Onion Paratha: స్పైసీ ఉల్లిపాయ పరాటా, చలికాలంలో రాత్రిపూట డిన్నిర్ కి అదిరిపోతంది
Onion Paratha: ఎంతోమందికి పరాటా తినడానికి ఇష్టపడతారు. వీటిని ఇంట్లోనే సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఉల్లిపాయ పరాటా రెసిపీ ఇచ్చాము. ఇది మీకు కచ్చితంగా నచ్చుతుంది.
శీతాకాలంలో వేడివేడిగా, స్పైసీ ఏవైనా తినాలనిపిస్తాయి. అలా తింటేనే వారికి తిన్నట్టు అనిపిస్తుంది. రాత్రిపూట చపాతీలు తినేవారు అదే పిండితో పరాటాలు చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇందులో స్టఫింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలే చేస్తుంది. పరాటాలను వివిధ రకాల స్టఫింగ్ తో చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మెంతికూర, కొన్నిసార్లు క్యాబేజీ, కొన్నిసార్లు బంగాళాదుంప, కొన్నిసార్లు పనీర్ ఇలా ఎన్నో స్టఫింగ్ లను జోడించి పరాటాలను తయారు చేస్తారు. మీరు ఉల్లిపాయ పరాటాలను కూడా ప్రయత్నించండి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.
ఉల్లిపాయ పరాటా రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి - రెండు కప్పులు
ఉల్లిపాయలు - రెండు
కారం - అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నెయ్యి - నాలుగు స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు
చాట్ మసాలా - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిగా
ఉల్లిపాయ పరాటా
- ఉల్లిపాయ పరాటా చేయడానికి గోధుమపిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి.
- ఆ పిండిలో ఒక టీస్పూన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేయాలి.
- తర్వాత పిండిని గోరువెచ్చని నీటితో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు సెట్ చేసుకోవడానికి కాసేపు పక్కన పెట్టండి. ఇంతలో, పరాఠా స్టఫింగ్ సిద్ధం చేయండి.
- పరాటా స్టఫింగ్ కసం ఉల్లిపాయలను సన్నగా తరగాలి.
- ఒక గిన్నెలో ఉల్లిపాయల తరుగును వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- తరువాత ఉల్లిపాయలోని నీటిని చేత్తోనే పిండుకోవాలి.
- ఆ ఉల్లిపాయలో కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంటే స్టఫింగ్ రెడీ అయినట్టే.
- గోధుమపిండి నుంచి చిన్న ముద్దను తీసి పూరీలా ఒత్తుకోవాలి. మధ్యలో ఉల్లిపాయ స్టఫింగ్ పెట్టి చుట్టు మూసేసి మళ్లీ పరాటాలా ఒత్తుకోవాలి.
- స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి. అందులో పరాటాలను వేసి కాల్చాలి. రెండు వైపులా రంగు మారేవరకు కాల్చుకోవాలి.
- అంటే టేస్టీ ఆనియన్ పరాటా రెడీ అయినట్టే. దీన్ని తినేందుకు ఎలాంటి చట్నీ అవసరం లేదు.
పరాటాలు తినడం వల్ల పొట్ట కూడా త్వరగా నిండిపోతుంది. ఆనియన్ పరాటా తినడం వల్లా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి.
టాపిక్