Lemon Leaves for Health: నిమ్మరసంలో కన్నా నిమ్మ ఆకుల్లోనే ఔషధ గుణాలు ఎక్కువ, వాటిని పొడి చేసి ఇలా వాడండి-lemon leaves have more medicinal properties than lemon juice dry them and use them like this ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lemon Leaves For Health: నిమ్మరసంలో కన్నా నిమ్మ ఆకుల్లోనే ఔషధ గుణాలు ఎక్కువ, వాటిని పొడి చేసి ఇలా వాడండి

Lemon Leaves for Health: నిమ్మరసంలో కన్నా నిమ్మ ఆకుల్లోనే ఔషధ గుణాలు ఎక్కువ, వాటిని పొడి చేసి ఇలా వాడండి

Haritha Chappa HT Telugu
Aug 23, 2024 04:30 PM IST

Lemon Leaves for Health: నిమ్మరసంలో ఉండే ఔషధ గుణాలు అన్నీఇన్నీ కావు. కేవలం నిమ్మకాయల్లోనే కాదు, నిమ్మ ఆకుల్లో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే లక్షణాలు ఉన్నాయి. కొన్ని దేశాల్లో నిమ్మ ఆకులను ఆహారంలో భాగంగా ఉపయోగిస్తారు.

నిమ్మఆకులతో ఉపయోగాలు
నిమ్మఆకులతో ఉపయోగాలు (Pixabay)

Lemon Leaves for Health: నిమ్మ ఆకులను కాస్త నలిపి వాసన చూడండి, ఆ వాసన పీల్చగానే ఒక్కసారిగా ఏదో తెలియని ప్రశాంతమైన అనుభూతి కలుగుతుంది. మెదడుకు రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఇది రిఫ్రెష్మెంట్‌ని ఇచ్చే వాసన. నిమ్మరసం లాగే నిమ్మ ఆకుల్లో కూడా ఔషధ గుణాలు ఎక్కువే. నిమ్మ ఆకులను పడేయడమే తప్ప దేనికీ ఉపయోగించరు. నిమ్మ ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలిస్తే వాటిని మీరు వెంటనే వాడడం మొదలు పెడతారు. నిమ్మ ఆకులను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

కూరల్లో కరివేపాకుల్లా...

కరివేపాకులాగే నిమ్మ ఆకులను కూడా పరిశుభ్రంగా కడిగి సన్నగా తరిగి మంచి వాసనా, రుచి కోసం కూరల్లో వేసుకోవచ్చు. ఇవి ఒక ప్రత్యేకమైన వాసనను కలిగి ఉంటాయి. లేదా నిమ్మ ఆకులను ఎండబెట్టి, పొడి చేసి ఒక డబ్బాలో వేసి దాచుకోండి. ధనియాల పొడి చల్లినట్టే కూరల్లో ఒక అర స్పూను నిమ్మ ఆకుల పొడిని చల్లుతూ ఉండండి. ఇది ఏ వంటకానికైనా రుచిని జోడిస్తాయి.

నిమ్మ ఆకుల పొడి

చికెన్ వండినప్పుడు లేదా చేపలు, రొయ్యలు వండినప్పుడు ఒక అర స్పూను నిమ్మఆకుల పొడిని కూరల్లో చల్లుకోండి. ఆ కూర రుచి, వాసన అదిరిపోతాయి. అలాగే సూప్‌లు తయారు చేసినప్పుడు లేదా టమాటో రసం వంటివి వండినప్పుడు ఒక అర స్పూను వేసుకోండి. మీకు కచ్చితంగా దాని రుచి నచ్చుతుంది.

ఫ్లేవర్ ఏజెంట్‌గా

చికెన్, మటన్ వంటివి గ్రిల్లింగ్ చేసేటప్పుడు కూడా ఫ్లేవర్ ఏజెంట్‌గా నిమ్మ ఆకులను వాడుకోవచ్చు. మాంసం ముక్కలకు ఈ నిమ్మ ఆకులను జత చేసి గ్రిల్ చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది. అలాగే చేప ముక్కలకు నిమ్మ ఆకులను అతికించి చుట్టూ అరటి ఆకుతో మడిచిపెట్టి గ్రిల్ చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

అన్నం వండేటప్పుడు రెండు నిమ్మ ఆకులను ఆ నీటిలో వేయండి. ఇది మంచి ఫ్లేవర్ తో ఉడికిస్తుంది. ఇండోనేషియా, థాయిలాండ్ లలో ఇలానే వండుతారు.

నిమ్మ ఆకుల టీ

హెర్బల్ టీ కోసం నిమ్మ ఆకులను వాడవచ్చు. తాజా ఆకులు లేదా నిమ్మకాయల పొడితో ఈ టీని తయారు చేయవచ్చు. నీటిలో ఆకులను లేదా ఆకుల పొడిని వేసి మూడు నిమిషాల పాటు స్టవ్ మీద మరిగించండి. తర్వాత దాన్ని వడకట్టి తాగేయండి. తాగిన తర్వాత మీకు ఎంతో తాజాగా అనిపిస్తుంది.

నిమ్మకాయ ఆకులను మీరు వండే వంట నూనెల్లో కూడా వేస్తే ఆ నూనెకు మంచి సువాసన జత చేరుతుంది.

ఆరోగ్యానికి నిమ్మఆకులు

నిమ్మ ఆకులను కేవలం రుచి కోసం మాత్రమే వాడమని చెప్పడం లేదు. ఇవి జీర్ణ ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తాయి.

తాజా నిమ్మ ఆకులను రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. అవి తాజాగా ఉండాలంటే తడిగా ఉండే టవల్‌లో వీటిని కట్టి అలానే ఫ్రిజ్లో పెట్టండి. ఇది రెండు మూడు రోజులు పాటు చాలా తాజాగా ఉంటాయి. లేదా నిమ్మ ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోండి. ఈ పొడి రెండు నుంచి మూడు నెలలు తాజాగా ఉంటుంది.