Couple jewellery: ఏ జంటకు అయినా నచ్చేసే కపుల్ జ్యువెలరీ ఐడియాలు, మీ భాగస్వామి కోసం మంచి గిఫ్ట్ ఐడియా కూడా-see these trendy couple jewellery ideas and couple gift options ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Couple Jewellery: ఏ జంటకు అయినా నచ్చేసే కపుల్ జ్యువెలరీ ఐడియాలు, మీ భాగస్వామి కోసం మంచి గిఫ్ట్ ఐడియా కూడా

Couple jewellery: ఏ జంటకు అయినా నచ్చేసే కపుల్ జ్యువెలరీ ఐడియాలు, మీ భాగస్వామి కోసం మంచి గిఫ్ట్ ఐడియా కూడా

Koutik Pranaya Sree HT Telugu
Aug 30, 2024 09:30 AM IST

Couple jewellery: భార్యాభర్తలు, ప్రేమికులు కపుల్ జ్యువెలరీ చేయించుకోవాలి అనుకుంటే కొన్ని మంచి ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని మీ భాగస్వామికి బహుమతిగానూ ఇచ్చేయొచ్చు. వాటి డిజైన్లు, వివరాలు చూసేయండి.

కపుల్ జ్యువెలరీ ఐడియాలు
కపుల్ జ్యువెలరీ ఐడియాలు (pinterest)

ఎంగేజ్‌మెంట్‌ ఉంగరాల్లో ఒకరి పేరులోని మొదటి అక్షరాన్ని మరొకరు వాళ్ల చేతికి తొడగబోయే ఉంగరంలో ఉండేలా చూసుకుంటారు. మెడలో వేసుకునే నల్లపూసల్లో, చెయిన్ పెండెంట్‌లో ఇలా చాలా చోట్ల భాగస్వామి పేరు కలిసే అక్షరాన్ని ఎంచుకుంటాం. అయితే ఇప్పుడు ట్రెండ్ ఇంకా మారింది. అక్షరంతో ఆగిపోకుండా చాలా రకాలు భావాలు వ్యక్త పరిచే కపుల్ జ్యువెలరీ వచ్చేశాయి. వాటిమీద ఒక లుక్కేసి మీరూ ఏదో ఒకటి కొనేసుకోండి. మీ భాగస్వామికి బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్.

1. పింకీ ప్రామిస్ పెండెంట్ సెట్:

పింకీ ప్రామిస్ పెండెంట్ సెట్
పింకీ ప్రామిస్ పెండెంట్ సెట్ (pinterest)

ఇంగ్లీషులో దీని పేరు పింకీ ప్రామిస్ పెండెంట్ సెట్. హిందూ సాంప్రదాయం ప్రకారం మాత్రం మంచి అర్థం ఉంది. సప్తపదిలో భార్య భర్తలు చిటికెన వేలు ఎలా పట్టుకుని నడుస్తారో అలా ఉంటాయి రెండు చేతులు. ఒక చేతి చిటికెన వేలు మరో చేతి చిటికెన వేలుతో కలిసేలా ఉంటాయీ పెండెంట్లు. అలా మీ ఇద్దరి చేతుల్ని సూచించే రెండు చేతుల్ని పెండెంట్ లాగా వేసుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఒకరు ప్లాటినం, మరొకరు బంగారం పెండెంట్. లేదా సిల్వర్, గోల్డ్.. ఇలా రెండు రకాల రంగులతో చేతులు చేయించుకోవచ్చు. చాలా భిన్నంగా ఉంటాయివి.

2. హాల్ఫ్ హార్ట్ నెక్‌లేస్ సెట్:

రామ్ చరణ్ -ఆలియా
రామ్ చరణ్ -ఆలియా

RRR సినిమాలో రామ్ చరణ్ ఊరివదిలి వెళ్తూ తన గుర్తుగా ఆలియా భట్‌కి ఒక లాకెట్ ముక్క విరిచి ఇస్తాడు గుర్తుందా? దాన్నే మెడలో వేసుకుని ఆలియాభట్ కనిపిస్తుంది. ఆ రెండు ముక్కలు ఒకదాంతో ఒకటి కలిసి పోయినట్లే ఈ హాల్ఫ్ హార్ట్ పెండెంట్లు కూడా కలిసిపోతాయి. రెండూ కలిపితే హృదయాకారం వస్తుంది. రెండింటి మీద మన భాగస్వామి పేరు తెలియజేసే అక్షరం రాయించుకోవచ్చు. ఒక్కో హృదయం భాగం ఇద్దరి మెడలో ఉంటుందన్న మాట.

3. మ్యాగ్నెటిక్ జ్యువెలరీ:

మ్యాగ్నెటిక్ జ్యువెలరీ
మ్యాగ్నెటిక్ జ్యువెలరీ (pinterest)

మ్యాగ్నెటిక్ జ్యువెలరీ అని వాటి పేరు చెబుతున్నట్లే ఈ నగలు ఒకదాంతో ఒకటి అంటుకుంటాయి. బ్రేస్‌లెట్లు, పెండెంట్లు, ఉంగరాలు.. ఇలా చాలా రకాలుగా మ్యాగ్నెటిక్ జ్యువెలరీ చేయించుకోవచ్చు. ఉదాహరణకు మ్యాగ్నెటిక్ బ్రేస్‌లెట్ ఎలా పని చేస్తుందో చూద్దాం. బ్రేస్‌లెట్ చెయిన్ లో ఒక చిన్న ఆకారంలో అయస్కాంతం ఉంటుంది. అలాంటి ఆకారమే భాగస్వామి బ్రేస్‌లెట్ లోనూ ఉంటుంది. ఆ రెండు ఆకారాల్లో ఉన్న రెండు అయస్కాంతాలు చేతులు కలిసినప్పుడు ఒకదాంతో ఒకటి అంటుకుంటాయి. అలాగే పెండెంట్లు కూడా ఒకదాంతో ఒకటి తాకినప్పుడు అతుక్కుపోతాయన్నమాట. చాలా ఫంకీగా, ఆకర్షణీయంగా ఉంటాయివి. మీ బంధాన్ని గుర్తు చేసే జ్యువెలరీ ఇవి.

4. ఇన్నర్ మెసేజ్ రింగ్స్:

ఇన్నర్ మెసేజ్ రింగ్స్
ఇన్నర్ మెసేజ్ రింగ్స్ (pinterest)

పైన ఫోటో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మామూలుగా ఉంగరం మీద, బయటివైపు డిజైన్ ఉంటుంది. కపుల్ జ్యువెలరీ అంటే వారి అక్షరమో, లేదా హృదయాకారమో ఉండేలా ఉంగరాలు చేయించుకుంటాం. ఈ ఉంగరాలు భిన్నం. డిజైన్ ఉంగరం లోపలి వైపు ఉంటుంది. ఇవి ఎదుటి వాళ్ల కోసం కాకుండా మీ భాగస్వామి మీకు అనుక్షణం గుర్తుండేలా మీరు చేయించుకునే నగ అన్నమాట. ఉంగరం లోపలి వైపు హృదయాకారం, లేదా భాగస్వామి పేరు కాస్త ఉబ్బెత్తుగా ఉండేట్లు డిజైన్ చేస్తారు. దాంతో ఆ ఉంగరం మీరు వేలుకు పెట్టుకున్నప్పుడు ఉంగరం అచ్చు కాకుండా, లోపలి ప్రింట్ ఉన్న ఆకారం అచ్చులాగా మీ చర్మం మీద పడుతుంది. భలే ఉంది కదా ఈ ఐడియా.

టాపిక్