డయాబెటిస్ ఉన్నవారు రోజుకు ఎన్ని ద్రాక్ష పండ్లు తినాలి?

pexels

By Haritha Chappa
Feb 16, 2024

Hindustan Times
Telugu

డయాబెటిస్ పేషెంట్లు ద్రాక్షపండ్లు తినొచ్చా లేదా అనే సందేహం ఎక్కువమందిలో ఉంది. నిజానికి ద్రాక్షపండ్లు తింటే ఎంతో ఆరోగ్యం. 

pexels

 ద్రాక్ష పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. 

pexels

ద్రాక్ష పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి పొట్ట నిండిన అనుభూతి త్వరగా కలుగుతుంది. ఇవి జీర్ణ క్రియకు సహాయపడతాయి. 

pexels

 ద్రాక్షలో పొటాషియం, మాంగనీస్, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.

pexels

ద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వాటిల్లో ఉండే రెస్వెరాట్రాల్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

pexels

డయాబెటిస్ పేషెంట్లు రోజుకు 10 నుంచి 15 పండ్ల కన్నా ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. 

pexels

ద్రాక్ష పండ్లను ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలతో లేదా ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవడం వల్ల వాటిలోని చక్కెరను శరీరం తక్కువగా శోషించుకుంటుంది. 

pexels

ఎండిన ద్రాక్షలతో పోలిస్తే తాజా పండ్లను తినడమే మంచిది. ఎందుకంటే వీటిలోనే చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. 

pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash