Running Tips: రన్నింగ్ తర్వాత ఈ తప్పులు చేయకండి.. లేకపోతే ఇబ్బందులు తప్పవు!
this things should never do after a long run: ప్రస్తుత రోజుల్లో వ్యాయామం తప్పనిసరి. చాలా మంది సమయం లేదని శరీక శ్రమపై దృష్టి పెట్టారు. ప్రతి రోజు పరిగెత్తడం వల్ల శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మీరు రోజూ వ్యాయామం చేయలేకపోతే, కనీసం రోజు ఉదయాన్నే రన్నింగ్ అయిన అలవాటు చేసుకోవాలి. రన్నింగ్ ఆరోగ్యవంతమైన లైఫ్‌స్టైల్ కొనసాగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది , ఇది మీ శరీరాన్ని చురుకుగా చేస్తుంది. అలాగే, మీరు బరువు తగ్గాలనుకుంటే, రన్నింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రోజు పరిగెత్తిన తర్వాత , మీరు తప్పనిసరిగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. పరిగెత్తిన తర్వాత మీరు ఏయే విషయాలను నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరు త్రాగవద్దు, ఎలాంటివి తినవద్దు
పరిగెత్తిన తర్వాత ఎక్కువ మొత్తంలో నీరు త్రాగవద్దు. పరిగెత్తిన తర్వాత ఆకలి అనుభూతి కూడా కలుగుతుంది. ఈ కోరికను అదుపులో ఉంచుకోవాలి. సాధారణంగా పౌష్టికాహారం తినడం, నీరు త్రాగడం వల్ల మీ కండరాలు పునర్నిర్మించడంలో సహాయపడుతుంది. అయితే రన్నింగ్ చేసిన వెంటనే నీరు త్రాగకండి. రన్నింగ్ సెషన్ తర్వాత 20 నుండి 30 నిమిషాల తర్వాత తినాలి.
ప్రయాణంలో నిద్రపోకండి
పరుగెత్తిన తర్వాత సాధారణంగా అలసిపోతారు. పరుగు హృదయ స్పందనను పెంచుతుంది. లాంగ్ తర్వాత మీరు కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి. పరుగెత్తి ఇంటికి వచ్చిన తర్వాత అలసిపోయిన శరీరంతో నేరుగా నిద్రపోకుండా సోఫాలో కాసేపు కూర్చోండి.
చెమటలు
రన్నింగ్ తర్వాత సాధారణంగా బట్టలకు చెమట ఎక్కువగా పడుతుంది. చెమటలు బట్టలతో ఉండకండి. చెమటతో కూడిన దుస్తుల్లో ఎక్కువ సేపు ఉండడం సరైంది కాదని నిపుణులు అంటున్నారు. వర్కౌట్స్ సమయంలో ధరించే దుస్తులలో ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది, ఇది చర్మ సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువసేపు అదే తడి దుస్తులను ధరించడం వల్ల జలుబు కూడా వస్తుంది, కాబట్టి మీరు ఇంటికి చేరిన వెంటనే మీ వ్యాయామ దుస్తులను లాండ్రీ బ్యాగ్‌లో ఉంచండి. మీకు పెద్దగా చెమట పట్టకపోయినా, ఆ బట్టలు మార్చుకోండి. రన్నింగ్ సెషన్ తర్వాత శరీరంలో డిహైడ్రెషన్ కారణంగా నీరసంగా అనిపించడం సహజమే కాసేపు అలా కూర్చోని బట్టలు మార్చుకోవడం మంచిది.
పరిగెత్తిన వెంటనే స్నానం చేయకూడదు
పరిగెత్తిన తర్వాత మీ శరీరం కాస్త వేడిగా మారుతుంది. చెమట ఎక్కువగా పడుతుంది. కావున తప్పనిసరిగా స్నానం చేయాలి. కానీ ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు. ముందుగా చెమటను ఆరబెట్టుకోవాలి, ఆ తర్వాత స్నానం చేయాలి కానీ స్నానం చేసిన వెంటనే ఏసీ లేదా కూలర్ ముందు కూర్చోకూడదని గుర్తుంచుకోవాలి.
సంబంధిత కథనం