Oral Hygiene । టూత్ బ్రష్ మారుస్తున్నారా? నోటి ఆరోగ్యానికి ఇవన్నీ తప్పనిసరి!
Oral Hygiene: సరైన నోటి పరిశుభ్రతతో దంతాల కావిటీస్, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసన ఇతర నోటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
Oral hygiene: ఎలాంటి అనారోగ్య సమస్యల నివారణకైనా నోటి పరిశుభ్రత చాలా అవసరం. సరైన నోటి పరిశుభ్రతతో దంతాల కావిటీస్, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసన (హాలిటోసిస్) ఇతర నోటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. దంతాలను శుభ్రపరుచునే అలవాట్లు మెరుగ్గా ఉంటే మీ చిరునవ్వు అందాన్ని కాపాడుకోవచ్చు, మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, జహంగీర్ హాస్పిటల్‌లోని డెంటల్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ ఆకాష్ మాట్లాడుతూ.. “అద్భుతమైన నోటి పరిశుభ్రత కోసం అలవాట్లు ఎలా ఉండాలంటే రోజుకు రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయడం, రోజుకు ఒకసారి ఫ్లాస్ చేయడం, మీ నాలుకను శుభ్రపరచడం, పొగాకు వాడకాన్ని నివారించడం" చేయాలి. ఈ ప్రాథమిక అంశాలని మీ రోజూవారీ దినచర్యలో చేర్చడం చాలా ముఖ్యం అని డెంటిస్టులు అంటున్నారు.
ప్రతి రెండు నెలలకొకసారి టూత్ బ్రష్‌ను మార్చడం చాలా ముఖ్యం, అలాగే నాలుక స్క్రాపర్, ఫ్లాసర్ కూడా మార్చాలి. ఈ సాధనాలు మీ దంతాలు, చిగుళ్ళు, నాలుకను శుభ్రంగా ఉండేలా చూస్తాయి. పంటినొప్పి, చిగుళ్ళలో వాపు వంటి బాధాకరమైన పరిస్థితులకి దారితీసే అసౌకర్యాలను నివారిస్తాయి. భోజనం చేసిన తర్వాత ఉప్పునీరు పుక్కిలించడం సహజమైన మౌత్‌వాష్‌గా పని చేస్తుంది, ఇది మీ నోటి పరిశుభ్రత దినచర్యను మరింత మెరుగుపరుస్తుంది.
గ్లోబల్ డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్‌లో డెంటల్ సర్జన్ అయినటువంటి డాక్టర్ శృతి శ్రీవాస్తవ మంచి నోటి పరిశుభ్రత ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఆమె ప్రకారం, సరైన నోటి పరిశుభ్రత కోసం సాఫ్ట్-బ్రిస్టల్ బ్రష్, టూత్‌పేస్ట్, ఫ్లాస్, నాలుక క్లీనర్, మౌత్ వాష్ వంటి ముఖ్యమైన ఉత్పత్తులను తప్పకుండా ఉపయోగించాలి. అప్పుడే నోటి ఆరోగ్యం బాగుండి, ఎలాంటి రోగాలు దరిచేరవని ఆమె సలహా ఇచ్చింది.
సాఫ్ట్-బ్రిస్టల్ బ్రష్‌తో రోజూ రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల ఆహార శిధిలాలు, దంత ఫలకాన్ని సమర్థవంతంగా తొలగించవచ్చు, దంత సమస్యలను నివారించవచ్చు. కావిటీస్‌ను నివారించడానికి ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ సిఫార్సు చేయడమైనది. దంతాల ప్లాసింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి అనుకూలమైన ఇంటర్‌డెంటల్ ఫ్లాస్ లను డాక్టర్ శ్రుతి శ్రీవాస్తవ హైలైట్ చేశారు. కడుపు సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడానికి నాలుకను శుభ్రపరచడం ప్రాముఖ్యతను కూడా ఆమె ఎత్తిచూపారు మౌత్‌వాష్‌ను ఉపయోగించడం వల్ల తాజా శ్వాసను నిర్వహించడానికి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడానికి గొప్పగా ఉపయోగపడుతుందని ఆమె నొక్కి చెప్పారు.
ఈ రకమైన నోటి పరిశుభ్రత పద్ధతులను ప్రతిరోజు అవలంబించడం వలన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అందమైన, ఆరోగ్యకరమైన చిరునవ్వును పొందవచ్చునని డెంటిస్టులు సలహా ఇస్తున్నారు.
సంబంధిత కథనం