Gongura Enduroyyalu: గోంగూర ఎండు రొయ్యలు ఒక్కసారి వండి చూడండి, ఆ రుచి నీకు నచ్చడం ఖాయం-gongura enduroyyalu recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gongura Enduroyyalu: గోంగూర ఎండు రొయ్యలు ఒక్కసారి వండి చూడండి, ఆ రుచి నీకు నచ్చడం ఖాయం

Gongura Enduroyyalu: గోంగూర ఎండు రొయ్యలు ఒక్కసారి వండి చూడండి, ఆ రుచి నీకు నచ్చడం ఖాయం

Haritha Chappa HT Telugu
May 11, 2024 11:32 AM IST

Gongura Enduroyyalu: ఎండు రొయ్యలు పెద్దగా వాసన రావు. కాబట్టి వీటితో టేస్టీ కూరలు వండుకోవచ్చు. గోంగూర ఎండు రొయ్యలు కాంబినేషన్ అదిరిపోతుంది. రెసిపీ చాలా సులువు.

టేస్టీ గోంగూర ఎండు రొయ్యల రెసిపీ
టేస్టీ గోంగూర ఎండు రొయ్యల రెసిపీ

Gongura Enduroyyalu: ఎండు చేపలు వాసన వస్తాయని ఎక్కువమంది పక్కన పెడతారు. అయితే ఎండు రొయ్యలు పెద్దగా వాసన రావు, కాబట్టి వీటితో అనేక రకాల వంటకాలు వండుకోవచ్చు. ఆంధ్రాలో స్పెషల్ వంటకం గోంగూర ఎండు రొయ్యలు కూర. దీని వండడం చాలా సులువు. ఒక్కసారి వండుకుంటే మీకు దీన్ని మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలో ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీ కలుపుకుంటే స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. రెసిపీ ఇక్కడ ఎలాగో ఇచ్చాము. దీన్ని ఫాలో అయిపోండి.

గోంగూర ఎండు రొయ్యలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

ఎండు రొయ్యలు - 100 గ్రాములు

నీళ్లు - సరిపడినన్ని

ఆవాలు - ఒక స్పూను

శనగపప్పు - ఒక స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

జీలకర్ర - ఒక స్పూన్

ఉల్లిపాయ తరుగు - అరకప్పు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

గోంగూర ఆకులు - రెండు కప్పులు

గరం మసాలా - అర స్పూను

కారం - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

గోంగూర ఎండు రొయ్యలు రెసిపీ

1. ఎండు రొయ్యలను పావుగంట సేపు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనె వేడెక్కాక ఆవాలు, శెనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేయించుకోవాలి.

4. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసి వేయించాలి.

5. కరివేపాకులను వేసి బాగా కలుపుకోవాలి.

6. ఇప్పుడు ఆ మిశ్రమంలో పసుపు వేయాలి.

7. ఇవన్నీ బాగా వేగాక శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను వేసి వేయించాలి.

8. కనీసం పావుగంట సేపు చిన్న మంట మీద వేయిస్తే రొయ్యలు బాగా వేగుతాయి.

9. ఇప్పుడు ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలుపుకోవాలి.

10. పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

11. అందులో గోంగూర ఆకులను వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

12. మంట చిన్నగా ఉండేలా చూసుకోవాలి.

13. గోంగూర ఆకులు బాగా మగ్గి మెత్తగా అవుతాయి. అప్పుడు ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి.

14. పావుగంట సేపు అలా ఉంచాలి. తర్వాత మూత తీసి కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

15. అర గ్లాసు నీళ్లు కూడా పోసుకుంటే ఇగురులాగా వస్తుంది.

16. ఇప్పుడు మూత పెట్టి మరొక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.

17. తర్వాత మూత తీస్తే నూనె పైకి తేలి ఇగురు లాగా కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.

18. అంతే రుచికరమైన గోంగూర ఎండు రొయ్యల కూర రెడీ అయినట్టే.

19. దీని రుచి నాన్ వెజ్ ప్రియులకు బాగా నచ్చుతుంది. దీని చేయడం కూడా చాలా సులువు కాబట్టి ఒకసారి ప్రయత్నించండి.

ఎండు రొయ్యలు అప్పుడప్పుడు తినడం చాలా ముఖ్యం. ఎండు చేపల్లోనూ. ఎండు రొయ్యల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్ బి12, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. అలాగే సోడియం కూడా ఉంటుంది. కాబట్టి నీటిలో నానబెట్టడం వల్ల సోడియం తగ్గే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు కూడా ఎండు రొయ్యలను తినడం వల్ల ఉపయోగం ఉంటుంది.

Whats_app_banner

టాపిక్