Peanut Pakodi Recipe । చల్లటి వర్షం చూస్తూ, వేడివేడిగా వేరుశనగ పకోడిలు తినండి!
Monsoon Recipes: వేడివేడిగా, కరకరలాడేలా ఏవైనా చిరుతిళ్లు తినేందుకు వర్షాకాలం పర్ఫెక్ట్, ఇక్కడ మీకు మరింత రుచికరమైన పల్లి పకోడి రెసిపీని అందిస్తున్నాం
Monsoon Recipes: సీజన్ ఏదైనా స్ట్రీట్ ఫుడ్ అంటే మనకు చాలా ఇష్టం ఉంటుంది. పకోడిలు, మిర్చి బజ్జీలు, పానీపూరీ, చాట్, కుల్ఫీలు వంటి చిరుతిళ్లను తినకుండా ఉండలేం. కానీ, వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ తినడం మంచిది కాదు, అలాగే ఉడికించని ఆహారాలు, పానీపూరీ వంటివి తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ సీజన్ లో వేడివేడిస్ సూప్ లు, రసాలు వంటివి తీసుకోవడం ఉత్తమం.
అయితే వేడివేడిగా, కరకరలాడేలా ఏవైనా చిరుతిళ్లు తినేందుకు వర్షాకాలం పర్ఫెక్ట్, మరి అప్పుడప్పుడైనా తినాలనే కోరికను ఎందుకు చంపుకోవడం. వర్షంలో పకోడిలు తినాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది కాబట్టి వీటిని మీ ఇంట్లోనే చేసుకొని తినండి. ఇక్కడ మీకు మరింత రుచికరమైన పల్లి పకోడి రెసిపీని అందిస్తున్నాం. ఈ పల్లి పకోడి క్రంచీగా, అక్కడక్కడా మసాలా నట్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. వేరుశనగ పకోడిని చేయడం చాలా సులభం, ఎలా చేయవచ్చో ఈ కింద తెలుసుకోండి.
Peanut Pakodi Recipe కోసం కావలసినవి
- 1 కప్పు వేరుశనగ
- 1 కప్పు శనగపిండి
- 1/2 కప్పు గోధుమ పిండి
- 1 కప్పు పాలకూర
- 1 టేబుల్ స్పూన్ వేడి నూనె
- 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి
- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
- 1/4 స్పూన్ బేకింగ్ సోడా
- 1/2 tsp కారం పొడి
- 1/4 స్పూన్ గరం మసాలా
- రుచికి తగినంత ఉప్పు
- వేయించడానికి సరిపడా నూనె
వేరుశనగ పకోడి తయారీ విధానం
- ముందుగా వేరుశనగను కాల్చుకొని, చిన్న పలుకులుగా చూర్ణం మాదిరి చేసుకోవాలి. పాలకూర, పచ్చిమిర్చిని తురుముకోవాలి.
- అనంతరం ఒక గిన్నెలో పైన పేర్కొన్న అన్ని పదార్థాలను కలిపేయండి. అందులో అరకప్పు నీరు కూడా పోసుకొని పిండిలా ముద్దగా చేసుండి, ఆపైన చిన్నచిన్న ముద్దలుగా విభజించండి.
- ఇప్పుడు ఒక లోతైన నాన్-స్టిక్ పాన్‌లో నూనెను వేడి చేయండి, నూనె వేడయ్యాక పిండి ముద్దలను వేయండి. బంగారు రంగులోకి వచ్చే వరకు బాగా వేయించాలి
- అనంతరం ఒక గిన్నెలోకి తీసుకొని, పేపర్ సహాయంతో అదనపు నూనెను తొలగించండి.
అంతే, వేరుశనగ పకోడి రెడీ,. గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి, వర్షాన్ని ఆస్వాదిస్తూ తినండి.
సంబంధిత కథనం