Vinayaka Chavithi 2024: వినాయకుడు ఇష్టంగా ఆస్వాదించే ఆహారాలు ఇవే, కచ్చితంగా వీటిని పూజలో ఉంచండి
Vinayaka Chavithi 2024: వినాయక చవితి నాడు గణేషుడిని సంతోషపెట్టాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆయనకు ఇష్టమైన ఆహారాలు లేదా వస్తువులు పూజలో ఆయన ముందు ఉంచితే కచ్చితంగా గణపతి ఆనందిస్తాడు.
వినాయక చవితికి ప్రతి ఇంట్లోనూ గణపతి కొలువుదీరుతారు. ఆయనకు స్వాగతం పలికేందు ముందుగానే భక్తులంతా ఎంతో సన్నద్ధమయ్యారు. వినాయక చవితి పూజ చేయడం ద్వారా గణేషుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ముఖ్యంగా వినాయకుడికి ఇష్టమైన వాటిని పూజలో ఉండేలా చూసుకోవాలి. అలా ఆయన్ను సంతోషపెట్టడం అవసరం. వినాయక చవితి నాడు గణపతికి మీ ఇంటికి వచ్చినప్పుడు, అతనికి ఇష్టమైన వస్తువులను నివేదించాలి. మరి ఆయనకు ఏమిష్టమో మీకు తెలుసా?
వినాయకుడికి ఏమిష్టం?
గణపతికి మోదక్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. గణేష్ చతుర్థి పండుగలో కచ్చితంగా మోదక్ సమర్పించాలి. సంప్రదాయ పద్దతిలో కొబ్బరి, బెల్లంతో ఈ తీపి వంటకాన్ని తయారు చేస్తారు. కానీ ఈ రోజుల్లో అనేక రకాల మోదక్ లు తయారుచేస్తున్నారు. గణపతి పాదాల వద్ద మోదక్‌లు నివేదించాలి. ఈ డెజర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. గణపతి ఈ తీపిని ఆస్వాదించడం ద్వారా ఎంతో సంతోషిస్తాడని అంటారు.
నువ్వుల లడ్డూ
వినాయక చవితి సందర్భంగా గణపతికి నువ్వుల లడ్డూ సమర్పిస్తే ఎంతో మంచిది. వినాయకుడికి ఈ లడ్డూలంటే చాలా ఇష్టం. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తినడానికి ఎంతో రుచిగా కనిపించే నువ్వులు, బెల్లం కలిపి ఈ లడ్డూలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. పూజలో నైవేద్యంగా సమర్పించిన తరువాత దీనిని ప్రసాదంగా పంచాలి.
పాయసం
వినాయక చవితి నాడు, పాయసం కచ్చితంగా ఉండాల్సిందే. అన్నం, పాలు, పంచదార, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన స్వీట్ ఖీర్ గణేష్ కు చాలా ఇష్టం. గణేశుడికి పాయసాన్ని సమర్పించడం వల్ల వినాయకుడు చాలా సంతోషంగా ఉంటాడని, ఇంటికి సంతోషం, శ్రేయస్సును తెస్తాడని నమ్ముతారు.
తాజా పండ్ల రసం
చాలా మంది పండ్ల రసాన్ని పూజలో ఉంచరు. నిజానికి పండ్ల రసం అంటే వినాయకుడికి ఎంతో ఇష్టం. మామిడి, ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ వంటి తాజా పండ్ల రసాన్ని వినాయకుడికి సమర్పించడం వల్ల ఆయన ఎంతో సంతోషిస్తాడు. తాజా పండ్ల రసం వినాయకుడి సాంప్రదాయ నైవేద్యం. మీరు జ్యూస్ చేయలేకపోతే, అరటి పండు, ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లను సమర్పించాలి. పండు లేదా పండ్ల రసం ప్రసాదంగా పెట్టడం వల్ల వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు.
తమలపాకు
తమలపాకులు వినాయకుడికి సమర్పించండి. తమలపాకులో వక్క పెట్టడం మర్చిపోవద్దు. ఈ రెండింటినీ వినాయక ఆరాధనలో చాలా పవిత్రంగా భావిస్తారు. వినాయక చవితి సందర్భంగా గణపతి పూజలో వక్క పెట్టిన తమలపాకును కచ్చితంగా ఉండేలా చూసుకోండి.
టాపిక్