Gravy Recipe: కార్తీకమాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వేయకుండా టేస్టీగా పనీర్ గ్రేవీ చేసుకోండి
Gravy Recipe: కార్తీకమాసంలో చాలామంది ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తింటారు. ఇది రెస్టారెంట్ స్టైల్‌లో చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. కార్తీకమాసం వ్రతాలు చేసే వారికి ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుంది.
కార్తీకమాసం వచ్చిందంటే వ్రతాలు, ఉపవాసాలు మొదలవుతాయి. ఆ నెలంతా నాన్ వెజ్ మానేసేవారు, ఉల్లిపాయ, వెల్లుల్లి వాడని వారు ఎంతో మంది. ఉల్లి, వెల్లుల్లి వాడకుండా ఈ నెలంతా సాత్విక ఆహారం తీసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెబతారు. ఆహారం రుచిని వెల్లుల్లి, ఉల్లిపాయ పెంచుతుంది. అందుకే వీటిని అధికంగా వాడతారు. మీరు కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వేయకుండా గ్రేవీ కావాలంటే ఇక్కడి ఇచ్చిన రెసిపీని ప్రయత్నించండి.
ఉల్లి, వెల్లుల్లి వేయకుండా గ్రేవీ రావాలంటే దానికోసం కొన్ని మసాలా దినుసులు, కూరగాయలు అవసరం. ఇవన్నీ కలిసి గ్రేవీకి మంచి రుచిని అందిస్తాయి. ఈ గ్రేవీ వండుకుంటే ఇది మూడు నుంచి నాలుగు రోజుల పాటూ నిల్వ ఉంటుంది. అయితే ఫ్రిజ్ లో పెట్టడం మాత్రం మరిచిపోవద్దు.
ఉల్లి, వెల్లుల్లి వేయకుండా పనీర్ గ్రేవీ రెసిపీ ఇలా
కావాల్సిన పదార్థాలు
నూనె - రెండు టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకులు - మూడు
లవంగాలు - మూడు
యాలకులు - 4
నల్ల మిరియాలు - రెండు
జీలకర్ర - ఒక స్పూన్
దాల్చిన చెక్క - చిన్న ముక్క
టమోటాలు - ఆరు
ఉప్పు - రుచికి సరిపడా
అల్లం - చిన్న ముక్క
ఎండుమిర్చి - నాలుగు
నానబెట్టిన జీడిపప్పు - పది
ధనియాల పొడి - రెండు స్పూన్లు
జీలకర్ర పొడి - ఒక టీస్పూన్
గరం మసాలా - ఒక టీస్పూన్
ఆవాలు - ఒక స్పూను
పనీర్ ముక్కలు - అర కప్పు
కసూరి మేతి - అర స్పూను
పచ్చి బఠానీలు - అర కప్పు
పచ్చిమిర్చి - రెండు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకుండా పనీర్ గ్రేవీ రెసిపీ
- స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో లవంగాలు, బిర్యానీ ఆకులు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
- వాటిలో జీలకర్ర కూడా వేయించాలి. కాసేపయ్యాక అందులో తరిగిన టమోటాలు వేయాలి.
- ఇప్పుడు టొమాటోలపై ఉప్పు, అల్లం తరుగు, నానబెట్టిన ఎండుమిర్చి కూడా వేయాలి. వీటన్నింటినీ రెండు మూడు నిమిషాలు వేయించాలి.
- అదనపు రుచి కోసం దీనికి పచ్చి కొత్తిమీర కలపండి.
- ఇవన్నీ ఉడికాక అందులో ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు తరుగును వేసి కలుపుకోండి.
6. ఇప్పుడు వీటన్నింటినీ తక్కువ మంట మీద 7 నుంచి 8 నిమిషాలు ఉంచి ఉడికించాలి. ఇప్పుడు మంట ఆపి చల్లారనివ్వాలి.
7. చల్లారిన తరువాత ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
9. ఆ నెయ్యిలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కసూరిమేథి వేసి వేయించాలి.
10. తరువాత, ఈ మసాలాల్లో పనీర్ ముక్కలు, పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. తరువాత అందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న గ్రేవీ మిశ్రమాన్ని వేసి కలపండి.
11. పైన మూతపెట్టి గ్రేవీని బాగా ఉడికించాలి. కాసేపటి తర్వాత ఇగురు నుంచి నూనె వేరవుతుంది.
12. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ గ్రేవీ రెడీ అయినట్టే.
ఇక్కడ మనం చెప్పిన రెసిపీలో ఉల్లిపాయ, వెల్లుల్లి పాయలు వాడలేదు. కాబట్టి కార్తీకమాసంలో ఈ గ్రేవీని తినడం వల్ల పోషకాహారలోపం రాకుండా ఉంటుంద. దీని రుచి చాలా బావుంటుంది.