంటి పరిమళాలు లేని సబ్బుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

6. అపోహ: వర్జినిటీని హైమెన్ నిర్ణయిస్తుంది

వాస్తవం: వర్జినిటీ అనేది చాలా సున్నితమైన విషయం. హైమెన్ పొర ఉన్నా లేకపోయినా, ఆకారంలో, సైజులో మార్పున్నాఅది వర్జినిటీని నిర్ణయించదు. కఠినమైన శారీరక కసరత్తులు, కష్టమైన పనులు, ట్యాంపన్లు వాడటం వల్ల కూడా హైమెన్ పొర పోవచ్చు.

7. అపోహ: వజైనల్ డిశ్చార్జి ఇన్ఫెక్షన్ సూచిస్తుంది

వాస్తవం: వజైనల్ డిశ్చార్జి సాధారణం. వజైనా శుభ్రపరచడంలో, లూబ్రికేషన్ కోసం ఇది సాయపడుతుంది. కానీ రంగు, వాసన, చిక్కదనం లో మార్పు ఇన్ఫెక్షన్ సూచించొచ్చు. దీనికి తప్పకుండా వైద్య సలహా తీసుకోవాలి.

ఇవేకాదు.. ఇంకేవైనా సందేహాలున్నా అపోహలను నమ్మకుండా వాస్తవాలు తెలుసుకోవాలి. వైద్య సహాయం తీసుకోవాలి. మొహమాటం లేకుండా మీ భాగస్వామితో లేదా స్నేహితులతో చర్చించాలి. దానివల్ల చాలా విషయాల్లో స్పష్టత వస్తుందని డాక్టర్ వందన అన్నారు.

WhatsApp channel

టాపిక్