తెలుగు న్యూస్ / ఫోటో /
Hair Fall Solution : హెయిర్‌ఫాల్ సమస్యను దూరం చేసే కలోంజి ఆయిల్
- Kalonji Oil : రాత్రిపూట కలోంజి ఆయిల్‌ను అప్లై చేయడం వల్ల మీ జుట్టు మంచి పోషణతో పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అంటున్నారు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. ఏమి చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- Kalonji Oil : రాత్రిపూట కలోంజి ఆయిల్‌ను అప్లై చేయడం వల్ల మీ జుట్టు మంచి పోషణతో పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అంటున్నారు. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. ఏమి చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 6)
దువ్వెనకు అతుక్కుపోయిన వెంట్రుకలను చూసి దాదాపు మనందరికీ జుట్టు దువ్విన తర్వాత మనసు కలత చెందుతుంది. వర్షాకాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇలా ఇబ్బంది పడుతుంటే నల్ల జీలకర్ర నూనె ఉపయోగించవచ్చు అంటున్నారు. ఇది జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గొప్పదనం ఏమిటంటే దీనిని తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
(2 / 6)
బ్లాక్ సీడ్ ఆయిల్‌లోని థైమోక్వినోన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టు వృద్ధాప్య సమస్యను నివారిస్తుంది. అలాగే జుట్టును బలంగా చేస్తుంది. నల్ల జీలకర్ర నూనెలోని కొవ్వు ఆమ్లాలు జుట్టులో తేమను నిలుపుతాయి. ఇది మీ జుట్టును పొడిగా, పెళుసుగా మారకుండా చేస్తుంది. అంతే కాదు చుండ్రుతోనూ పోరాడుతుంది.
(3 / 6)
కలోంజి నూనెను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మీరు కొబ్బరి నూనె, నల్ల జీలకర్ర, మెంతులు అవసరం. నల్ల జీలకర్ర, మెంతి పొడిని విడివిడిగా మిక్సీలో గ్రైండ్ చేయండి. ఇప్పుడు పెద్ద పాన్ తీసుకుని నీటిని పోసి వేడి చేయండి. డబుల్ బాయిలర్ పద్ధతిలో ఒక గిన్నె ఉంచండి. దానిలో కొబ్బరి నూనె, మెంతిగింజల పొడి, నల్ల జీలకర్ర పొడిని వేసి బాగా కలపండి. వేడిని తగ్గేవరకు పక్కన పెట్టేయండి. అనంతరం వడకట్టి సీసాలో భద్రపరుచుకోవాలి.
(4 / 6)
నూనెను వేడి చేస్తే.. మరింత ఉపయోగకరంగా ఉంటుంది. తలస్నానానికి 3 గంటల ముందు కలోంజి గింజల నూనెను జుట్టుకు రాయండి. బాగా మసాజ్ చేయండి. లేదంటే మీరు వేడి టవల్‌తో కూడా ఆవిరి చేయవచ్చు. ఇలా వారానికి రెండు రోజులు చేస్తే ప్రయోజనం ఉంటుంది.
(5 / 6)
వడకట్టిన కలోంజి గింజలను బాడీ స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది టాన్‌ను శుభ్రం చేస్తుంది. కాబట్టి కలోంజి గింజలను శుభ్రమైన కంటైనర్‌లో పోయాలి. దీనితో వారానికి కనీసం రెండు రోజులైనా శరీరం మొత్తాన్ని స్క్రబ్ చేయండి. ఇది మృతకణాలను తొలగించి.. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
ఇతర గ్యాలరీలు