Sick During Season Change : పెరుగుతున్న సీజనల్ వ్యాధులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి..
Sick During Season Change : శీతాకాలం వస్తున్న సమయంలో సీజనల్ వ్యాధులు, వైరస్లు మనల్ని బాగా ఎటాక్ చేస్తాయి. చాలామంది జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇతర లక్షణాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సీజన్ మారినప్పుడు.. అనారోగ్యం బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Sick During Season Change : వేసవి నుంచి శీతాకాలానికి మారే క్రమంలో వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం మనం ఆ సీజన్‌లో ఉన్నాము. పైగా ఇవి సరిపోవు అన్నట్లు వర్షాలు కూడా అకారణంగా, భారీగా వస్తున్నాయి. దీపావళి కూడా దగ్గర్లో ఉంది. పండుగ సమయంలో ఆనందంగా ఉండాలి కానీ.. అనారోగ్యంతో కాదు. మరి ఈ సీజన్‌లో అనారోగ్యం బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సీజన్ మార్పు సమయంలో అనారోగ్యానికి గురవుతామంటే..
చాలా మంది నిపుణులు సీజన్ మార్పు సమయంలో అనారోగ్యానికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలో మార్పుగా చెప్తారు. దీని కారణంగా కొన్ని వైరస్లు పెరుగుతాయని వారు నమ్ముతారు. జలుబుకు కారణమయ్యే రెండు ప్రధాన వైరస్‌లు రైనోవైరస్, కరోనావైరస్ కూడా ఈ సమయంలోనే ఎక్కువగా వృద్ధి చెందుతాయి.
మానవ శరీరం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద విధులు నిర్వహిస్తుంది. కాలానుగుణ మార్పుల సమయంలో.. మన శరీరం కొత్త వాతావరణ పరిస్థితులకు తిరిగి అలవాటు పడవలసి వస్తుంది. ఈ సమయంలో శరీరం వైరస్లు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో మనం ఎక్కువగా అనారోగ్యానికి గురవుతాము.
సీజన్-ప్రేరిత అనారోగ్యం లక్షణాలు
ముక్కు కారటం, గొంతు నొప్పి, చలి, నొప్పులు, జ్వరం మీరు కాలానుగుణ అనారోగ్యం సమయంలో అనుభవించే అత్యంత సాధారణ లక్షణాలు. కొందరు వ్యక్తులు అదే కారణంగా అలసట, మైకముతో ఉంటారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరం సాధారణ విధులను నిర్వహించడానికి, ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది కాబట్టి.. అలసటగా ఉంటుంది.
నివారణ చిట్కాలు
మీరు బాగా సమతుల్య ఆహారం తీసుకుంటూ.. రోజువారీ తగినంత నిద్ర పొందాలి. దీనితో పాటు వ్యాయామం చేయడం లేదా శారీరక శ్రమలో పాల్గొనడం కూడా మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నీటి వినియోగం, సీజన్‌తో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ రోజుకు 2.5 లీటర్ల కంటే ఎక్కువగా తాగాలి. విటమిన్ డి స్థాయిలను మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించాలి.
మీ శరీరాన్ని అర్థం చేసుకోండి
ఉష్ణోగ్రత మార్పుల్లో భాగంగా మీ శరీరం చేసే సర్దుబాటు, సౌకర్యాన్ని మీరు అర్థం చేసుకోవాసి. సాయంత్రం లేదా రాత్రిపూట స్నానం చేయడం మానేయండి. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో స్నానం చేస్తే.. చలి నుంచి మీ శరీరాన్ని రక్షించినవారు అవుతారు. వాతావరణాన్ని బట్టి తేలికైన నుంచి బరువైన ఉన్ని దుస్తులను ధరించండి. ఎయిర్ కండీషనర్‌కు బాయ్ చెప్పి.. ఫ్రిజ్‌లో ఉంచిన చల్లని నీటిని, డ్రింక్‌లు తాగకుండా చూసుకోండి.
ఇప్పటికే అనారోగ్యంతో ఉంటే ఏమి చేయాలి
మీలో ఇప్పటికే పైన పేర్కొన్న లక్షణాలలో ఏవైనా కనిపించడం ప్రారంభించినట్లయితే.. వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. అంతేకాకుండా మీరు గోరువెచ్చని నీటిని తాగడం, పండ్లను తినడం ప్రారంభించవచ్చు. జింక్, విటమిన్లు సి, డి, ఎ వంటి పోషకాలతో కూడిన పోషకమైన భోజనం తీసుకోండి. తగినంత విశ్రాంతి తీసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్