Ram Charan Klin Kara Gift: కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి మగధీరతో ఉన్న లింకేంటో తెలుసా?-ram charan special gift to daughter klin kara it has magadheera connection to it see what it is ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Charan Klin Kara Gift: కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి మగధీరతో ఉన్న లింకేంటో తెలుసా?

Ram Charan Klin Kara Gift: కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి మగధీరతో ఉన్న లింకేంటో తెలుసా?

Hari Prasad S HT Telugu
Aug 23, 2024 04:15 PM IST

Ram Charan Klin Kara Gift: రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి అతడు 15 ఏళ్ల కిందట నటించిన మగధీర మూవీకి ఓ లింకు ఉంది. ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు. మరి ఆ గిఫ్ట్ కు మూవీకి ఉన్న లింకేంటో చూడండి.

కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి మగధీరతో ఉన్న లింకేంటో తెలుసా?
కూతురుకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రామ్ చరణ్.. దానికి మగధీరతో ఉన్న లింకేంటో తెలుసా?

Ram Charan Klin Kara Gift: రామ్ చరణ్ తన ముద్దుల కూతురు క్లిన్ కారాకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవల హైదరాబాద్‌లొ ఓ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరయ్యాడు. అప్పుడు అతడు జంతువుల పట్ల తన అభిరుచి గురించి చర్చించాడు. అదే సమయంలో తన కూతురు క్లిన్ కారాకు ఇచ్చిన గిఫ్ట్ గురించి చెప్పాడు. అంతేకాదు ఆ బహుమతికి మగధీర (2009) కనెక్షన్ కలిగి ఉందని వెల్లడించాడు.

క్లిన్ కారాకు రామ్ చరణ్ గిఫ్ట్

ఈమధ్యే తన కూతురు క్లిన్ కారా కోసం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చానని, ఆమె కూడా తనలాగే గుర్రపు స్వారీ నేర్చుకుంటోందని వెల్లడించాడు. ''నాకు ఒక అభిరుచి ఉంది. నేను జంతువులను ప్రేమిస్తాను. నాకు నా ఫామ్ లో సుమారు 15 గుర్రాలు ఉన్నాయి. అవి నాకు చాలా దగ్గరగా ఉంటాయి.

మగధీరలో బాద్ షా అనే గుర్రం ఎక్కాను. షూటింగ్ పూర్తయిన తర్వాత రాజమౌళిగారిని నేను ఈ గుర్రాన్ని ఉంచుకోవచ్చా అని అడిగాను. ఇది ఇప్పటికీ నా ఫామ్ లో ఉంది. అది ఈ మధ్యే బిడ్డకు జన్మనివ్వడం చాలా సంతోషంగా ఉంది. అయితే దానిని నా కూతురికి గిఫ్ట్ గా ఇచ్చాను. ఆమె చాలా చిన్నది. ఇది ఆమెతో నేను పంచుకునే అభిరుచి" అని చరణ్ తెలిపాడు.

మగధీరలో రామ్ చరణ్

2009లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో చరణ్ డ్యుయల్ రోల్ పోషించాడు. కాల భైరవ అనే యోధుడిగా.. తన గతాన్ని గుర్తు చేసుకునే హర్ష అనే స్ట్రీట్ బైక్ రేసర్ గా నటించాడు. రామ్ కెరీర్ లో మగధీర తొలి హిట్ గా నిలిచింది.

నిజానికి 2017లో హిందీలో వచ్చిన రాబ్తా మూవీకి.. మగధీర కథ, పాత్రలకు పోలికలు ఉండటంతో నిర్మాత అల్లు అరవింద్ ఆ మూవీపై కోర్టుకెక్కారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహించారు.

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్

ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల కానున్న దర్శకుడు శంకర్ తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్ లో రామ్ నటిస్తున్నాడు. కియారా అద్వానీ, ఎస్.జె.సూర్య, సముద్రఖని, అంజలి, జయరామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని జరగండి పాటకు మిశ్రమ స్పందన లభించింది.

ఇక హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చరణ్.. తాను బుచ్చిబాబు సానాతో చేయబోయే సినిమా గురించి కూడా మాట్లాడాడు. అది కామెడీగా ఉంటుందని వెల్లడించాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ తో కూడా ఓ సినిమా లైన్ లో ఉంది.