Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ ఇలా చేశారంటే ఎంతో రుచి, పైగా ఆరోగ్యం కూడా
Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ వారానికి ఒక్కసారైనా తాగడం వల్ల క్యాల్షియం లోపం రాకుండా ఉంటుంది. మటన్ బోన్ సూపును టేస్టీగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.
కొందరు మటన్ బోన్స్ అంటే మరికొందరు మటన్ పాయా అని అంటారు. నిజానికి మటన్ బోన్ సూప్‌లో మటన్ ఎముకలను వేసి చేసుకోవచ్చు. మటన్ పాయాలో మాత్రం కేవలం కాళ్ళను మాత్రమే వాడుతారు. ఇక్కడ మేము మటన్ బోన్ సూప్ రెసిపీ ఇచ్చాము. దీన్ని చేయడం చాలా సులువు. పైగా మటన్ బోన్ సూపును వారానికి ఒక్కసారైనా తాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు ఎన్నో అందుతాయి. పైగా కాల్షియం కూడా అందుతుంది. ఈ మటన్ బోన్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మటన్ బోన్ సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
మటన్ బోన్స్ - అరకిలో
మిరియాల పొడి - అర స్పూను
బిర్యానీ ఆకులు - రెండు
షాజీరా - అర స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
యాలకులు - రెండు
లవంగాలు - రెండు
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - అరకప్పు
కరివేపాకులు - గుప్పెడు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర పొడి - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
పచ్చిమిర్చి - మూడు
టమోటోలు - రెండు
ఉల్లిపాయలు తరుగు - పావు కప్పు
మటన్ బోన్ సూప్ రెసిపీ
1. మటన్ బోన్ సూప్‌ను తయారు చేయడానికి ముందుగానే మటన్ ఎముకలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేయాలి.
3. ఆ నెయ్యిలో మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, షాజీరా వేసి బాగా వేయించాలి.
4. తర్వాత ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు కూడా వేసి బాగా వేయించుకోవాలి.
5. ఇప్పుడు మటన్ బోన్స్ ను అందులో వేసి కలుపుకోవాలి.
6. మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
7. ఆ తర్వాత మూత తీసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.
8. అలాగే సన్నగా తరిగిన టమోటో ముక్కలను కూడా వేసి అవి మెత్తబడే వరకు ఉడికించాలి.
9. అవి బాగా ఉడికాక కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
10. ఆ తర్వాత పుదీనా తరుగు వేసి నీళ్లు వేసి పైన కుక్కర్ మూత పెట్టేయాలి.
11. కనీసం ఐదారు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
12. ఆ తర్వాత మూత తీసి మిరియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లి మరి కాసేపు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
13. అంతే మటన్ బోన్ సూప్ రెడీ అయినట్టే. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మటన్ బోన్ సూప్ తాగడం వల్ల జలుబు, జ్వరం వంటివి త్వరగా రాకుండా ఉంటాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయి. క్యాల్షియం లోపలికి బాధపడుతున్నవారు తాగడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇది ఔషధంగా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.