Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లో HURT అనే పదం ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టండి, ఇది మీ బ్రెయిన్‌కు ఛాలెంజ్
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్ అంటే మీకు ఇష్టమా? అయితే ఇక్కడున్న ఆప్టికల్ ఇల్యుషన్‌ను సాధించేందుకు ప్రయత్నించండి. మీరు సాల్వ్ చేస్తే మీరు తెలివైనవారు అని అర్థం.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్‌ను విజువల్ ఇల్యూషన్ అని కూడా పిలుచుకోవచ్చు. ఇది ఒక దృశ్య వ్యవస్థ వల్ల కలిగే భ్రమ. అంటే వాస్తవంగా ఉన్నదాన్ని కూడా లేనట్టు చూపించే ఒక భ్రమగా దీన్ని భావించవచ్చు. మనం చూసిన దాన్నే మన మెదడు గుర్తించలేకపోవచ్చు, లేదా మనం చూసిన విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అలా చేయడమే ఆప్టికల్ ఇల్యూషన్‌ల ప్రత్యేకత. ఇక్కడ మేము ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇందులో ఆంగ్ల పదం HURT అనేది ఒక చోట దాగుంది. అది ఎక్కడుందో మీరు కనిపెట్టి చెప్పాలి.
ఎక్కువ సమయాన్ని ఇస్తే ప్రతి ఒక్కరూ HURT అనే పదాన్ని సులువుగానే కనిపెట్టేస్తారు. మీరు తెలివైన వారైతే కేవలం 10 సెకన్లలోనే HURT అనే పదం ఎక్కడుందో కనిపెట్టి చెప్పండి. ఇది మీ బ్రెయిన్ పవర్‌కు ఒక ఛాలెంజ్. మీరు పది సెకన్లలోనే HURT ను కనిపెడితే మీ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు.
ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు
ఇప్పటికే పది సెకన్లలో జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. 10 సెకన్లు దాటిన తర్వాత కనిపెట్టిన వారు కూడా ఉంటారు. అయితే ఇప్పటికీ జవాబు కనిపెట్టని వారి కోసం మేము ఇక్కడ జవాబు ఇస్తున్నాం. ఇచ్చిన చిత్రంలో రెండో నిలువ వరసలోని కింద నుంచి నాలుగో పదాన్ని చూడండి. అదే జవాబు.
ఆప్టికల్ ఇల్యుషన్ల చరిత్ర క్లారిటీ లేకుండా ఉంది. ఎందుకంటే అక్కడ పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో కొన్ని పాత ఆలయాలు బయటపడ్డాయి. ఆ ఆలయాల గోడలపై కొన్ని రకాల ఆప్టికల్ ఇల్యూషన్లు ఉన్నాయి. కాబట్టి ఆప్టికల్ ఇల్యూషన్లను చరిత్ర గ్రీసులోనే మొదలైందని చెప్పుకుంటారు. వీటిని ఛేదించడం వల్ల మెదడు, కంటి సమన్వయం పెరుగుతుంది. మెదడు పవర్ పెరగడానికి ఆప్లికల్ ఇల్యూషన్ సహాయపడుతుంది. కళ్ళు, మెదడు కలిసి పని చేసే పద్ధతిని పెంచుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఆప్టికల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.
టాపిక్