Friday Motivation: రోజువారీ పనిభారంతో తీవ్ర ఒత్తిడా? ఆ ఒత్తిడిని తట్టుకునే మార్గాలు ఇవిగో
పని ఒత్తిడితో ఒక రోబో ఆత్మహత్య చేసుకుందన్న వార్త వైరల్ అయింది. రోబోనే పనిఒత్తిడి తట్టుకోలేకపోతే ఇక మనుషులు ఏం తట్టుకుంటారు? మనుషులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు పనిభారం వల్ల కలిగిన ఒత్తిడి వల్ల కూడా జరుగుతోంది. పనిభారాన్ని ఎలా తట్టుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
తాజాగా ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. దక్షిణ కొరియాలో పని ఒత్తిడితో ఓ రోబో ఆత్మహత్య చేసుకుంది. పనితో అలసిపోయిన రోబో ఒత్తిడితో మరణాన్ని ఆశ్రయించడం ఇదే తొలిసారి. ఈ రోబో 9 గంటల పాటు డ్యూటీ చేసేదని అధికారులు చెబుతున్నారు. అక్కడ పని ఒత్తిడితో విసిగిపోయి మెట్లపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది రోబో. ఈ కేసు వల్ల మరోసారి ఒత్తిడి వల్ల కలిగే అనర్థాలను గుర్తుకుతెస్తోంది.
పెరుగుతున్న పని వల్ల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యా చేసుకున్న ఘటనలు జరుగుతున్నాయి. రోబోకే పనిఒత్తిడి ఎక్కువైతే ఇక మనుషులకు ఆ ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం. ఈ కాలంలో పని ఒత్తిడి మనుషులపై అధికంగానే ఉంది. ఉద్యోగమే, ఇంట్లోని పని కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి తీవ్ర ఒత్తిడి, ఆందోళనకు కారణమవుతాయి . ప్రతి ఒక్కరూ ఈ ఒత్తిడిని తట్టుకోలేరు, ఈ కారణంగా చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం వంటి పనులకు పాల్పడుతున్నారు. ఈ ఒత్తిడిని తట్టుకునేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
సహాయం అడగండి
ఇది చాలా ముఖ్యమైన విషయం… మీకు ఒత్తిడి అధికంగా ఉంటే మీ సన్నిహితుల నుండి సహాయం అడగడానికి వెనుకాడకండి. కానీ ఎంతో మంది ఆ బాధను పంచుకోకుండా లోలోపలే ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇతరుల ను౦డి సహాయ౦ కోరాలని మాత్రం కోరుకోరు. మీకు పని ఒత్తిడి అధికంగా ఉంటే మీ ఇంట్లోని వారికి ఆ విషయం చెప్పండి. ప్రతిదీ మీరే చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ పని ఉన్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవడానికి సంకోచించ కూడదు.
పని ఒత్తిడి ఉన్నా ఫర్వాలేదు కానీ, మీ కోసం కాస్త సమయం కేటాయించలేకపోతే సీరియస్‌గా ఆలోచించాలి. మీరు ఎక్కువ పని చేయవలసి వస్తే, మధ్యమధ్యలో కాస్త విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. పని చేసేటప్పుడు, మధ్యలో కొద్దిసేపు విరామం తీసుకుంటూ ఉండండి. ఈ సమయంలో, మీ సహోద్యోగుల నుండి పని చేస్తూ మీకు ఇష్టమైన పాటలను వినడం ద్వారా కాసేపు ప్రశాంతంగా ఉండండి.
ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా మారడం వల్ల మీ మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని మీకు అనిపిస్తే, మీ బాస్ తో మాట్లాడటానికి వెనుకాడకండి. మీ బాస్ తో కూర్చొని మీ మానసిక ఒత్తిడి గురించి వివరించండి. బాస్ కి కోపం వస్తుందేమోనని భయపడకండి. మీ పరిస్థితిని వారికి వివరించండి. ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే మధ్యమధ్యలో సెలవులు పెట్టి రెస్ట్ తీసుకోండి.
మీరు మానసికంగా కుంగిపోతే … ఆ ఒత్తిడి మీ మెదడుపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని తేలికగా తీసుకోవడం మంచిది కాదు. మన శరీరం అనారోగ్యానికి గురైనట్లే, మన మానసిక ఆరోగ్యం కూడా అనారోగ్యానికి గురవుతుంది. ఒత్తిడి వల్లే ఎక్కువగా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అవసరమైతే ఒత్తిడికి చికిత్స పొందేందుకు వెనుకాడకూడదు. మీరు మానసిక ఆరోగ్య నిపుణుడి వద్దకు వెళ్లి థెరపీ సెషన్లు తీసుకోవచ్చు.