Pumpkin Idli: పోషకాల గుమ్మడికాయ ఇడ్లీ, స్పాంజీ ఇడ్లీ రెసిపీ-see the detailed recipe of pumpkin idli for breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pumpkin Idli: పోషకాల గుమ్మడికాయ ఇడ్లీ, స్పాంజీ ఇడ్లీ రెసిపీ

Pumpkin Idli: పోషకాల గుమ్మడికాయ ఇడ్లీ, స్పాంజీ ఇడ్లీ రెసిపీ

Pumpkin Idli: గుమ్మడికాయ రుచితో స్పాంజీ ఇడ్లీలు ట్రై చేయండి. పోషకాల ఇడ్లీ అల్పాహారానికి ఉత్తమమైన రెసిపీ. తయారీ కూడా చాలా సులభం.

గుమ్మడికాయ ఇడ్లీలు

గుమ్మడికాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. కానీ దాన్ని ఆహారంలో ఎలా చేర్చుకోవాలో తెలీక ఆగిపోతారు. అలా అయితే ఈ గుమ్మడి కాయ ఇడ్లీలు ట్రై చేయండి. గుమ్మడికాయ రుచితో టేస్టీ ఇడ్లీ రెసిపీ ఇది. తయారీ సులభమే. ఎలాగో చూసేయండి.

గుమ్మడికాయ ఇడ్లీల కోసం కావాల్సినవి:

1 కప్పు ఇడ్లీ రవ్వ

గుమ్మడికాయ

1 చెంచాడు పచ్చి శనగపప్పు

అర టీస్పూన్ మిరియాలు

అర టీస్పూన్ జీలకర్ర

2 పచ్చిమిర్చి, సన్నటి ముక్కల తరుగు

గుప్పెడు కొత్తిమీర తరుగు

గుప్పెడు కరివేపాకు తరుగు

అరచెంచా ఉప్పు

2 చెంచాల నూనె

గుమ్మడికాయ ఇడ్లీల తయారీ విధానం:

  1. ముందుగా ఇడ్లీ రవ్వను కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. శనగపప్పును కూడా కడుక్కుని కనీసం గంట సేపైనా నానబెట్టుకోవాలి. మీకిష్టం లేకపోతే ఈ పప్పు వేయకండి. కానీ వేస్తే ఇడ్లీలకు తినేటప్పుడు క్రంచీ రుచి వస్తుంది.
  3. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రవ్వను ఒక పెద్ద బౌల్ లోకి తీసుకుని అందులో గుమ్మడికాయ తురుము, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకోవాలి.
  4. అన్నింటినీ బాగా కలిపేసుకుని కనీసం గంట నుంచి రెండు గంటల పాటూ పక్కన పెట్టుకోవాలి.
  5. దాంతో రవ్వ ఫ్లేవర్లన్నింటినీ బాగా పీల్చుకుంటుంది. మెత్తబడుతుంది కూడా.
  6. ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పును కూడా నీళ్లు వంపేసి ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలి.
  7. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని పాత్రల్లో ఇడ్లీ పిండి వేసుకుని ఆవిరి మీద ఉడికించుకు చాలు. ఏదైనా చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేయండి.