Nirmala sitharaman Budget Saree: నిర్మలా సీతారామన్ బడ్జెట్ చీరలు వెరీ స్పెషల్, ఈసారి చీర స్పెషాలిటి ఏంటంటే…
Nirmala sitharaman Budget Saree: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించనున్నారు. బడ్జెట్ నాడు ఆమె కట్టే చీరలు చాలా స్పెషల్ గా ఉంటాయి.
భారతీయ చేనేత వస్త్రాలంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎంతో ఇష్టం. అందుకే ఆమె ప్రతి ఏడాది ప్రవేశ పెట్టే బడ్జెట్ రోజు ప్రత్యేక చీరను ధరిస్తారు. ఈ రోజు ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఈసారి బడ్జెట్ రోజున వయొలెట్ బోర్డర్ తో కూడిన తెలుపు చీరను ఆమె ధరించారు. ఆ చీరలో ఆమె చాలా హూందాగా, పద్ధతిగా, గౌరవంగా కనిపిస్తున్నారు. గతంలో కూడా ఆమె బడ్జెట్ రోజున ప్రత్యేకమైన చీరలు ధరించి ఎంతో హూందాతనంగా దర్శమిచ్చారు. ఆమె ఎంపిక చేసుకున్న చీరలన్నీ భారతదేశంలోని చేనేత వస్త్రకారులకు మేలు చేసే విధంగా ఉంటాయి. ఆమె గతంలో బడ్జెట్ కు ఎలాంటి చీరలు కట్టుకున్నారో ఇక్కడ వివరించాము.
దివంగత మొరార్జీ దేశాయ్ వరుసగా ఆరు బడ్జెట్ లను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. అతని రికార్డును అధిగమించి ఆమె వరుసగా ఏడో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ రోజు నిర్మలా సీతారామన్ లుక్ ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.
గతంలో ఆమె ధరించిన చీరలు ఇవే
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్ టెర్మ్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె నీలి రంగు చీరలో మెరిశారు. ఇది పశ్చిమ బెంగాల్ లో ప్రత్యేక మైన చీర. దీన్ని కాంతా స్టిచ్ శారీ అంటారు. చూసేందుకు ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
గత ఏడాది బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పుడు నిర్మాలా సీతారామన్ టెంపుల్ బోర్డర్‌తో ఉన్న ఎరుపు రంగు చీర కట్టుకున్నారు. ఇది కర్ణటకకు చెందిన సంప్రదాయ కసూటి వర్క్ చీర. చేత్తోనే అల్లే ఇల్కల్ సిల్క్ శారీ ఇది.
2022లో ఆమె బ్రౌన్ రంగు చీర ధరించారు. ఇది ఒడిశాకు చెందిన చేనేతవస్త్రకారులు నేసినది. ఒడిశాకు చెందిన సంప్రదాయ చీర ఇది. ఈ చీరను బొమ్కాయ్ చీర అంటారు. ఆమె చేనేత వస్త్రకారులను ఎంతో ప్రోత్సహిస్తారు.
2021 బడ్జెట్‌కు ఆమె ఎరుపు, తెలుపు కలిసిన పోచం పల్లి చీరను ధరించారు. ఇది ఇక్కత్ చీర. తెలంగాణాలోని భూదాన్ పోచంపల్లి కి చెందిన చీర ఇది. ఈ చీరలో ఆమె పెద్దరికంగా, ఆకర్షణీయంగా కనిపించారు.
2020లో బడ్జెట్ కోసం ఆమె పసుపు రంగు చీరను ఎంచుకున్నారు. ఇది సన్నని నీలిరంగు అంచును కలిగి ఉంది. ఈ పసుపు బంగారాన్ని గుర్తు తెచ్చేలా లేత మెరుపుతో ఉంది ఈ చీర. పసుపు శుభకరమైన రంగు. అందుకే ఆమె ఈ సారి బడ్జెట్ కు పసుపు రంగు చీరను ఎంచుకున్నారు.
2019లో ఆమె తొలిసారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమానికి గులాబీ రంగు చీర, బంగారు అంచు ఉన్న చీరను ఎంపికచేసుకున్నారు. ఇది మంగళగిరి చీర. ఆమె చీరల ఎంపిక చాలా ఉత్తమంగా ఉంటుంది. ముఖ్యంగా చేనేత వస్త్రకారులకు చేయూతనిచ్చే విధంగా ఎంపిక చేసుకుంటున్నారు.
టాపిక్