Live Life To The Fullest । మీకు వందేళ్లు బ్రతకాలని ఉందా? ఈ 10 నియమాలు పాటించండి చాలు!
Live Life To The Fullest: మీ జీవితాన్ని మార్చగల 10 నియమాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తే 100 ఏళ్లు గ్యారెంటీగా జీవించవచ్చు
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లమని మన పెద్దలు దీవిస్తారు. కానీ నేటికాలంలో ఎంత బలంగా దీవించినా నూరేళ్లు బ్రతకాలి అంటే అది మన అత్యాశే అవుతుంది. పేలవమైన జీవనశైలి, క్షీణిస్తున్న జీవణ ప్రమాణాలు మనిషి సగటు ఆయుర్ధానంను కుచించి వేస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా నాటి జీవనశైలిని అనుసరిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
మనం చిన్నప్పుడు చదువుకొనే ఉంటాం 'ఎర్లీ టూ బెడ్, ఎర్లీ టూ రైజ్..' అని, కానీ పెద్దయ్యాక క్రమంగా ఆ విషయాన్ని మరిచిపోయి ఉంటాం. కానీ అలాంటి జీవనశైలి నిజంగా మన జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది.
భారతీయ సంప్రదాయంలోని కొన్ని నియమాలు నిజంగా మన జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సైన్స్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తుంది. చాలా మంది వైద్యులు ఇప్పుడు ఎక్కువ కాలం జీవించడానికి పాత పద్ధతిలో పూర్వీకులు జీవించినట్లు జీవించాలని సలహా ఇస్తున్నారు. మన పాత సంప్రదాయాల నుండి నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిని అనుసరించడం ద్వారా దీర్ఘాయుష్షును పొందవచ్చు.
మీ జీవితాన్ని మార్చగల 10 నియమాల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. ఈ నియమాలను తు.చ. తప్పకుండా పాటిస్తే 100 ఏళ్లు గ్యారెంటీగా జీవించవచ్చునని భారతీయ యోగాకు చెందిన యోగా గురువు, ఆచార్య ప్రతిష్ఠ చెబుతోంది. భారతీయ సంస్కృతిలోని ఈ 10 నియమాలను పాటించడం ద్వారా మనం వ్యాధులకు దూరంగా ఉండి దీర్ఘాయుష్షు పొందవచ్చు. మరి ఆ పది నియమాలను తెలుసుకోండి.
Live Life To The Fullest - 100 ఏళ్లు జీవించడానికి 10 నియమాలు
- మొదటి నియమం: బ్రహ్మ ముహూర్తంకు ముందే మేల్కోవాలి అని ఆమె మొదటి నియమాన్ని చెబుతుంది. అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం. సూర్యోదయానికి ముందే నిద్రలేవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన మెలనిన్, కార్టిసాల్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. పని చేసే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
- రెండవ నియమం: ఉదయం నిద్రలేచిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి. సూర్యుడు, భూమి, గాలి, నీరు, చెట్లు ఈ ప్రకృతిలో దేనితో అయినా కృతజ్ఞత కలిగి ఉండండి. ఇది మీరు జీవించి ఉన్నదానికి కృతజ్ఞతా భావాన్ని కలిగిస్తుంది. దీని వలన మనస్సులో విచారం ఉండదు.
- మూడవ నియమం: యోగా ఆసనాలు ఆచరించడం, ప్రాణాయామం, ధ్యానం, ముద్ర, బంధ, గతి మొదలైన వాటిని క్రమం తప్పకుండా అభ్యాసం చేయండి.
- నాల్గవ నియమం: సూర్యునికి అర్ఘ్యం. ఇలా చేయడం వల్ల మన కళ్లు, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయి. విటమిన్ డి లభిస్తుంది.
- ఐదవ నియమం: స్నానం ఆచరించండం. ఉదయం అన్ని కార్యక్రమాలు ముగించుకొని స్నానం చేయడం వల్ల రక్తపోటు నార్మల్‌గా ఉంటుంది, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అదే సమయంలో, శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
- ఆరవ నియమం: నేలపై కూర్చొని అల్పాహారం చేయడం ఆరవ నియమం. నేలపై కాళ్లు పెట్టుకుని లేదా వజ్ర భంగిమలో కూర్చొని ఆహారం తినడం వల్ల కడుపు ఉబ్బడం ఉండదు, ఊబకాయం పెరగదు. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు ఉండవు అలాగే ఎసిడిటీ, జీర్ణక్రియ సమస్య కూడా ఉండదు.
- ఏడవ నియమం: భోజనం మీ చేతులతో తినడం. కత్తి, ఫోర్క్, స్పూన్ వంటివి వదిలి, శుభ్రమైన చేతులతో ఆహారాన్ని తినండి. ఇది భారతదేశ సాంప్రదాయ పద్ధతి. మన చేతుల వేళ్లలో నరాల చివరలు ఉంటాయి. అవి మనస్సుతో అనుసంధానించి ఉంటాయి. మనం ఆహారాన్ని తాకినప్పుడు, ఆహారం రాబోతుందని మెదడుకు సంకేతాలు అందుతాయి. ఇది మన జీర్ణవ్యవస్థను సిద్ధం చేస్తుంది. కత్తితో, ఫోర్క్‌తో తిన్న ఆహారం వ్యవస్థకు సడన్ షాక్ లాంటిది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది.
- ఎనిమిదవ నియమం: శరీరానికి ఆయుర్వేద మసాజ్ చేయాలి. మర్దనతో అనేక వ్యాధులను నయం చేయగల చికిత్సలు, అనేక రకాల మసాజ్‌లు ఆయుర్వేదంలో ఉన్నాయి.
- తొమ్మిదవ నియమం: ఇంట్లో వండిన ఆహారం మాత్రమే తినండి. భారతీయ సాంప్రదాయ వంటలలో అనేక సుగంధ ద్రవ్యాలు, మూలికలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సాంప్రదాయకంగా ఇంట్లో వండిన ఆహారం మన ఆరోగ్యానికి మంచిది.
- పదవ నియమం: కుటుంబంతో ప్రేమగా ఉండటం, బంధాలు అనుబంధాలను దగ్గరకు తీసుకోవడం. నేడు ఎక్కడ చూసిన డబ్బు కోసం, ఆస్తి కోసం, పంతాల కోసం కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కానీ ఉమ్మడి కుటుంబం భారతీయ సంస్కృతిలో భాగం. మీరు డిప్రెషన్‌లో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది లేదా ఒంటరితనంలో ఉన్నప్పుడు కుటుంబం ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది.
ఈ పది నియమాలు పాటిస్తే వందేళ్ల జీవితం మీదే!
సంబంధిత కథనం