Avoid Sugar: పంచదార పూర్తిగా తినడం మానేయడం వల్ల మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు ఇవే
Avoid Sugar: పంచదార ఆరోగ్యానికి చేసే మేలు ఏమీ లేదనే చెప్పాలి. అయినా కూడా దాని తీపిదనం కోసం ఎంతో మంది ఆహారంలో భాగం చేసుకుంటారు. పంచదార మానేసి చూడండి ఎంత ఆరోగ్యమో.
Avoid Sugar: మన రోజువారీ ఆహారంలో పంచదార భాగం అయిపోయింది. ఉదయం టీ లేదా కాఫీలో పంచదారను కలుపుకోవడంతో దాని ప్రయాణం మొదలవుతుంది. ఆరోజు తినే ప్రతి స్వీట్లోనూ పంచదార ఉండాల్సిందే. నిజానికి పంచదార తినడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే మేలు సున్నా అని చెప్పాలి. అనేక ఆరోగ్య సమస్యలకు కూడా ఈ చక్కెర కారణమవుతుంది. కాబట్టి పంచదార పూర్తిగా మానేస్తే ఎంతో మంచిదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. పంచదారను మానేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో కూడా వివరిస్తున్నారు.
చక్కెర మానేస్తే
ఎవరైతే పంచదారను పూర్తిగా మానేస్తారో వారి మొత్తం ఆరోగ్యం మెరుగు పడుతుంది. పంచదారను తినకపోవడం వల్ల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి తినాలన్న కోరిక పెరుగుతుంది. అలాగే వాటిని తినే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనివల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. చక్కెరను పూర్తిగా తినడం మానేసినా అన్నంలో ఎంతో కొంత చక్కెర ఉంటుంది. అలాగే పండ్లలోనూ చక్కెర ఉంటుంది. అవి మన శరీరానికి సరిపోతాయి.
బరువు తగ్గడానికి
చక్కెర ఉన్న పానీయాలు, పదార్థాలు తినడం మానేయడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో చేరే క్యాలరీలు తగ్గుతాయి. పోషక విలువలు అందులో ఏమీ ఉండవు. కాబట్టి శరీరానికి జరిగే నష్టం కూడా ఏమీ లేదు. బరువు తగ్గాలనుకునేవారు చక్కెరతో చేసిన ఆహారాలను పూర్తిగా మానేయాలి.
చక్కెరను మానేయడం వల్ల అధిక రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, శరీరంలో ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు రావు. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే చక్కెరను పూర్తిగా మానేయండి.
నోటి ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికీ చక్కెర ఎంతో కీడు చేస్తుంది. కాబట్టి చక్కెరతో చేసిన ఆహారాలు మానేయడం వల్ల మీకు తెలియకుండానే దంత ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోటి సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
చక్కెర తినడం మానేయడం వల్ల శరీరంలో శక్తి స్థిరంగా ఉంటుంది. ఒకేసారి శక్తి స్థాయిలు పడిపోవడం లేదా అతిగా పెరగడం వంటివి జరగవు. స్థిరమైన శక్తి స్థాయిలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలసటను తగ్గిస్తాయి.
చక్కర తినడం మానేయడం వల్ల టైప్2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. అలాగే మీ మానసిక స్థితి ఆరోగ్యంగా మారుతుంది. మూడు స్వింగ్స్, చిరాకు, కోపం వంటివి రావు. ఏకాగ్రత పెరుగుతుంది. రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది. చక్కెరను అధికంగా తినేవారి చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది.
జీర్ణక్రియ సవ్యంగా సాగాలన్నా, కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా... చక్కెర నిండిన ఆహారాలను తినడం పూర్తిగా మానేయాలి.
టాపిక్