How To Forget a Bad Memory। మీ జీవితంలోని ఆ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోలేకపోతున్నారా? ఈ పని చేయండి!
How To Forget a Bad Memory: చేదు జ్ఞాపకాలను మరచిపోవడానికి ఏదైనా మార్గం, మందు ఉందా అంటే? నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు అందించారు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
How To Forget a Bad Memory: జీవితంలో ప్రతీ ఒక్కరికి చేదు జ్ఞాపకాలు అనేవి ఉంటాయి. కొందరికి డబ్బు, హోదా, అంతస్తు అన్నీ ఉన్నప్పటికీ జీవితంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక చేదు జ్ఞాపకం వెంటాడవచ్చు. బంధాలు విడిపోవడం, నమ్మకద్రోహం జరగడం, అవమానాల పాలవడం ఇలా ఏవైనా ఉండవచ్చు. చేదు జ్ఞాపకాలను అందరూ ఒకేలా స్వీకరించకపోవచ్చు. కొందరు సులభంగా మరిచిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే, మరికొందరు అవే జ్ఞాపకాల్లో బ్రతుకుతూ కుమిలిపోతూ ఉంటారు.
ఎందుకంటే మరచిపోవడానికి అదేమి వస్తువు కాదు, జ్ఞాపకం. జ్ఞాపకాలను వదిలేయడం అనుకున్నంత సులభం కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, గతానికి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్‌లు మళ్లీ మన మెదడును తడతాయి. గుండె పగిలిన నాటి జ్ఞాపకం గుర్తుకు వచ్చిన ప్రతీసారి మన మనశ్శాంతిని దోచుకుంటున్నట్లు అనిపిస్తుంది. మరి ఆ చేదు జ్ఞాపకాలను మరచిపోవడానికి ఏదైనా మార్గం, మందు ఉందా అంటే? నిపుణులు కొన్ని సలహాలు, సూచనలు అందించారు. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
అనుభవం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించండి
మీకు ఏదైనా నేర్పడానికి జీవితంలో ఒక చెడ్డ రోజు వస్తుంది కావచ్చు. ఆ అసహ్యకరమైన సంఘటనను మరిచిపోవడం అంత సులభం కాకపోవచ్చు. బదులుగా, అది మీ మంచికే జరిగింది అని భావించండి. ఆ అనుభవం నుంచి ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. చాలా మందికి చేదు అనుభవాలే తమను ఒక స్థాయిలో నిలబెట్టాయి అని చెబుతారు. కాబట్టి మీరు భరించిన ఆ అనుభవం మిమ్మల్ని మీరు ఒక ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్రేరణగా ఉపయోగించుకోండి.
ఈ రోజుపై దృష్టి పెట్టండి
నిన్నటి గురించి కాకుండా ఈరోజుపై మీ దృష్టి పెట్టండి. మీ పని మీరు యధావిధిగా చేసుకుంటూపోండి, గతం గురించి ఆలోచిస్తూ ఈరోజు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రస్తుతం మీ జీవితంలోని మంచి విషయాల వైపు మీ దృష్టిని మళ్లించండి. మీకు అండగా నిలిచి మీకు మద్దతుగా నిలిచిన వ్యక్తులతో కాలం గడపండి. కాలం గడిచేకొద్దీ, మీ జీవితంలో కొత్త అనుభవాలు వెలుగులోకి వస్తాయి, ఆ చెడ్డ జ్ఞాపకాలు మసకబారడం ప్రారంభిస్తాయి.
మీ భావోద్వేగాలను గుర్తించండి
చెడు జ్ఞాపకాలకు సంబంధించిన భావోద్వేగాలు తరచూ మీలో కలగవచ్చు. వాటి గురించి కలత చెందడం, కోపం రావడం లేదా బాధించడం సహజం. అయినప్పటికీ, దానికి కారణాలు వెతకకండి, మీపైనా గానీ, ఇంకెవరిపైన గానీ నిందలు మోపకండి. అప్పటి కాలం మనది కాదని అనుకోండి. మీ భావోద్వేగాలు గుర్తిస్తూ వాటిని అనుభూతి చెందడం కూడా మంచిదే, ఇది మీరు ఆ జ్ఞాపకాల నుంచి ఊరట పొందటానికి సహాయపడుతుంది.
మద్దతు కోరండి
మీరు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతుంటే, మీకు మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా మీరు మీ భావాలను అర్థం చేసుకునే వారి మద్ధతు కోరండి. వారి మాటలు, సాన్నిహిత్యం మిమ్మల్ని తేలికపరుస్తాయి. ఎవరూ లేకపోతే ఎవరైనా మనస్తత్వ నిపుణులను సంప్రదించండి. వారి మార్గదర్శకత్వంతో మీరు సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లగలరు.
చివరగా చెప్పేదేమిటంటే.. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది, అప్పటివరకు మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీకు కావాల్సింది ఓపిక, సహనం.
సంబంధిత కథనం
టాపిక్