Vinayaka Chavithi Wishes 2024: వినాయక చవితి శుభాకాంక్షలు మీ స్నేహితులకు బంధువులకు తెలుగులో ఇలా అందంగా చెప్పండి
Vinayaka Chavithi Wishes 2024: వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కొటేషన్లు, మెసేజ్‌ల కోసం వెతుకుతున్నారా? ఇక్కడ మేము కొన్ని వినాయక చవితి శుభాకాంక్షలు ఇచ్చాము. వీటిని మెసేజ్‌లు, వాట్సాప్ స్టేటస్‌లలో షేర్ చేసుకోవచ్చు.
Vinayaka Chavithi Wishes 2024: గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి... ఈ పండుగ హిందువులకు ఎంతో ముఖ్యమైనది. గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చతుర్థిగా నిర్వహించుకుంటారు. ఏటా భాద్రపద మాసం శుక్ల చతుర్ధి సమయంలో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఇంట్లోను వినాయకుడు కొలువుదీరుతాడు. అదరూ తమ స్థాయికి తగ్గట్టు నైవేద్యాలతో, పూలు, పండ్లతో, ధూప దీపాలతో పూజించి ఆశీస్సులను పొందుతారు.
ఎంతో మంది వినాయక చవితి శుభాకాంక్షలు ఉదయానే తమ స్నేహితులు బంధువులకు షేర్ చేస్తారు. సోషల్ మీడియా కాలంలో వాట్సాప్‌లో, ఇన్స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్, ట్విట్టర్ లో కూడా ఈ శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడతాయి. మీరు అందమైన వినాయక చవితి కొటేషన్లు, విషెస్, శుభాకాంక్షలు కోసం వెతుకుతున్నట్లయితే ఇక్కడ మేము కొన్ని ఇచ్చాము. తెలుగులోనే ఉన్న ఈ శుభాకాంక్షలు మీకు నచ్చిన వారికి మెసేజ్‌లు లేదా వాట్సాప్ లో పంపించుకోవచ్చు.
వినాయక చవితి శుభాకాంక్షలు
1. మీరు చేసే ప్రతి కార్యం
వినాయకుని ఆశీస్సులతో
విజయవంతం కావాలని
మనసారా కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
2. ఓం వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా
సర్వకార్యేషు సర్వదా
హ్యాపీ వినాయక చవితి
3. తల్లి రక్షణకు ప్రాణమిచ్చిన
మాతృ వాక్పరిపాలనా కొడుకు నీవు
తల్లిదండ్రులే విశ్వరూపమని తెలియజేశావు
మమ్ము చల్లగా కాపాడ రావయ్య గణాధిపా
మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చతుర్థి శుభాకాంక్షలు
4. మీ జీవితాల్లో విఘ్నాలు తొలగించి
సుఖ సంతోషాలు ప్రసాదించాలని
ఆ గణనాథుడిని ప్రార్థిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు
5. మీ ప్రతి పనిలో విజయం సాధించాలని
జీవితంలో దుఃఖం ఉండకూడదని కోరుకుంటూ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
6. భక్తితో కొలిచేమయ్య బొజ్జ గణపయ్య
దయతో మాపై కరుణ చూపవయ్యా
మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
7. జయ విఘ్నేశ్వరా నమో నమో
జగద్రక్షక నమో నమో
జయకర శుభకర సర్వ పరాత్పర
జగదుద్ధార నమో నమో
అందరి ఆశలను ఆశయాలను
నెరవేర్చే శక్తిని ప్రసాదించు దేవా
మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
8. లక్ష్మీ గణపతి రావయ్య
లక్ష్యసాధకుడు నీవయ్యా
హ్యాపీ వినాయక చవితి
9. మీకు శ్రీ గణనాథుడు సకల శుభాలను
కలుగజేయాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
10. మీరు ఏ పని మొదలుపెట్టిన
ఎలాంటి విఘ్నాలు లేకుండా
పూర్తయ్యేటట్లు చూడాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
11. ఆ విఘ్నాధిపతి మీకు క్షేమా స్థైర్య
ధైర్య ఆయురారోగ్యాలు సిద్ధించేలా చేయాలని
సుఖసంతోషాలు చేకూర్చాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చతుర్థి శుభాకాంక్షలు
12. గణపతి పండుగ నాడు
ఆయన చేతిలో ఉండే లడ్డు
ఎంత తీయగా ఉంటుందో
అంతే తీయగా మీ జీవితం కూడా
ఉండాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు
13. అమ్మ చాటు బిడ్డడైన అద్వితీయుడు
ముక్కోటి దేవతల మొక్కులందువాడు
విఘ్నాలను ఎడబాపే విఘ్నేశ్వరుడు
లగ్నాలను నడిపించే లంబోదరుడు
వినాయక చవితి శుభాకాంక్షలు
14. ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలన్నింటినీ విని
మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
15. సర్వ విఘ్నహరం దేవం
సర్వ విఘ్న విమర్శితం
సర్వసిద్ధి ప్రదాతారం
వందేహం గణనాయకం
మీకు మీ కుటుంబ సభ్యులకు
వినాయక చవితి శుభాకాంక్షలు
16. ఆది పూజ్యుడికి అభివందనం
పార్వతీ నందనుడికి ప్రియ వందనం
ముల్లోకాలను ఏలే మూషిక వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓం విఘ్నేశ్వరాయ నమః
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
టాపిక్