Sunday Motivation : చిన్న చిన్న క్షణాలే.. పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా ఉండిపోతాయి
Sunday Motivation : ప్రేమించిన వ్యక్తితో చిన్న చిన్న క్షణాలే పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాటిని మిస్ చేసుకోవద్దు.
జ్ఞాపకం.. మెదడు పొరల్లో దాగి ఉన్న అనుభూతుల సమాహారం. మంచైనా.. చెడైనా మనల్ని అంటిపెట్టుకుని ఉండేవి ఆ జ్ఞాపకాలే. వాటిని పొగేసుకోవడమే ఈ జీవితం. మంచి జ్ఞాపకాల కోసం ట్రై చేయాలి. చిన్న చిన్న వాటికే ప్రేమించిన వ్యక్తిపై చిరాకు పడకూడదు. మీకో 60 ఏళ్లు వచ్చినాక.. మీరు ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచిస్తే.. ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో లెక్కపెట్టేందుకు కౌంట్ కూడా ఉండకూడదు. అప్పుడే మీ జీవితం హాయిగా నడుస్తుంది.
చాలా మంది చేసే అతిపెద్ద తప్పు.. చిన్న చిన్న విషయాల్లో చిరాకుపడటం. ప్రేమించిన వ్యక్తి మీతో ఏదో సరదాగా ఉన్న విషయాలకు సీరియస్ అవ్వకూడదు. బస్టాప్‌లోనో, కాలేజీలోనో.. మీరు ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా దాచుకోవాలి. అందుకోసం అల్లరి పనులు చేయాలి. అప్పుడే మీ ప్రియమైనవారు మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని బాధపెట్టండ తప్పు.. కానీ జ్ఞాపకాలను పొగేసుకునేందుకు వారిని ఆటపట్టించడం అస్సలు తప్పు కాదు.
కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం.. అందుకే మీ ప్రేమలో మీరు దాచిపెట్టుకునే విలువైన ఆస్తి జ్ఞాపకాలే. చిన్న చిన్న జ్ఞాపకాలే పెద్ద ఆనందాన్నిస్తాయి. వాటిని పొగేసుకునే విధానంమీకు తెలిసి ఉండాలి.
మీరు ప్రేమించిన వారు తిట్టినప్పుడు ఓర్చుకోవాలి..
ఎందుకంటే మీ ప్రేమ వారే కాబట్టి..!
మీరు ప్రేమించిన వారు అలిగితే బతిమిలాడాలి..
ఎందుకంటే వారే మీ ప్రాణం కాబట్టి..!
మీతో గడిపేందుకు మీ ప్రియమైన వారు ప్రయత్నిస్తే అస్సలు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొకరు మీమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ తెలుస్తుంది. ప్రాణం పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు గానీ.. మనం ప్రేమించినవారు నిర్లక్ష్యం చేస్తుంటే నిజంగానే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అందుకే దారం తెగేదాకా లాగొద్దు. తర్వాత అతికించడం కష్టం అవుతుంది. బంధం కూడా అంతే. ప్రేమతో మీ ప్రియమైన వారిని ఉక్కిరిబిక్కిరి చేయాలి. జ్ఞాపకాలతో ముంచేయాలి.
మంచి జ్ఞాపకం మనసులో పదిలంగా దాచుకోవాలి..
చెడు జ్ఞాపకాన్ని మెదడులో నుంచి పారదోలాలి..
లేకపోతే పదే పదే జ్ఞాపకానికి వచ్చి.. గుండెను కడలిని చేసి తుపాను రేగుతుంది..
ప్రేమికులైనా.. ఎవరైనా ఓ చిన్న విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత సంతోషంగా ఉండండి.. ఎందుకంటే మళ్లీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే సమయం కాదు.
జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు..పోతుంటారు. మనసుకు నచ్చినవారే మనతో ఉంటారు. వారితోనే ఏదైనా షేర్ చేసుకుంటాం. అలాంటివారితోనే మీ జ్ఞాపకాలు టన్నులు టన్నులు ఉండాలి. అప్పుడే ప్రతిక్షణం ఆనందంగా బతికేస్తారు. విడిపోయినా కూడా మంచి గుర్తులే మీ దగ్గర ఉంటాయి.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనేక పరిచయాలు, కలయిలకలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనస్సుకు కొన్ని కలయికలే చేరవవుతాయి. అందులో మన గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలే మనకు అవసరం. మిగతా చెత్త అంతా అనవసరం. జీవితమంటే.. కేవలం జ్ఞాపకాలే. మనల్ని ఒకరు గుర్తుపెట్టుకోవాలన్నా.. మనకు ఒకరు గుర్తుండాలన్నా జ్ఞాపకాలే ఆధారం.
చివరగా 'మన జ్ఞాపకాలే.. మన జీవితం'
టాపిక్