Masala Kakarakaya: మసాలా కాకరకాయ కూర, డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ రెసిపీ
ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు, ఒకటి కాకరకాయను అమితంగా ఇష్టపడేవారు, మరొకరు కాకరకాయను కూడా రుచి చూడలేరు. మీరు మొదటి కోవలోకి వస్తే, కొన్ని కొత్త కాకరకాయ రుచులను రుచి చూద్దాం. రాధా శ్రీవాస్తవ వంటకాలు చెబుతున్నారు.
డయాబెటిక్ రోగులకు కాకరకాయ ఒక వరం అని చెప్పాలి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో టేస్టీగా మసాలా కాకరకాయ వేపుడు చేసుకోవచ్చు. దీన్ని అన్నంతో, చపాతీతో, రోటీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి దీన్ని వండుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం. మసాలా కాకరకాయ వేపుడు చేయడం చాలా సులువు.
మసాలా కాకరకాయ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కాకరకాయ - అరకిలో
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మకాయ రసం - అరస్పూను
ఆవనూనె - ఒక స్పూన్
ఆవాలు - ఒక స్పూన్
పచ్చిమిర్చి - మూడు
పసుపు - పావు స్పూన్
కారం - ఒక టీస్పూన్
కొత్తిమీర తరుగు - ఒక స్పూన్
చాట్ మసాలా - రెండు స్పూన్లు
ఉల్లిపాయలు - రెండు
కొత్తిమీర తరుగు - నాలుగు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
గరం మసాలా - అర స్పూను
మసాలా కాకరకాయ ఫ్రై రెసిపీ
- కాకరకాయలను శుభ్రంగా కడిగి సన్నగా, గుండ్రంగా కట్ చేసుకోవాలి.
- ఒక పెద్ద పాత్రలో తరిగిన కాకరకాయ ముక్కలు, ఒక టీస్పూన్ ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి అరగంట పాటు మూతపెట్టాలి.
- అరగంట తర్వాత కాకరకాయను బాగా పిండి నీటిని వంపేయాలి.
- కళాయిలో ఆవనూనె వేసి వేడి చేయాలి.
- ఆవాలు, జీలకర్ర, సోంపు వేసి వేయించాలి.
- ఆవాలు చిటపటలాడాక నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.
- ఉల్లిపాయలు వేగాక కాకరకాయ ముక్కలను పాన్ లో వేసి వేయించాలి.
- కాకరకాయను మీడియం మంట మీద మెత్తబడే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు బాణలిలో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపాలి.
- చిన్న మంట మీద వాటిని వేయించాలి. పైన కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
- మరో రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రోటీతో సర్వ్ చేయాలి. దీని రుచి అద్భుతంగా ఉంటుంది.
కాకరకాయ తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి శరీరాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి. రోగనిరోధక వ్యవస్థకు ఇది సహాయపడుతుంది. వీటిలో పొటాషియం, ఐరన్ కూడా అధికంగా ఉంటుంది. కాకరకాయలు తినడం వల్ల డయాబెటిస్ రోగుల్లో రక్తంలో గ్లూకోజ్ అదుపులో ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు వారానికి కనీసం రెండు మూడు సార్లు కాకరకాయ తింటే మంచిది.
టాపిక్