Toilet Blockage: టాయిలెట్‌‌లో వీటిని ఎప్పుడూ పడేయకండి, ఇవి పైపుల్ని బ్లాక్ చేస్తాయి-never flush these things in toilet those may block pipes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Toilet Blockage: టాయిలెట్‌‌లో వీటిని ఎప్పుడూ పడేయకండి, ఇవి పైపుల్ని బ్లాక్ చేస్తాయి

Toilet Blockage: టాయిలెట్‌‌లో వీటిని ఎప్పుడూ పడేయకండి, ఇవి పైపుల్ని బ్లాక్ చేస్తాయి

Koutik Pranaya Sree HT Telugu
Oct 08, 2024 10:30 AM IST

Toilet Blockage: టాయిలెట్‌లో తెలీకుండా వేసే కొన్ని వస్తువులు దాని బ్లాకేజీకి కారణం అవుతాయి. అసలు టాయిలెట్‌లో ఎప్పుడూ ఫ్లష్ చేయకూడని వస్తువులేంటో తెల్సుకోండి.

టాయిలెట్ బ్లాకేజ్
టాయిలెట్ బ్లాకేజ్

టాయిలెట్‌లో నీళ్లు సరిగ్గా పోకుండా ఇబ్బంది అవుతుందా? అయితే మీకు తెలీకుండా అందులో పడేసిన కొన్ని వస్తువులే అందుకు కారణం. వాటివల్ల పైపుల్లో బ్లాకేజ్ రావచ్చు. దాంతో నీళ్లు సరిగ్గా వెళ్లవు. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని బాత్రూంలలో, టాయిలెట్ సీట్లలో పడేయకండి. అవేంటో చూడండి.

టాయిలెట్‌లో ఫ్లష్ చేయకూడని వస్తువులు:

జుట్టు:

తలస్నానం చేశాక బాత్రూంలో కింద పడ్డ చిక్కులు పడ్డ జుట్టును తీసి టాయిలెట్ సీట్‌లో ఫ్లష్ చేసేస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో పైపుల్లో బ్లాకేజ్ సమస్య రావచ్చు. పైపుల లోపల్లో జుట్టు ఇరుక్కుపోయి అందులో మరింత చెత్త పేరుకుపోయేలా చేస్తుంది. అందుకే డ్రెయిన్ కవర్లు లాంటివి వాడండి. ఇవి జుట్టు అక్కడే ఆపేస్తాయి. తేలిగ్గా తీసి బయట పడేయొచ్చు.

కండోమ్స్:

టాయిలెట్లలో వాడిన కండోమ్స్ ఫ్లష్ చేసేయడం కూడా పైపులకు నష్టమే. అవి పైపులకు అతుక్కుపోతాయి. అవి ఎప్పటికీ నీళ్ల వల్ల కుచించుకు కూడా పోయే రకం కావు. సాధారణంగా కండోమ్స్ లేటెక్స్ రబ్బర్ తో తయారు చేస్తారు. ఇది పైపుల్లో అడ్డంగా నిలిచి టాయిలెట్ లో నీళ్లు పోకుండా చేస్తుంది.

ప్యాడ్స్, ట్యాంపన్లు:

కొందరు అవగాహన లేక శానిటరీ న్యాప్‌కిన్లను, ట్యాంపన్లను కూడా టాయిలెట్‌లో ఫ్లష్ చేసేస్తుంటారు. ఇవన్నీ ద్రవాలను పీల్చుకోడానికి తయారు చేసినవి. నీటిని పీల్చుకుని పరిమాణంలో మరింత పెద్దగా అవుతాయివి. దాంతో చూడ్డానికి చిన్నగా అనిపించినా పైపుల్లో ఇవి పెద్ద అడ్డుగా మారతాయి. కాబట్టి ఈ తప్పు అస్సలు చేయొద్దు.

టిష్యు, టాయిలెట్ పేపర్లు:

బాత్రూంలలో వాడిన టిష్యూ పేపర్లను టక్కుమని ఫ్లష్ చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. పేపర్ నీటిలో ముక్కలైపోతుంది కదా అనుకుంటారు. కానీ ఇవన్నీ నీటిని పీల్చుకోడానికి తయారు చేసినవి. అంత సులువుగా నీటిలో కలిసిపోవు. పైపులను బ్లాక్ చేసేస్తాయివి. రీయూజబుల్ టవెల్స్, టిష్యూ పేపర్లు, టాయిలెట్ పేపర్లు, వైప్స్ లాంటివి ఎప్పుడూ ఫ్లష్ చేయకండి. డస్ట్ బిన్ లో వేయండి.

సిగరెట్ బట్స్:

బాత్రూంలో సిగరైట్ తాగే అలవాటుంటే పనయ్యాక సిగరైట్ బట్ ఫ్లష్ లో వేసేస్తారు. ఈ పని ఎక్కువ రోజులు అలాగే చేస్తుంటే అవి పైపుల్లో బ్లాకేజ్ కు కారణం అవుతాయి. అవి తేలిగ్గా ఉండటం వల్ల నీటి మీద తేలుతూ ఉంటాయి. ఎన్ని నీళ్లు పోసినా కిందికిపోకుండా పైపు గోడలకు అతుక్కుపోయి బ్లాకేజీకీ కారణం అవుతాయి.

దూది:

చిన్న చిన్న దూది ఉండలల్లాంటివి చూడ్డానికి చిన్నగా అనిపించి టాయిలెట్లో ఫ్లష్ చేస్తారు. కానీ ఇది నీరు బయటకు పోయే దగ్గర అడ్డు పడితే మాత్రం బ్లాకేజ్ తీవ్రంగా అయిపోతుంది. అన్నీ అక్కడే వచ్చి చేరి నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉంటుంది.

Whats_app_banner