Diabetes: డయాబెటిస్ ఉందా? అయితే పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఈ సమస్యలు వచ్చే అవకాశం-have diabetes but if you drink water after eating fruits these problems are likely to occur ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉందా? అయితే పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఈ సమస్యలు వచ్చే అవకాశం

Diabetes: డయాబెటిస్ ఉందా? అయితే పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఈ సమస్యలు వచ్చే అవకాశం

Haritha Chappa HT Telugu
Feb 20, 2024 07:10 PM IST

Diabetes: డయాబెటిస్ ఉన్నవారే కాదు, లేని వారు కూడా పండ్లు తిన్నాక నీళ్లను తాగకూడదు. పండ్లు తిన్నాక నీళ్లను తాగడం వల్ల కొన్ని రకాల సమస్యలు వస్తాయి.

పండ్లు తిన్నాక నీళ్లు తాగవచ్చా?
పండ్లు తిన్నాక నీళ్లు తాగవచ్చా? (pixabay)

Diabetes: కొందరికి ఏది తిన్నా వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. భోజనం చేసిన వెంటనే లేదా బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే నీళ్లు గటగటా తాగేస్తారు. అలాగే పండ్లు తిన్నాక నీళ్లు తాగే వారి సంఖ్య ఎక్కువే. అయితే ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం పండ్లు తిన్నాక నీళ్లు తాగడం మంచి పద్ధతి కాదు. ఇది కొందరిలో అసౌకర్యాన్ని, అనారోగ్యాన్ని కలుగజేస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు పండ్లు తిన్నాక ఒక అరగంట వరకు నీళ్లను తాగకూడదు. వారికి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు అందరికీ రావాలని లేదు, కానీ కొందరిలో వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి పండ్లు తిన్నాక నీళ్లను తాగడం మానుకోండి. పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తున్నాయో వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు.

గ్యాస్ ఉత్పత్తి ఎక్కువై...

ఏ పండ్లను తిన్నా అందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పండ్లు తిన్నాక నీళ్లు తాగితే జీర్ణరసాలు మరింత పలుచగా మారిపోతాయి. దీనివల్ల జీర్ణ ఎంజైమ్‌లు సరిగా పనిచేయవు. దీంతో పండ్లు జీర్ణం కాక గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఎసిడిటీకి కారణం అవుతుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రక్టోజ్, ఈస్ట్ అధికంగా ఉంటుంది. పండ్లు తిన్నాక నీళ్లు తాగే అలవాటు ఉంటే పొట్టలోని ఆమ్లాలు, ఫ్రక్టోజు, ఈస్ట్ కలిసిపోయి పలుచగా మారుతాయి. దీనివల్ల కడుపునొప్పి వస్తుంది. గ్యాస్ కూడా అధికంగా విడుదలవుతుంది. చివరికి గ్యాస్ట్రిక్ సమస్యగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గుండెల్లో మంట

పండ్లు తిన్నాక నీళ్లు తాగితే ఒక్కోసారి గుండెల్లో మంటకు కారణం అవ్వచ్చు. ఇది గ్యాస్టిక్ సమస్యల వల్ల ఏర్పడే మంట. జీర్ణ ఆమ్లాలు పలుచగా మారి పండ్లు జీర్ణం కావు. ఇది గుండెల్లో మంటగా మారిపోతుంది. కాబట్టి గుండె ఆరోగ్యం కోసం మీరు పండ్లు తిన్నాక నీళ్ళు తాగడం మానుకోవాలి.

పీహెచ్ స్థాయిలో సమతుల్యంగా ఉండడం చాలా అవసరం. జీర్ణవ్యవస్థలో పీహెచ్ స్థాయిలు మారకుండా చూసుకోవాలి. మీరు ఎప్పుడైతే పండ్లు తిన్నాక నీరు తాగుతారో పీహెచ్ స్థాయిల్లో మార్పు వస్తుంది. ఇది పొట్టలో ఆమ్లాలు అధికంగా విడుదల అయ్యేలా చేస్తుంది. కాబట్టి దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ, సీతాఫలం, పుచ్చకాయ, మ్యాంగో వంటి రకాల పండ్లు తిన్నప్పుడు మీరు నీళ్లు తాగకండి. ఒక గంట గ్యాప్ ఇచ్చాక నీళ్లు తాగండి. ఎందుకంటే ఆ పండ్లలో నీరే అధికంగా ఉంటుంది.

పండ్లు తిన్నాక నీరు తాగితే జీర్ణ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. దీనివల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అంతేకాదు పండ్లలోని పోషకాలు శరీరానికి అందవు. పొట్ట అసౌకర్యంగా ఉబ్బినట్టు అవుతుంది.

మధుమేహం ఉంటే

మధుమేహం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీరికి సాధారణంగానే సమస్యలు ఎక్కువగా వస్తాయి. జీర్ణ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఇలాంటివారు పండ్లు తిన్నాక నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థ మరింత అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఆహారం జీర్ణం అవ్వక కొవ్వుగా మారిపోతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగేలా చేస్తుంది. దీనివల్ల మీకు డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది. అంతేకాదు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.

కాబట్టి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డయాబెటిస్‌తో ఉన్నవారు, ఆ వ్యాధి లేనివారు కూడా పండ్లు తిన్నాక నీటిని తాగడం అనేది పూర్తిగా మానేయాలి. అరగంట నుంచి గంట వరకు గ్యాప్ ఇచ్చి అప్పుడు నీళ్లు తాగడం ముఖ్యం. చాలామందికి పండ్లు తిన్నాక దాహం వేసే అవకాశం తక్కువే. అయినా నోటిని శుభ్రపరుచుకునే ఉద్దేశంతో నీటిని తాగి మింగేస్తారు. దీనివల్లనే సమస్యలు వస్తున్నాయి. త

టాపిక్