Silver rings: ఈ రాశుల వాళ్ళు వెండి ఉంగరం ధరిస్తే వారి జీవితమే మారిపోతుంది
Silver rings: బంగారం మాదిరిగానే వెండి ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏ రాశి వాళ్ళు ఏ వేలికి ఈ ఉంగరం ధరించడం వల్ల ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
Silver rings: బంగారం అంటే అందరికీ ఇష్టమే. బంగారు ఆభరణాలు ధరించి తమ రిచ్ నెస్ ని అందరికీ చూపించాలని అనుకుంటారు. ఇక వెండి వస్తువులు అంటే కాళ్ళకు ధరించే పట్టీలు, మెట్టెలు వరకు చూస్తారు. కొందరు వెండి బ్రేస్ లెట్స్ కూడా ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించేందుకు నియమాలు ఉన్నట్టే వెండి ధరించడానికి కూడా ఉన్నాయి.
వెండి ఉంగరాలు ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా చంద్రుడి రాశిలో జన్మించిన వారికి వెండి వస్తువులు ధరించడం అత్యంత అదృష్టంగా పరిగణిస్తారు. ఇవి ధరించడం వల్ల ప్రశాంతత, స్పష్టత, భావోద్వేగ సమతుల్యత లభిస్తుంది. అలాగే అంతర్ దృష్టిని మెరుగుపరుస్తుంది. మానసికంగా ప్రశాంతతను ఇస్తుంది.
వెండి ఉంగరాలు నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తాయని అదృష్టాన్ని ఆకర్షిస్తాయని నమ్ముతారు. చంద్రుడి శక్తిని ఉపయోగించుకునేందుకు ఎడమ చేతి ఉంగరం వేలికి వెండి ఉంగరం ధరించడం శ్రేయస్కరం. మీ చేతికి వెండి ఉంగరం ధరించడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఆందోళన తొలగిపోతుంది
వెండి ఆభరణాలలో ఓదార్పు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మనసు, శరీరాన్ని శాంతపరుస్తుంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులోని శీతలీకరణ లక్షణాలు భావోద్వేగాలను సమతుల్యం చేస్తాయి. ప్రశాంతతను అందిస్తాయి.
హీలింగ్ లక్షణాలు
వెండిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్స్ తో పోరాడతాయి. మొత్తం ఆరోగ్య శ్రేయస్సును ఇస్తాయి. శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది. హార్మోన్ల అసమతుల్యతను నయం చేస్తుంది. శారీరక రక్షణకు మద్దతు ఇస్తుంది.
జ్యోతిష్య ప్రయోజనాలు
వెండి ఉంగరం ధరించడం వల్ల జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అనేక ప్రయోజనాలు ఉన్నాయి. శని, చంద్రుని శక్తులను సమన్వయం చేస్తుంది. సానుకూలత, సమృద్ధిని ఆకర్షిస్తుంది. భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది. శ్రేయస్సు, అదృష్టాన్ని పెంచుతుంది. అంతర్ దృష్టిని పెంచుతుంది.
ఆధ్యాత్మిక ప్రయోజనాలు
వెండి ఆభరణాలు ధరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. అంతర్గత శాంతి, భావోద్వేగ సమతుల్యత, ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తాయి. ఇది విశ్వం గురించి అవగాహను పెంపొందిస్తుంది. స్వీయ అవగాహనను మెరుగుపరుస్తుంది. ప్రశాంతత, జ్ఞానోదయం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది.
రక్షణ ఇస్తుంది
ప్రతికూల శక్తుల నుంచి వెండి ఆభరణాలు మీకు రక్షణ కవచంగా పని చేస్తాయి. దుష్ట శక్తులు మీ దరి చేరకుండా చేస్తాయి. సురక్షిత భావాన్ని పెంచుతాయి. శ్రేయస్సును అందిస్తాయి. సానుకూల వాతావరణాన్ని పెంపొందిస్తాయి.
ఏ రాశుల వాళ్ళు ధరించవచ్చు?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చల్లని మూలకం కలిగిన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వాళ్ళు వెండి ఉంగరం ధరించవచ్చు. శనితో సంబంధం ఉన్న భూమి సంకేతాలు వృషభం, తుల, కుంభ రాశుల వాళ్ళు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉంగరం వేలికి వెండి ఉంగరం ధరిస్తే శని శక్తులు సమతుల్యం అవుతాయి. అదే చిటికెన వెళుకు ధరిస్తే చంద్రుని సానుకూలత ఆకర్షిస్తుందని నమ్ముతారు. కుడి చేతి వేలికి వెండి ఉంగరం ధరిస్తే గ్రహాల శక్తులు సమతుల్యం అవుతాయి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్