Cleaning tips: వంటగది స్లాబ్ పై నూనె పేరుకుపోయిందా? ఆ జిడ్డును ఇలా చిన్న చిట్కాలతో తొలగించండి
Cleaning tips: నూనె, మసాలా దినుసుల మొండి మరకలు వంటగది ప్లాట్‌ఫారమ్ పై పడతాయి. వాటిని తొలగించడం చాలా కష్టమని భావిస్తారు ఎంతో మంది. ఆ నూనె వల్ల కిచెన్ స్లాబ్ చాలా జిడ్డుగా మారుతుంది. ఆ మొండి మరకలను తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.
వంటగది అనేది ఏ ఇంటిలోనైనా అతి ముఖ్యమైన భాగం. కుటుంబం మొత్తం ఆరోగ్యం ముడిపడి ఉన్న ప్రదేశం ఇది. వంటగది అపరిశుభ్రంగా ఉంటే అది నేరుగా కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అందుకే ప్రతి గృహిణి తన వంటగదిని శుభ్రంగా, మెరిసిపోవాలని కోరుకుంటుంది. ఎన్ని సార్లు క్లీన్ చేసినా వంటగది స్లాబ్ పై మొండి మరకలను తొలగించడం కష్టమవుతుంది. నూనె వల్ల పట్టిన జిడ్డును వదిలించుకోవడం కష్టంగా అనిపించినా కొన్ని చిట్కాలతో వంటగదిని సులభంగా శుభ్రం చేయవచ్చు.
నిమ్మరసంతో
కిచెన్ స్లాబ్‌లు, టైల్స్ పై ఆయిల్ మొండి మరకలను తొలగించడానికి డిష్ వాష్ ద్రవాన్ని ఉపయోగించవచ్చు. దీని కోసం, ఒక గిన్నెలో డిష్ వాష్ ద్రవాన్ని తీసుకోండి. ఇప్పుడు సగం నిమ్మకాయ రసం పిండుకుని బాగా కలపాలి. ఇప్పుడు అందులో స్క్రబ్బర్ ను ముంచి చేతులతో పిండి ఆ తర్వాత దానితో స్లాబ్‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్లాబ్ పై ఉన్న లూబ్రికేషన్ క్లీన్ అవుతుంది. ఇప్పుడు కాటన్ వస్త్రాన్ని నీటిలో నానబెట్టి దానితో స్లాబ్‌ను శుభ్రం చేయాలి. డిష్ వాష్ లిక్విడ్, నిమ్మకాయ శక్తివంతమైన కలయిక. నిమ్మరసం, డిష్ వాస్ కలిపిన మిశ్రమం వంటగది సింక్, టైల్స్ ను కూడా శుభ్రపరుస్తుంది.
బేకింగ్ సోడాతో
కిచెన్ స్లాబ్ మరీ మురికిగా మారితే బేకింగ్ సోడాతో శుభ్రం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని గోరువెచ్చగా వేడి చేయాలి. ఇప్పుడు ఈ నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. సగం నిమ్మకాయ రసం పిండుకుని బాగా కలపాలి. ఇప్పుడు సిద్ధం చేసిన ద్రవాన్ని స్ప్రే బాటిల్ లో నింపండి. ఈ స్ప్రే బాటిల్ తో స్లాబ్ పై స్ప్రే చేసి శుభ్రంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల మొండి మరకలు సులభంగా తొలగిపోతాయి.
వెనిగర్ తో
వంటగదిని శుభ్రం చేయడానికి మీరు బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి వాడవచ్చు. బేకింగ్ సోడా, వెనిగర్… రెండూ చాలా ఎఫెక్టివ్ క్లీనింగ్ ఏజెంట్లు. లూబ్రికేషన్ కట్ చేసే శక్తి ఈ రెండింటికీ ఉంది. వాటి మిశ్రమాన్ని ఉపయోగించి స్లాబ్ పై ఉన్న జిడ్డును సులభంగా తొలగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ఇప్పుడు అందులో రెండు చెంచాల వెనిగర్ కలపాలి. ఇప్పుడు తయారుచేసిన ద్రవాన్ని స్ప్రే బాటిల్ లో నింపి శుభ్రపరచడానికి ఉపయోగించండి. ఈ మిశ్రమం ఎంతటి మొండి మరకలనైనా పోగొడుతుంది.
నూనె మరకలు పడిన వెంటనే తుడిచేస్తే అవి జిడ్డుగా మారవు. కొన్ని రోజులు, నెలల పాటూ వంటగదిలోని నూనె మరకలను అలా వదిలేస్తే అవి మొండివిగా మారిపోతాయి. కాబట్టి వంటగదిని ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటే మంచిది.