Lemon Juice: ఈ సమస్యలు ఉన్న వారు నిమ్మరసం తాగకూడదు, అయిన తెలియక తాగేస్తున్నారు
Lemon Juice: నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంది. అందుకే ఎక్కువ మంది నిమ్మకాయ రసాన్ని తాగేందుకు ఇష్టపడతారు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల జీర్ణక్రియ సవ్యంగా ఉంటుందని, బరువు తగ్గడానికి సహాయపడుతుందని అనుకుంటారు. అది నిజమే అయినా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం నిమ్మ రసాన్ని తాగకూడదు.
ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో నిమ్మకాయ ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్సిఫికేషన్ చేస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి చాలా ఉపయోగించబడుతుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి వంటి మూలకాలు ఉన్నాయి. ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందుకే నిమ్మకాయలను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.
నిమ్మరసం అందరికీ ఆరోగ్యకరం కాదు. ఇది కొందరిలో సైడ్ ఎఫెక్టులను ఇస్తుంది. కానీ ఈ విషయం తెలియక ఎంతో మంది నిమ్మరసాన్ని అధికంగా తాగి అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. కొన్నిరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మరసాన్ని తక్కువగా తీసుకోవాలి. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిమ్మరసాన్ని తీసుకోకడదో తెలుసుకోండి.
యాసిడ్ రిఫ్లక్స్
నిమ్మకాయ ఒక ఆమ్లం నిండిన పండు. గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ , పెప్టిక్ అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు నిమ్మకాయను తినడం వారికి హాని కలిగిస్తుంది. ఈ వ్యాధులు ఉన్నవారు నిమ్మకాయ తినడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అలాంటి వారు నిమ్మకాయ తినకూడదని చెబతారు. లేదా చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదని సూచిస్తారు.
దంత సమస్యలు
దంతాలపై ఉన్న ఎనామిల్ చాలా అవసరం. అవి వారిలో అరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల దంతాలు సున్నితంగా మారుతాయి. అలాంటి వారు నిమ్మరసం తాగకూడదు. ముఖ్యంగా నిమ్మరసం నీటిలో కలపకుండా తాగితే దంతాలు దెబ్బతింటాయి. నీటిలో ఎక్కువ మోతాదులో కలుపుకుని తాగినా ప్రమాదమే. దీనివల్ల దంతాల సమస్యలు పెరిగిపోతాయి.
అలెర్జీ
కొంతమందికి నిమ్మకాయ అలెర్జీ కూడా ఉంటుంది. చాలా తక్కువ మందికి ఈ అలెర్జీ ఉంటుంది కాబట్టి ఈ విషయం ఎక్కువమందికి తెలియదు. నిమ్మకాయ అలెర్జీ మీకుంటే పుల్లగా ఉన్న పండ్లు ఏవీ తినకూడదు. నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లను తింటే దురద, దద్దుర్లు వస్తాయి. పెదవులు, నాలుక లేదా గొంతులో వాపు వస్తుంది. కాబట్టి అలాంటి వారు నిమ్మకాయకు దూరంగా ఉండాలి.
కొన్నిరకాల మందులు వాడే వారిపై కూడా నిమ్మరసం తాగడం వల్ల ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిమ్మకాయ కాలేయ ఎంజైములను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఆ మందులు సరిగా జీర్ణం కావు. కాబట్టి మీరు ఏవైనా మందులు వేసుకుంటే నిమ్మరసం వంటివి తాగకూడదు.
మూత్రాపిండాల సమస్యలు
నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లు, కొన్ని కూరగాయల్లో ఆక్సలేట్ ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఈ సమ్మేళనం కారణమవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స పొందినవారు లేదా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం ఉన్నవారు నిమ్మకాయ వంటి అధిక ఆక్సలేట్ ఆహారాన్ని తినకూడదు.