Tomato salan: నోరూరించే టమాటా సాలన్
Tomato salan: టమాటా సాలన్ సులభంగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో తెలుసుకోండి.
tomato salan (pexels)
టమాటా కూరంటే ఇంట్లో ఏ కూరగాయలూ లేనప్పుడోె, లేదా సమయం లేనప్పుడో చేస్తుంటాం. కానీ టమాటాతో కూడా అదిరిపోయే మసాలా కూర చేయొచ్చు. అదే టమాటా సాలన్. ఇది బిర్యానీ లోకి కూడా పులపుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.
కావాల్సిన పదార్థాలు:
4 టమటాలు (ఒక్కోటి రెండు ముక్కలు చేసుకోవాలి)
3 చెంచాల పల్లీలు
1 చెంచా నువ్వులు
2 చెంచాల కొబ్బరి తురుము
సగం చెంచా ధనియాలు
1 చెంచా జీలకర్ర
3 కప్పుల నీళ్లు
31 చెంచాల నూనె
సగం చెంచా ఆవాలు
కొద్దిగా ఇంగువః
చిన్న ఉల్లిపాయ తరుగు
10 వెల్లుల్లి
సగం చెంచా పసుపు
1 చెంచా కారం పొడి
1 చెంచా గరం మసాలా
1 చెంచా ఉప్పు
1 రెమ్మ కరివేపాకు
2 పచ్చిమిర్చి
సగం కప్పు చింతపండు గుజ్జు
కొద్దిగా కొత్తిమీర
తయారీ విధానం:
- ముందుగా ఒక ప్యాన్ లో నూనె లేకుండా పల్లీలు వేయించుకోండి. నువ్వులు, కొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి.
- సగం కప్పు నీల్లు పోసుకుని మసాలాలన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఒక ప్యాన్ లో 2 చెంచాల నూనె తీసుకుని, చెంచా ఆవాలు, ఇంగువ, జీలకర్ర, ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లి వేసి వేగనివ్వండి.
- కాసేపయ్యాక పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు కూడా వేసుకోండి. ఇపుడు మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి.
- నూనె తేలేదాక వేగనిచ్చి, ఇపుడు రెండు కప్పుల నీళ్లు, చిన్న బెల్లం ముక్క వేసుకోండి. పదినిమిషాలు ఉడకనిచ్చి టమాటా ముక్కలు, చింతపండు గుజ్జు వేసుకుని 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి.
- చివరగా టమటాలు మగ్గాక రెండు స్పూన్ల కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే చాలు. టమాటా సాలన్ రెడీ. బిర్యానీ లోకి, చపాతీ లోకి చాలా బాగుంటుంది.
టాపిక్