Saturday Motivation: డిప్రెషన్‌గా అనిపిస్తున్నప్పుడు వివేకానంద చెప్పిన ఈ స్ఫూర్తి మంత్రాలు చదవండి, మీలో ఆశ చిగురిస్తుంది
Saturday Motivation: డిప్రెషన్‌గా అనిపించడం జీవితంలో అందరికీ ఒక్కసారైనా ఎదురవుతుంది. ఆ సమయంలో ధైర్యం కోల్పోకూడదు. స్ఫూర్తివంతమైన కోట్స్ చదవాలి. ఇక్కడ మేము వివేకానంద చెప్పిన స్పూర్తి మంత్రాలను ఇచ్చాము.
స్వామి వివేకానంద కోట్స్
Saturday Motivation: మార్కులు తగ్గినప్పుడు, వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, కుటుంబంతో గొడవలు జరిగినప్పుడు, ఆర్థికంగా కృంగిపోయినప్పుడు డిప్రెషన్ బారిన పడడం నిరాశలో కూరుకుపోవడం జరుగుతుంది. ఆ సమయంలో మీలో ధైర్యాన్ని నింపే వ్యక్తులు ఉండాలి. మీలో కొత్త ఆశలు చిగురించేలా చేసే స్ఫూర్తి మంత్రాలు మీకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడైనా మీలో నిరాశ కమ్మినట్టు అనిపిస్తే వెంటనే వివేకానందుడు చెప్పిన ఈ స్ఫూర్తి మంత్రాలను చదవండి. మీలో ఆశ పెరుగుతుంది. మీలో ఏదైనా సాధించాలన్న కోరిక కలుగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం వివేకానంద యువతలో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకు వేదికలపై ప్రసంగించేవారు. ఆ ప్రసంగంలో ఎన్నో స్ఫూర్తివంతమైన సూక్తులు ఉండేవి. అవి ఇప్పటికీ ఆచరణీయమైనవే.
స్ఫూర్తిని నింపే వివేకానంద కోట్స్
1. విజయం కలిగిందని విర్ర వీగిపోకు
అపజయం కలిగిందని నిరాశ పడకు
2. రోజులో ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి
లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో
మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు
3. కెరటం నాకు ఆదర్శం
లేచి పడుతున్నందుకు కాదు
పడినా లేస్తున్నందుకు
4. లక్ష్యం పై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి
లక్ష్యసాధనలో సైతం చూపించాలి
అదే మీ విజయ రహస్యం అవుతుంది
5.లేవండి
మేల్కోండి
గమ్యం చేరే వరకు విశ్రమించకండి
6. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి
అనంతమైన సహనాన్ని పెంచుకోండి
విజయం వెన్నంటే ఉంటుంది
7. బలమే మీ జీవనం
బలహీనతే మీ మరణం
8. మందలో ఒకరిగా ఉండకు
వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు
9. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి
చీకటి భయపడుతుంది
నిరంతరం శ్రమించే వారిని చూసి
ఓటమి దూరం అవుతుంది
10. నియంత్రణ లేని మనసు
మనల్ని పతనమయ్యేలా చేస్తుంది
నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనసు
విజయం శిఖరాలను అధిరోహించేలా చేస్తుంది
11. పిరికితనం మనిషిని నిర్వీర్యుడిని చేస్తుంది
ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది
12. పాజిటివ్ మైండ్‌తో ఉండడం
అలసటను ఆనందంగా స్వీకరించడం
ఇవే గెలుపును కాంక్షించే ప్రాథమిక లక్షణాలు
13. నువ్వు నిరుపేదవి అనుకోవద్దు
ధనం నిజమైన శక్తి కాదు
మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి
14. వికాసమే జీవితం
సంకుచిత తత్వమే మరణం
అలాగే ప్రేమే జీవితం
ద్వేషమే మరణం
15. ప్రేమ, నిజాయితీ, పవిత్రత
ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు
16. మిమ్మల్ని బలవంతులుగా చేసే
ప్రతి ఆశయాన్ని స్వీకరించండి
బలహీనపరిచే ప్రతి ఆలోచనను
తిరస్కరించండి
17. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో
దాని వల్ల లభించే ప్రతిఫలం
అంత తీయగా ఉంటుంది
18. ఎవరిపైనా ఆధారపడవద్దు
ఇతరుల సాయాన్ని నిరాకరించే స్థాయికి
చేరుకున్నప్పుడే మీరు స్వేచ్ఛ పొందగలరు
19. జీవితంలో ధనం నష్టపోతే
కొంత కోల్పోయినట్టు కానీ
వ్యక్తిత్వం కోల్పోతే
సర్వస్వం పోగొట్టుకున్నట్టే
20. హృదయానికి, మెదడుకు
సంఘర్షణ కలిగినప్పుడు
హృదయం చెప్పిందే వినండి
21. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే
మనం మనలాగా ఉండడమే అసలైన ధైర్యం
22. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు
మీ బలహీనతలను కూడా అర్థం చేసుకుంటారు
మీరంటే ఇష్టం లేని వాళ్ళు
మీ మంచితనాన్ని కూడా ద్వేషిస్తారు
23. మిమ్మల్ని బలవంతులుగా చేసే
ప్రతి ఆశయాన్ని స్వీకరించండి
బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి