Oats Breakfast: టేస్టీగా ఓట్స్ ఎగ్ బ్రేక్‌ఫాస్ట్, రుచి మామూలుగా ఉండదు-oats breakfast with egg know how to make the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Oats Breakfast: టేస్టీగా ఓట్స్ ఎగ్ బ్రేక్‌ఫాస్ట్, రుచి మామూలుగా ఉండదు

Oats Breakfast: టేస్టీగా ఓట్స్ ఎగ్ బ్రేక్‌ఫాస్ట్, రుచి మామూలుగా ఉండదు

Haritha Chappa HT Telugu
Jan 24, 2024 06:00 AM IST

Oats Breakfast: బరువు తగ్గేందుకు ఓట్స్‌తో అల్పాహారాలు తింటున్నారా? కోడి గుడ్డుతో ఓట్స్ రెసిపీ చేసి చూడండి, రుచిగా ఉంటుంది.

 మసాలా ఓట్స్ ఎగ్ రెసిపీ
మసాలా ఓట్స్ ఎగ్ రెసిపీ (shahzadidevje.com)

Oats Breakfast: బరువు తగ్గేందుకు ఎక్కువమంది తింటున్న బ్రేక్ ఫాస్ట్ ఓట్స్. రోజూ ఒకేలాంటి ఓట్స్ బ్రేక్ ఫాస్ట్ తింటే బోర్ కొడుతుంది. కాబట్టి శరీరానికి శక్తిని, నాలికకు రుచిని అందించేలా కొత్తగా ఓట్స్ బ్రేక్ ఫాస్ట్‌ను వండండి. ఓట్స్ కు గుడ్డు జోడించి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తే టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరం కూడా. ఒకసారి ఈ ఓట్స్ బ్రేక్ ఫాస్ట్‌ను ప్రయత్నించండి. ఈ రెసిపీ చాలా సులువు.

ఎగ్ బ్రేక్‌ఫాస్ట్‌కు కావలసిన పదార్థాలు

ఓట్స్ - అరకప్పు

ఉల్లిపాయ - ఒకటి

క్యాప్సికం - ఒకటి

పచ్చిమిర్చి - రెండు

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

గుడ్డు - ఒకటి

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

నూనె - తగినంత

టమోటో - ఒకటి

ఓట్స్ ఎగ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ

1. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించండి.

2. అందులోనే క్యాప్సికం తరుగును, పచ్చిమిర్చి తరుగును కూడా వేసి వేయించండి.

3. కాసేపు ఇవి వేగాక టమోటో తరుగును వేసి వేయించండి.

4. పైన మూత పెడితే టమోటో ముక్కలు త్వరగా మెత్తబడతాయి. దీన్ని చిన్నమంట మీదే ఉడికించాలి.

5. తర్వాత మూత తీసి ఆ టమోటో మిశ్రమంలో పసుపు, ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి.

6. మీకు అవసరం అనుకుంటే వెల్లుల్లి అల్లం పేస్టును కూడా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది.

7. ఇప్పుడు అందులో గుడ్డును పగులకొట్టి వేసి బాగా కలపండి.

8. మీరు శాఖాహారులైతే గుడ్డు వేసుకోవాల్సిన అవసరం లేదు.

9. ఇందులో అరకప్పు నానబెట్టిన ఓట్స్ వేయాలి.

10. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.

11. పైన కొత్తిమీర తరుగును చల్లుకుంటే ఓట్స్ ఎగ్ బ్రేక్ ఫాస్ట్ రెడీ అయినట్టే.

ఓట్స్ తినడం వల్ల అధిక బరువు అదుపులో ఉంటుంది. అంతేకాదు దీనిలో మాంగనీస్, ఫాస్ఫరస్, జింక్, సెలీనియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు మీరు పావు కిలో వరకు ఓట్స్ తింటే ఎంతో మంచిది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించి అనేక రకాల రోగాలు రాకుండా అడ్డుకుంటుంది. ఇది మన దేశానికి చెందిన పంట కాదు. కానీ ఇప్పుడు మన దేశంలో దీనికి ఎంతో విలువ ఉంది. దీనిలో అధికంగా పోషక విలువలు ఉండడం, పైగా ఎంత తిన్నా కొవ్వు చేరకపోవడం వల్ల ఓట్స్ ఆహారాలు తినే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజు ఓట్స్ తినడం అలవాటు చేసుకోవాలి. ఓట్స్ యూరోప్, పశ్చిమాసియా దేశాల్లో అధికంగా పండిస్తారు. దీన్ని అప్పట్లో పశువులకు దాణాగా వినియోగించేవారు. గుర్రాలకు ఎక్కువగా తినిపించేవారు. ఇప్పుడు దాని వాటి విలువ తెలిసి మనుషులు అధికంగా తినడం ప్రారంభించారు.

Whats_app_banner