Benefits of Himalayan Salt : ఉపవాస సమయంలో హిమాలయన్ ఉప్పు ఎందుకు వాడాలో తెలుసా?-some health benefits of himalayan salt here is the details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Benefits Of Himalayan Salt : ఉపవాస సమయంలో హిమాలయన్ ఉప్పు ఎందుకు వాడాలో తెలుసా?

Benefits of Himalayan Salt : ఉపవాస సమయంలో హిమాలయన్ ఉప్పు ఎందుకు వాడాలో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Sep 30, 2022 08:35 AM IST

Health Benefits of Himalayan salt : హిమాలయన్ ఉప్పు గురించి ఇప్పటివరకు వినే ఉంటాం. చాలామందికి దాని గురించి తెలియకపోవచ్చు కూడా. అయితే ఈ హిమాలయన్ ఉప్పును వాడడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>హిమాలయన్ ఉప్పు</p>
హిమాలయన్ ఉప్పు

Health Benefits of Himalayan salt : ప్రస్తుతం దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గా దేవిని పూజిస్తూ.. తొమ్మిది రోజుల ఉత్సవం చేస్తారు. ఈ పండుగ సమయంలో చాలా మంది భక్తులు ఉపవాసం ఉంటారు. ఈ తొమ్మిది రోజులలో అమ్మవారిపై తమ భక్తిని చాటుకునేందుకు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటారు. సులువైనా, సాత్వికమైన భోజనాన్ని తీసుకుంటారు.

వాటిలో సాంప్రదాయ టేబుల్ ఉప్పు ఒకటి. దీనిని ఉపవాసం సమయంలో ఎక్కువమంది తీసుకోరు. అయితే దానికి బదులు హిమాలయన్ ఉప్పు అని పిలిచే రాక్ సాల్ట్‌ను ఆహారం తయారు చేసేటప్పుడు ఉపయోగిస్తారు. హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్ భారత ఉపఖండంలోని హిమాలయ పర్వతాలలో కనిపిస్తుంది. ఇది స్వచ్ఛమైన, సేంద్రీయమైనది. టాక్సిన్స్, రసాయనాలు లేనిదిగా దీనిని పరిగణిస్తారు.

ముఖ్యంగా నవరాత్రి, ఏకాదశి సమయంలో.. హిందూ వ్రతాలు, ఉపవాసాల సమయంలో హిమాలయన్ ఉప్పును వాడతారు. అయితే దీనిని ఎందుకు వినియోగిస్తారు. దీని వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుగైన జీర్ణక్రియ

హిమాలయన్ ఉప్పు శరీరంలోని పోషకాలను శోషణ వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.

రక్తపోటు నియంత్రణకై

హిమాలయన్ ఉప్పులో తక్కువ సోడియం, అధిక పొటాషియం స్థాయిలు ఉంటాయి. కాబట్టి ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

శరీరంలో వేడిని తగ్గిస్తుంది

నవరాత్రులు వాతావరణంలో మార్పు కోసం సమయం. హిమాలయన్ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరాన్ని అంతర్గతంగా చల్లబరుస్తుంది. నీరు నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి

హిమాలయన్ ఉప్పు వినియోగం తర్వాత రసాయన ప్రతిచర్యలు జీవక్రియను మెరుగుపరచడంలో, దాని పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల బరువు కూడా తగ్గుతారు.

రోగనిరోధక శక్తిని పెంచడానికై

హిమాలయన్ ఉప్పులో అయోడిన్, జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఇవి మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.

ఉపవాస సమయంలో చాలా మంది పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి.. హిమాలయన్ ఉప్పు వారిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఉపవాస సమయంలో హిమాలయన్ ఉప్పు తీసుకోవాలి అంటారు.

Whats_app_banner

సంబంధిత కథనం