Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లోని కొబ్బరి చిప్పల్లో ఒకటి భిన్నంగా ఉంది, దాన్ని అయిదు సెకన్లలో కనిపెట్టండి
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు చూడగానే వాటిని సాల్వ్ చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది. అలాంటి వారికోసమే ఈ ఆప్టికల్ ఇల్యూషన్. దీన్ని సాల్వ్ చేస్తే మీరు చాలా తెలివైనవారే అని ఒప్పుకోవచ్చు.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు పజిల్ గేమ్స్ కోవలోకే వస్తుంది. వీటిని తరచూ సాల్వ్ చేస్తూ ఉంటే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్లను పరిష్కరించాలంటే మీ కళ్లు, మెదడు కలిసి పనిచేయాలి. వీటిని తరచూ సాల్వ్ చేస్తూ ఉంటే ఆ రెండింటి సమన్వయం కూడా పెరుగుతుంది. ఇక్కడ మేము ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేయండి.
ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో వరుసగా అనేక కొబ్బరి చిప్పలు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టాలి. అదే మేము మీకు విసురుతున్న చాలెంజ్. ఎక్కువ టైమ్ తీసుకుంటే ఎవరైనా ఇట్టే సాల్వ్ చేసేయగలరు. కానీ మేము మీకిస్తున్న సమయం కేవలం అయిదు సెకన్లు. మీ కంటి చూపు పదునుగా ఉండి, మెదడు చురుగ్గా పనిచేస్తే కేవలం అయిదు సెకన్లలోనే మీరు జవాబును కనిపెట్టేయగలరు.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
అయిదు సెకన్లలో తేడాగా ఉన్న కొబ్బరి చిప్పను కనిపెట్టిన తోపే. వారి చూపు, మెదడు చాలా చురుగ్గా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక జవాబు కోసం వెతుకున్న వారికోసమే ఇక్కడ మేము జవాబు చెబుతున్నాం. మొదటి నిలువ వరుసలో కింద నుంచి రెండో కొబ్బరి చిప్పను చూడండి. కాస్త వంకరగా ఉంటుంది. అదే జవాబు.
ఆప్టికల్ ఇల్యూషన్ల కోసం ఇన్స్ స్టాగ్రామ్, ట్విట్టర్ లలో ప్రత్యేక పేజీలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే మీకు ఇలా పజిల్స్ అనేకం దొరుకుతాయి. వాటిని ప్రతిరోజూ సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. మెదడుకు మంచి ప్రాక్టీసుగా మారుతుంది. పిల్లలకు కూడా వీటిని అలవాటు చేస్తే వారికి తెలివి తేటలు వస్తాయి. ముఖ్యంగా వీటి వల్ల పరిశీలనా శక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతి రోజూ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ వారికి ఇచ్చి సాల్వ్ చేయమని చెప్పండి. వారిలో వచ్చే మార్పులను మీరు నెల రోజుల్లోనే చూడొచ్చు.
ఆప్టికల్ ఇల్యూషన్లను గీసే చిత్రకారుల సంఖ్య ప్రపంచంలో అధికంగానే ఉంది. ముఖ్యంగా విదేశాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వారు ఇన్ స్టాగ్రామ్ పేజీలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు గ్రీసు దేశానికి చెందినవి చెప్పుకుంటారు. అక్కడ వీటిని మొదటి సారి పుట్టినట్టు చరిత్ర చెబుతోంది.
టాపిక్