Tips To Prevent Heat Stroke । ఎండలో ఎక్కువ తిరిగే వారు జాగ్రత్త.. హీట్ స్ట్రోక్‌ను ఇలా నివారించండి!
Tips To Prevent Heat Stroke: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, తేమకు ఎక్కువ కాలం గురికావడం వల్ల సన్ స్ట్రోక్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఆరోగ్య నిపుణులు సూచించారు.
Summer Health Care: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. హీట్ స్ట్రోక్ అనేది ఒక తీవ్రమైన అనారోగ్య పరిస్థితి, ఇది కలిగినపుడు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ విఫలమవుతుంది, దీని వలన శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది. కార్మికులు, అథ్లెట్లు, డెలివరీలు ఇచ్చేవారు, ట్రాఫిక్ పోలీసులు, అవుట్‌డోర్ ఈవెంట్‌లకు హాజరయ్యే వారు ఎక్కువ కాలం ఆరుబయట గడపాల్సి వస్తుంది. వీరు అధిక ఉష్ణోగ్రతలు, తేమకు ఎక్కువ కాలం గురికావడం వల్ల సన్ స్ట్రోక్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అదనంగా.. వయస్సు, ఊబకాయం, జ్వరం, నిర్జలీకరణం, గుండె జబ్బులు, మానసిక అనారోగ్యం, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ , ఆల్కహాల్ వినియోగం మొదలైన అంశాలు ఎండాకాలంలో ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. కాబట్టి మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ చల్లగా, హైడ్రేటెడ్ గా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.
హీట్ స్ట్రోక్‌ను నివారించే చిట్కాలు- Tips To Prevent Heat Stroke
హీట్ స్ట్రోక్‌ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఆరోగ్య నిపుణులు సూచించారు. ఇవి వేసవికాలం అయిపోయింత వరకు గుర్తుపెట్టుకోవాలి.
- హైడ్రేటెడ్ గా ఉండండి. ముఖ్యంగా మీరు ఆరుబయట చురుకుగా ఉంటే లేదా వ్యాయామం చేస్తుంటే చల్లటి నీరు, జ్యూస్‌లు త్రాగండి. సాధారణం కంటే ఎక్కువ నీరు త్రాగండి, దాహం వేసే వరకు వేచి ఉండకండి.
- మీ శరీరం చల్లబరచడానికి వీలుగా లేత రంగు, వదులుగా ఉండే దుస్తులు ధరించండి.
- ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండలో బయటకు వెళ్లడం మానుకోండి.
- ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి, ఎందుకంటే మీ శరీరం దాని ఉష్ణోగ్రతను నిర్వహించడం కష్టతరం చేస్తుంది.
- ఎండ ఎక్కువ ఉండే రోజులలో తీవ్రమైన వ్యాయామాలు చేయడం మానుకోండి.
- ఎండ కారణంగా అనారోగ్యం పాలయ్యేవారు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎయిర్ కండిషనింగ్ ఉన్నచోట ఎక్కువగా ఉండండి. ఇంట్లో ఏసీ లేకపోతే పబ్లిక్ ఏసీ సౌకర్యం, వాహనంలోని ఏసీ ఏదో ఒక చోట షెల్టర్‌ను పొందండి. ఫ్యాన్ కింద ఉండటాన్ని ఆధారం చేసుకోకండి. ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుంది.
- వీలైనప్పుడల్లా చల్లటి స్నానాలు చేయండి, షవర్ స్నానాలు చేయండి.
ఔట్ డోర్ పనులు చేసే వారు.. మిట్టమధ్యాహ్నం వేళ ఎండలో తిరగకండి. మీ రోజూవారీ ప్రణాళికను మార్చుకోండి. ఉదయం లేదా సాయంత్రం తర్వాత పనులు పూర్తి చేయండి. వేగంగా పనులు చేయకండి, నెమ్మదిగా ప్రారంభించండి, మెల్లిమెల్లిగా వేగం పెంచండి. మీకు నీరసం అనిపిస్తే వెంటనే చల్లని చోటకు వచ్చి సేద తీరండి. మీకు వెంటనే వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేసుకోండి.
సంబంధిత కథనం