Home Remedies for Conjunctivitis : కండ్ల కలక వస్తే.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి.. -simple home remedies to treat the eye condition in conjunctivitis ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Conjunctivitis : కండ్ల కలక వస్తే.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి..

Home Remedies for Conjunctivitis : కండ్ల కలక వస్తే.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 18, 2022 08:33 AM IST

Home Remedies for Conjunctivitis : ఈ సీజన్​లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కండ్ల కలక. ప్రస్తుతం కేసులు పెరుగుతున్నాయి అంటున్నారు నిపుణులు. వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పులు దీనికి ప్రధాన కారణ అంటున్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్​కు గురైనా.. ఇంట్లోనే దీనిని తగ్గించుకోవచ్చు అంటున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

<p>కండ్ల కలక వస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..</p>
కండ్ల కలక వస్తే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Home Remedies for Conjunctivitis : దీర్ఘకాలంగా, అకారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా కండ్లకలక వంటి కంటి ఇన్ఫెక్షన్‌లు పెరుగుతున్నాయి. దీనినే పింక్ కళ్లు అని కూడా పిలుస్తారు. దీని లక్షణాలు ఎరుపు, దురద, నీటితో నిండిన కళ్లు. దీనితో బాధ పడుతున్నవారు ఓవర్ ది కౌంటర్ డ్రాప్స్‌తో స్వీయ వైద్యం చేయవద్దని సలహా ఇస్తున్నారు వైద్యులు డాక్టర్ నీతా షా. అయితే ఇంట్లోనే సాధారణ నివారణలు పాటిస్తూ.. కండ్లకలకు తగ్గించుకోవచ్చని.. పలు మార్గాలు సూచిస్తున్నారు.

ప్రస్తుతం కండ్లకలక ఉన్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. కళ్ల చుట్టూ ఎరుపు, నీరు, దురద, గుచ్చుకోవడం, నొప్పి, వాపు వంటివి కండ్లకలక అత్యంత సాధారణ లక్షణాలు. కండ్లకలక ఉన్న చాలా మంది రోగులు కొంత వైరల్ జలుబు, దగ్గు, జ్వరంతో కూడా బాధపడుతూ ఉంటారు. అయితే మీకు ఈ సమస్య వస్తే ఏమి చేయాలో.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరైనా కండ్లకలక లక్షణాలలో ఒకదానినైనా గుర్తిస్తే.. వారు వెంటనే సమీపంలోని కళ్ల వైద్యుడిని సంప్రదించాలి. అంతేకానీ.. ఓవర్-ది-కౌంటర్ డ్రాప్స్‌తో స్వీయ వైద్యం చేసుకోకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అవి దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కలిగి ఉంటాయని తెలిపారు.

కండ్ల కలక సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* డాక్టర్ సూచించిన విధంగా కంటి చుక్కలు లేదా లూబ్రికెంట్లను ఉపయోగించండి. ఓవర్-ది-కౌంటర్ ఉత్పత్తులను ఉపయోగించడం అస్సలు మంచిది కాదు.

* మీ కళ్లను చేతులతో తాకకండి. చేతులలోని బ్యాక్టిరీయా ఈ సమస్యను మరింత పెంచే అవకాశముంది. మీ కళ్లను నీళ్లు చిమ్మరిస్తూ.. శుభ్రం చేసుకోండి.

* ఎక్కువ నీరు తాగితూ.. హైడ్రేటెడ్​గా ఉండండి.

* కండ్లకలక సులువుగా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి.. కండ్లకలక ఉన్నవారు ఒంటరిగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

* కాంటాక్ట్ లెన్సులు వాడటం మానేయాలి. బయటకు వెళ్లాల్సి వస్తే.. కళ్లకు షేడ్స్ పెట్టుకుని వెళ్లండి.

* కండ్లకలక సాధారణంగా రెండు రోజుల్లో తగ్గిపోతుంది కాబట్టి కంగారు పడకండి. తగ్గకుంటే.. వైద్యుని సూచనలు కచ్చితంగా పాటించండి.

Whats_app_banner

సంబంధిత కథనం