Kalonji water: ఈ గింజలు ఉడికించిన నీరు పరిగడుపున తాగండి.. షుగర్, ఊబకాయం వంటి 4 వ్యాధులకు దివ్యౌషధం-see how kalonji water helps to reduce diabetes and weight loss ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kalonji Water: ఈ గింజలు ఉడికించిన నీరు పరిగడుపున తాగండి.. షుగర్, ఊబకాయం వంటి 4 వ్యాధులకు దివ్యౌషధం

Kalonji water: ఈ గింజలు ఉడికించిన నీరు పరిగడుపున తాగండి.. షుగర్, ఊబకాయం వంటి 4 వ్యాధులకు దివ్యౌషధం

Koutik Pranaya Sree HT Telugu
Sep 20, 2024 07:00 PM IST

Kalonji water: వంటగదిలో ఉపయోగించే కలోంజి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం పరగడుపున దాని నీటిని తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కాబట్టి దాని ప్రయోజనాలు, వాడాల్సిన సరైన మార్గం తెలుసుకుందాం.

కలోంజీ నీళ్లు
కలోంజీ నీళ్లు (Shutterstock)

చూడ్డానికి నల్ల నువ్వుల్లాగా ఉండే కలోంజీ ఈ మధ్య విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. కుకీలు, రోటీలు, నాన్‌లు, సలాడ్లు, మసాలాలు అన్నింటిలోనూ వీటిని వాడడుతున్నారు. చూడ్డానికి ఆకర్షణీయంగానూ ఉండే ఈ చిరు విత్తనాల వల్ల మధుమేహులకు ఎన్నో లాభాలుంటాయి. ఆయుర్వేదం ప్రకారం వీటిని వాడితే మధుమేహం తగ్గిస్తుంది. అదెలాగో చూడండి. 

ఆయుర్వేదం ఏం చెబుతోంది?

కలోంజీ నీరు తాగడం డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరం అని ఆయుర్వేదం చెబుతోంది. కలోంజీ నీరు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అలాగే ఈ నీటిని తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు రాత్రిపూట రెండు టీస్పూన్ల కలోంజిని కప్పు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే పరగడుపున వడగట్టి ఈ నీటిని తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి చాలా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం:

కలోంజి నీరు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని భావిస్తారు. ఇందులో తగినంత మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె బలానికి చాలా ముఖ్యమైంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున కలోంజి నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను చాలావరకు నివారించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడంలో:

బరువు పెరగడం అనేది ఈ రోజుల్లో చాలా మందికి ఉండే సమస్య.  పెరిగిన బరువును కూడా కలోంజి నీటితో తగ్గించుకోవచ్చు. కలోంజి నీటిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తాగడం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది.దీనితో పాటు మెటబాలిజంను పెంచడంలో కూడా చాలా సహాయం చేస్తుంది. మంచి ఆహారం, తేలికపాటి వ్యాయామంతో కలోంజి నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడంతో పాటు చర్మం కూడా మెరుగుపడుతుంది. ఇందుకోసం కలోంజిని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే వడగట్టి పరగడుపున తాగాలి.

ఉదర సంబంధిత వ్యాధులు:

ఉదర సంబంధ వ్యాధులను తొలగించడంలో కూడా కలోంజి నీరు సహాయపడుతుంది.  అజీర్ణం, మలబద్ధకం లేదా ఎసిడిటీ సమస్య ఉంటే, కలోంజి నీరు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, దీనిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది, ఇది కడుపుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉపశమనం కలిగిస్తుంది.

Whats_app_banner