Home Remedies for Headache । తొలనొప్పిని సులభంగా తగ్గించే 4 ఇంటి నివారణలు!-these 4 are the simple and effective home remedies for headache ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Headache । తొలనొప్పిని సులభంగా తగ్గించే 4 ఇంటి నివారణలు!

Home Remedies for Headache । తొలనొప్పిని సులభంగా తగ్గించే 4 ఇంటి నివారణలు!

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 04:04 PM IST

Home Remedies for Headache: తలనొప్పి అనేది ఎవరికైనా తరచుగా వేధించే సమస్య, తలనొప్పిని కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించి సహజంగా తగ్గించుకోవచ్చు.

Home Remedies for Headache
Home Remedies for Headache (Unsplash)

ప్రజలు తరచుగా బాధపడే అత్యంత సాధారణ నొప్పులలో తలనొప్పి ఒకటి. ఈ వింటర్ సీజన్‌లో చాలా మందికి తలనొప్పి పదేపదే వేధిస్తుంది. తలపోటు తగ్గించుకోవడానికి వెంటనే పెయిన్ కిల్లర్స్ మాత్రలు వేసుకుంటారు, నొప్పి నివారణ బామ్ లను అప్లై చేసుకొని ఉపశమనం పొందుతారు. మాత్ర వేసుకున్నాక కాసేపటికే తలనొప్పి తగ్గుతుంది, అయితే ఈ పెయిన్ కిల్లర్స్ వేగంగా నొప్పిని నివారించినట్లే, ప్రతిగా కొన్ని సైడ్ ఎఫెక్టలను కూడా కలిగిస్తాయి.

రోజువారీగా లేదా తరచుగా ఇలా తలనొప్పి మాత్రలు వాడటం వలన అవి మెదడు పనితీరును ఆటంక పరుస్తాయి. ఇవి నాడీ వ్యవస్థకు నొప్పి సందేశాల ప్రవాహాన్ని నియంత్రిస్తాయి. అదనంగా ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకశక్తి మందగించడం, తరచుగా చికాకు, అవిశ్రాంతమైన భావాలు మొదలైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. మీకు కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే అవి ఔషధాల ప్రభావమే. కాఫీ, టీలతో పాటు ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే సమస్య మరింత ఎక్కువ ఉంటుంది. అందువల్ల తలనొప్పిని ఎదుర్కోవటానికి సహజ మార్గాలను ఎంచుకోవాలని చెబుతారు.

Natural Home Remedies for Headache- తలనొప్పి నివారణకు సహజ మార్గాలు

శీతాకాలంలో చల్లని గాలి చెవుల్లోకి ప్రవేశించినపుడు కూడా తలనొప్పి కలుగుతుంది. మరి కారణం ఏదైతేనేం, తరచుగా ఇబ్బందిపెట్టే తలనొప్పిని ఎదుర్కోవటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి, అవి తలనొప్పిని నుంచి సులభంగా, సహజంగా ఉపశమనం కలిగిస్తాయి. మరి తలనొప్పిని నివారించే ఇంటి ఔషధాలను ఇక్కడ తెలుసుకోండి.

లవంగాలు

తలనొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందేందుకు లవంగం ఒక నేచురల్ హోం రెమెడీ. కొన్ని లవంగాలను చూర్ణం చేసి శుభ్రమైన రుమాలులో ఉంచండి. మీకు తలనొప్పి వచ్చినప్పుడల్లా, నొప్పి నుండి కొంత ఉపశమనం పొందే వరకు లవంగాల చూర్ణం వాసనను పీలుస్తూ ఉండండి. అలాగే గోరువెచ్చని పాలలో లవంగాలు, కొంచెం ఉప్పు వేసుకొని తాగినా ఉపశమనం కలుగుతుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క పోపుల పెట్టెలో కనిపించే ఒక సాధారణమైన సుగంధ దినుసు. ఇది ఆహారానికి మంచి రుచిని, సువాసనను జోడించగలదు. తలనొప్పి నివారణకు కూడా ఔషధంగా పనిచేస్తుంది. దాల్చినచెక్కను తురిమి, నీటిని కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. ఈ చూర్ణంను నుదిటిపై రోజుకు 3 నుండి 4 సార్లు వర్తించండి, తలనొప్పి తగ్గుతుంది. దాల్చినచెక్క టీలో కలుపుకొని తాగినా ప్రయోజనం ఉంటుంది.

తులసి

భారతీయ ఇళ్లలో తులసిని పూజిస్తారు. అదే సమయంలో తులసిలోని ఔషధ గుణాల కారణంగా, దీనిని అనేక ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తారు. తులసి నూనె అనాల్జేసిక్ లేదా పెయిన్ కిల్లర్‌గా సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఈ హెర్బ్ కండరాలను సడలిస్తుంది, ఒత్తిడి, బిగుతు కండరాల వల్ల కలిగే తలనొప్పిని నివారిస్తుంది. తలనొప్పిని వదిలించుకోవడానికి తులసి టీ కూడా అద్భుతమైనది.

పసుపు

తలనొప్పి నివారణకు పసుపు మరొక హోం రెమెడీ. తాజా పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మైగ్రేన్ దాడుల ఫ్రీక్వెన్సీని, తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు పాలలో ఒక కొద్దిగా తాజా పసుపు వేసి కాసేపు మరిగించాలి. ఆపై వడకట్టి గోరువెచ్చగా తాగాలి, తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం