food for UTI: మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్‌ను తగ్గించే ఆహారం ఇదే..-food that alleviates urinary tract infections ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Food For Uti: మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్‌ను తగ్గించే ఆహారం ఇదే..

food for UTI: మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్‌ను తగ్గించే ఆహారం ఇదే..

Apr 30, 2023, 10:34 AM IST Koutik Pranaya Sree
Apr 30, 2023, 10:34 AM , IST

food for UTI: మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తరచూ ఇబ్బంది పెడుతున్నా, లేదంటే అసలు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడే కొన్ని ఆహారాలేంటో తెలుసుకోండి.  

మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI)  లక్షణాలను తగ్గించడంలో సహాయపడే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ ఇవి వ్యాధిని పూర్తిగా తగ్గించలేవని గమనించాలి. UTIలు సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తాయి. అది తగ్గించడానికి యాంటీబయాటిక్స్ అవసరం. అందుకే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. కానీ కాస్త ఉపశమనం ఇచ్చి లక్షణాలను తగ్గించే ఆహారం ఏంటో తెలుసుకోండి.  

(1 / 6)

మూత్రనాళ ఇన్ఫెక్షన్ (UTI)  లక్షణాలను తగ్గించడంలో సహాయపడే అనేక ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ ఇవి వ్యాధిని పూర్తిగా తగ్గించలేవని గమనించాలి. UTIలు సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తాయి. అది తగ్గించడానికి యాంటీబయాటిక్స్ అవసరం. అందుకే వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి. కానీ కాస్త ఉపశమనం ఇచ్చి లక్షణాలను తగ్గించే ఆహారం ఏంటో తెలుసుకోండి.  (Freepik)

క్రాన్‌బెర్రీ: ఈ పండు మూత్రనాళ గోడలకు బ్యాక్టీరియా అతుక్కోకుండా చేస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. క్రాన్‌బెర్రీ జ్యూస్, లేదా క్రాన్‌బెర్రీ సప్లిమెంట్లు తీసుకున్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. 

(2 / 6)

క్రాన్‌బెర్రీ: ఈ పండు మూత్రనాళ గోడలకు బ్యాక్టీరియా అతుక్కోకుండా చేస్తుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. క్రాన్‌బెర్రీ జ్యూస్, లేదా క్రాన్‌బెర్రీ సప్లిమెంట్లు తీసుకున్నా మూత్రనాళ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. (Pixabay)

ప్రోబయాటిక్స్: పెరుగులో జీవమున్న బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యం జీర్ణం అవ్వడంలో, రోగ నిరోధక శక్తి పెంచడంలో సాయం చేస్తాయి.  మూత్రనాళంలో బ్యాక్టీరియా ఎక్కువగా కాకుండా కాపాడతాయి.

(3 / 6)

ప్రోబయాటిక్స్: పెరుగులో జీవమున్న బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆరోగ్యం జీర్ణం అవ్వడంలో, రోగ నిరోధక శక్తి పెంచడంలో సాయం చేస్తాయి.  మూత్రనాళంలో బ్యాక్టీరియా ఎక్కువగా కాకుండా కాపాడతాయి.(File Photo)

విటమిన్ సి:  ఈ విటమిన్ మూత్రం ఆమ్ల తత్వాన్ని పెంచుతుంది. దానివల్ల మూత్రనాళంలో బ్యాక్టీరియా పెరగే అవకాశం తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు నిమ్మజాతి పండ్లు.. నారింజ, కివి, స్ట్రాబెర్రీ, సి విటమిన్ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. 

(4 / 6)

విటమిన్ సి:  ఈ విటమిన్ మూత్రం ఆమ్ల తత్వాన్ని పెంచుతుంది. దానివల్ల మూత్రనాళంలో బ్యాక్టీరియా పెరగే అవకాశం తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు నిమ్మజాతి పండ్లు.. నారింజ, కివి, స్ట్రాబెర్రీ, సి విటమిన్ సప్లిమెంట్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. (Pixabay)

వెల్లుల్లి: దీనికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో ఇవి సాయపడతాయి. ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకుంటే మంచిది. 

(5 / 6)

వెల్లుల్లి: దీనికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుంటాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో ఇవి సాయపడతాయి. ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా చేర్చుకుంటే మంచిది. (Pexels)

డి మానోస్: ఇది ఒక చక్కెర. పీచ్, యాపిల్స్, కొన్ని రకాల బెర్రీ పండ్లలో ఇది ఉంటుంది. ఇది కూడా క్రాన్‌బెర్రీ లాగే బ్యాక్టీరియా మూత్రనాళ గోడలకు అతుక్కోకుండా కాపాడుతుంది. 

(6 / 6)

డి మానోస్: ఇది ఒక చక్కెర. పీచ్, యాపిల్స్, కొన్ని రకాల బెర్రీ పండ్లలో ఇది ఉంటుంది. ఇది కూడా క్రాన్‌బెర్రీ లాగే బ్యాక్టీరియా మూత్రనాళ గోడలకు అతుక్కోకుండా కాపాడుతుంది. (Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు