Summer Skin Care Routine । వేసవిలో చర్మం నల్లబడకుండా ఈ టిప్స్ పాటించండి!-summer skin care routine get rid of sunburn tanning tips to look fresh and fair ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Skin Care Routine । వేసవిలో చర్మం నల్లబడకుండా ఈ టిప్స్ పాటించండి!

Summer Skin Care Routine । వేసవిలో చర్మం నల్లబడకుండా ఈ టిప్స్ పాటించండి!

HT Telugu Desk HT Telugu
Mar 24, 2023 10:47 AM IST

Summer Skin Care Routine: ఎండాకాలంలో చర్మం నల్లబడటం, ట్యానింగ్, జిడ్డుగా మారటం మొదలైన సమస్యల నుంచి బయటపడేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

Sunburn - Tips
Sunburn - Tips (shutterstock)

ఎండాకాలంలో కఠినమైన సూర్యకాంతి వలన చర్మం నల్లబడటం, ట్యానింగ్, జిడ్డుగా మారటం మొదలైన సమస్యలు రావడం సర్వసాధారణం. బలమైన ఎండకు డీహైడ్రేషన్ కలిగి చర్మం మరింత నిర్జీవంగా మారుతుంది. చర్మంపై దురద, చికాకు, మంట వంటివి కలిగి మొటిమలు ఏర్పడటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉండే వారు ఎండవేడికి త్వరగా ప్రభావితం అవుతారు. సరైన చర్మ సంరక్షణ విధానాలు అవలబించడం ద్వారా ఎండాకాలంలోనూ మీ చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ వేసవిలో చర్మ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని సహజ మార్గాలు ఉన్నాయి, ఇవి సన్ ట్యాన్‌ను తొలగించి చర్మాన్ని లేత రంగులోకి మారుస్తాయి.

ఎండలో తిరిగి వచ్చినపుడు మీ చర్మం నల్లబడకుండా తక్షణ ఉపశమనంగా మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. తర్వాత మెత్తని టవల్‌తో తుడవండి. ఆ తర్వాత దానిపై అలోవెరా జెల్‌ను అప్లై చేయాలి. అలోవెరా, దోసకాయ నీళ్లను కూడా ముఖానికి రాసుకోవచ్చు. అలోవెరా జెల్‌ను సేకరించి, ఫ్రిజ్ లోని ఐస్ ట్రేలో ఉంచి, ఘనీభవించేలా చేసి, ఎప్పుడైనా వాడుకోవచ్చు.

Summer Skin Care Routine- వేసవిలో చర్మ సంరక్షణ చిట్కాలు

సన్ బర్న్, ట్యానింగ్ బారిన పడకుండా మీ చర్మాన్ని కాపాడుకునేందుకు ఈ కింద పేర్కొన్న చర్యలు తప్పకుండా తీసుకోవాలి.

మీ చర్మాన్ని శుభ్రపరచండి

వేసవి చర్మ సంరక్షణకు శుభ్రత ముఖ్యం. ఆల్కహాల్ లేని ఫేస్‌వాష్‌ను ఉపయోగించి, రోజుకు 2-3 సార్లు ముఖం కడుక్కోండి, రెండు సార్లు స్నానం చేయండి.

చర్మాన్ని మృదువుగా ఎక్స్‌ఫోలియేట్ చేయండి

పొడి చర్మం, మృత చర్మ కణాలను తొలగించడానికి వారానికి రెండుసార్లు సున్నితమైన స్క్రబ్‌ను ఉపయోగించి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి

తేలికపాటి మాయిశ్చరైజర్‌ వాడండి

పలుచటి మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి, ఇది మీ చర్మాన్ని సూర్యుడి నుండి కాపాడుతుంది.

సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి

మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసిన తర్వాత, SPF 30 కలిగిన సన్‌స్క్రీన్‌ని మీ ముఖం, మెడ, చేతులపై SPF 30తో సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి.

హైడ్రేటెడ్ గా ఉండండి

వేసవి చర్మ సంరక్షణలో నీరు తాగడం చాలా అవసరం. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది , శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

ఎండలో రక్షణ

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం, గొడుగు లేదా టోపీని ధరించడం మర్చిపోవద్దు. వీలైనంత వరకు, మీ చర్మాన్ని కప్పి ఉంచే తేలికైన కాటన్ దుస్తులను ధరించండి.

Whats_app_banner

సంబంధిత కథనం