Foods for Better Sleep : పడుకునే ముందు ఇవి తీసుకుంటే త్వరగా మంచి నిద్ర పడుతుంది!
Foods for Better Sleep: రాత్రివేళ మెరుగ్గా నిద్ర పట్టేందుకు కొన్ని రకాల ఫుడ్స్ సాయం చేస్తాయి. ఇవి తీసుకుంటే గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. అవేంటో ఇక్కడ చూడండి.
Foods for Better Sleep: రాత్రి వేళ బాగా నిద్రపడితే ఆరోగ్యానికి చాలా మంచిది. నాణ్యమైన నిద్ర రోగనిరోధక శక్తిని మెరుగుపరచటంతో పాటు చాలా వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అయితే, కొందరికి నిద్ర అంత తొందరగా పట్టదు. నిద్ర పట్టినా మధ్యలో డిస్ట్రబ్ అవుతుంటారు. అలాంటప్పుడు మీరు రాత్రి తినే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. ఇందుకు పడుకునే ముందు తీసుకోవాల్సిన కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఒకవేళ అవి తీసుకుంటే మంచి నిద్ర పట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. అవేంటంటే..
బాదం (Almonds )
బాదం (Almonds)ను అతి ముఖ్యమైన డ్రైఫ్రూట్‍గా పరిగణిస్తాం. బాదం పప్పును ప్రతీ రోజు తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే, రాత్రి పడుకునే ముందు బాదం పప్పులను తింటే మంచి నిద్ర పట్టేందుకు ఇది సహకరిస్తుంది. బాదంలో ఉండే మెలాటోనిన్.. నిద్రకు ఉపకరిస్తుంది.
క్యామమైల్ టీ (Chamomile Tea)
నిద్ర సరిగా పట్టని వారికి క్యామమైల్ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరాన్ని ఈ టీ చాలా ప్రశాంతంగా మారుస్తుంది. ఒత్తిడిని, డిప్రెషన్‍ను తగ్గించి మంచి నిద్ర పట్టేలా సాయపడుతుంది.
కివీ (Kiwi)
తక్కువ క్యాలరీలు ఉండే పండు ‘కివీ’. బరువు తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే చాలా పోషకాలు ఉంటాయి. ఫొలేట్, పొటాషియమ్ ఉండడం వల్ల జీర్ణక్రియను కివీ పండ్లు మెరుగుపరుస్తాయి. పడుకునే ముందు కివీ పండ్లను తింటే మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది.
గోరువెచ్చని పాలు (Hot Milk)
పడుకునే ముందు ఓ గ్లాస్ గోరువెచ్చని పాలు తాగినా మంచిదే. అమినో యాసిడ్స్ ఇందులో ఉంటాయి. దీంతో మీ నిద్రను ఇది మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వయసు మళ్లిన వారికి గోరువెచ్చని పాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. శరీరంలో సెరటోనిన్, మెలటోనిన్‍ను ఉత్పత్తి చేయడంలోనూ గోరువెచ్చని పాలు కీలకంగా ఉంటాయి.
అక్రోట్‍కాయ (Walnut)
అక్రోట్‍కాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్ర మెరుగ్గా పట్టేందుకు ఇది కూడా సాయపడుతుంది.
నీటిలో కాస్త అల్లం, తులసి ఆకులను కాచి.. ఆ నీటిని తాగినా నిద్ర బాగా పడుతుంది. జీర్ణక్రియకు, అంతరాయం లేని నిద్రకు ఈ అల్లం తులసి నీరు ఉపయోగపడుతుంది.
సంబంధిత కథనం