Indoor Exercises । మాన్‌సూన్‌లో మిమ్మల్ని ఫిట్‌గా ఉంచే ఇండోర్ వ్యాయామాలు..
వర్షాకాలంలో మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి ఇండోర్ వ్యాయామాలు మంచి ఛాయిస్ అవుతాయి. ఇంటి వద్దనే ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చో ఇక్కడ చూడండి.
రుతు పవనాల రాకతో పుడమి పులకించిపోతుంది. ఇప్పుడు ఎటు చూసినా పచ్చదనం, నిండైన జలాశయాలతో ఆహ్లాదకరంగా ఉంది. ప్రకృతి వైభవాన్ని పూర్తిగా చూడాలంటే ఏడాది మొత్తంలో వర్షాకాలం సరైన సమయం. అదే సమయంలో చలి, సీజనల్ వ్యాధులు, ఇతర సమస్యలు వేధిస్తాయి. ఈ సీజన్ మన రోగనిరోధక వ్యవస్థకు ఒక పరీక్ష. కాబట్టి వర్షాకాలాన్ని ఆస్వాదించాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగినంత విశ్రాంతి వర్షాకాలంలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచే కొన్ని అంశాలు.
ఈ సీజన్‌లో మిమ్మల్ని మీరు చురుకుగా, ఫిట్‌గా ఉంచుకోవటానికి రోజుకు 60 నిమిషాల వర్కవుట్ సెషన్ చేయాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అయితే వర్షాకాలంలో ఉదయం బయటకు వెళ్లాలంటే వర్షం, చలి వంటి అడ్డంకులు ఎదురవుతాయి. కాబట్టి ఈ వాతావరణ పరిస్థితుల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు కాలు బయటపెట్టకుండా ఇంట్లోనే చేసుకునే అనేక రకాల వ్యాయామాలు మీకు ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. వర్షాకాలంలో ఇండోర్ వ్యాయామం ఒక ఉత్తమైన ఛాయిస్. మరి ఎలాంటి వ్యాయామాలు చేయవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
ఇండోర్ వ్యాయామాల కోసం కొన్ని ఉదాహరణలు
యోగా
శారీరక, మానసిక ఆరోగ్యానికి అలాగే మెరుగైన విశ్రాంతి కోసం యోగా ఒక గొప్ప మార్గం. ఇప్పుడు యోగా నిపుణులు, ఫిట్‌నెస్ స్టూడియోలు అనేకమైన ట్యుటోరియల్ వీడియోలను ఆన్‌లైన్లో అందుబాటులో ఉంచారు. కాబట్టి మీకు తగిన యోగాభ్యాసాలను ఇంట్లోనే ప్రాక్టీస్ చేయవచ్చు.
పైలేట్స్
కొన్ని సాధారణ జిమ్ ఎక్విప్‌మెంట్లతో ఇంట్లోనే చేసుకునే ఒక గొప్ప వ్యాయామం. పైలేట్స్ చేయడం ద్వారా మీ శరీరాన్ని టోన్ చేయవచ్చు. అలాగే మీ శరీరం అని విధాలుగా సహకరించేలా వశ్యతను మెరుగుపరచవచ్చు. దీనికి సంబంధించి కూడా అనేక ట్యుటోరియల్ వీడియోలను ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి.
స్కిప్పింగ్
స్కిప్పింగ్ కూడా ఇంట్లోనే చేసుకునే ఒక మంచి వ్యాయామం. ఇది చేయడానికి మీకు కేవలం ఒక మంచి త్రాడు, కొద్దిగా ఖాళీ స్థలం ఉంటే చాలు. మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది. 10-15 నిమిషాలు స్కిప్పింగ్ చేయడం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి.
స్ట్రెంత్ ట్రైనింగ్
సంపూర్ణ ఆరోగ్యం, పూర్తి ఫిట్‌నెస్ కోసం స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా బాగా పని చేస్తుంది. ఇది కూడా మీరు ఇంటి లోపల సులభంగా చేయగలిగే ఒక వ్యాయామం. స్ట్రెంత్ ట్రైనింగ్ అంటే మరేమిటో కాదు.. బరువులు ఎత్తడం, గుంజీలు తీయడం, పుష్-అప్చ్ చేయడం, రెసిస్టెన్స్ బ్యాండ్‌లు ఉపయోగించడం ఇలా అనేక రకాలుగా చేయవచ్చు. ఇవి మీలో శక్తి, సామర్థ్యాలను పెంచుతాయి.
కార్డియో
మీ హృదయ స్పందన రేటును పెంచేటువంటి ఎన్నో రకాల కార్డియో వ్యాయామాలు ఇంటి నుంచే చేసుకోవచ్చు. స్పాట్ జాగింగ్, స్విమ్మింగ్, జంపింగ్ జాక్స్, స్కిప్పింగ్, మెట్లు ఎక్కుతూ దిగడం వంటివి మీకు కార్డియో వ్యాయామాలుగా ఉంటాయి.
సంబంధిత కథనం