Kobbari Charu: కొబ్బరి ముక్క మిగిలితే కొబ్బరి చారు చేసేయండి, ఇష్టంగా తింటారు-make kobbari charu or rasam with leftover coconut ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kobbari Charu: కొబ్బరి ముక్క మిగిలితే కొబ్బరి చారు చేసేయండి, ఇష్టంగా తింటారు

Kobbari Charu: కొబ్బరి ముక్క మిగిలితే కొబ్బరి చారు చేసేయండి, ఇష్టంగా తింటారు

Koutik Pranaya Sree HT Telugu
Sep 29, 2024 05:30 PM IST

Kobbari Charu: కొబ్బరితో చారు చేయొచ్చని చాలా మందికి తెలీదు. ఒకరకమైన పప్పుచారు రెసిపీ అనుకోండి. కాకపోతే కొబ్బరి ఫ్లేవర్ ఉంటుంది. తయారీ సులభమే.

కొబ్బరి చారు
కొబ్బరి చారు

కొబ్బరి ఫ్లేవర్‌ రుచితో చేసే చారు లేదా రసం రెసిపీ కమ్మగా ఉంటుంది. ఈ చారుతో ఎంత అన్నం అయినా తినేయొచ్చు. అంచుకు పాపడ్, వడియాలు పెట్టుకున్నారంటే ఇంకే కర్రీ అవసరం లేదు. కమ్మదనంతో నిండి ఉండే ఈ కొబ్బరి చారు రెసిపీ చూసేయండి.

కొబ్బరి చారు తయారీకి కావాల్సినవి:

సగం పచ్చి కొబ్బరి ముక్క

2 టమాటాలు, సన్నం ముక్కల తరుగు

2 పచ్చిమిర్చి

2 చెంచాల నూనె

సగం కప్పు కందిపప్పు, ఉడికించుకోవాలి

పావు కప్పు చింతపండు రసం

అరచెంచా ఉప్పు

అరచెంచా కారం

అరచెంచా పసుపు

అరచెంచా జీలకర్రపొడి

గుప్పెడు కొత్తిమీర తరుగు

అర టీస్పూన్ ఆవాలు

అర టీస్పూన్ మెంతులు

అరచెంచా జీలకర్ర

2 ఎండుమిర్చి

అరచెంచా మినప్పప్పు

మిక్సీ పట్టడం కోసం:

4 వెల్లుల్లి రెబ్బలు

2 ఎండుమిర్చి

అరచెంచా మిరియాలు

1 చెంచా జీలకర్ర

కొబ్బరి చారు తయారీ విధానం:

  1. ముందు మిక్సీ జార్ లో వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి.
  2. ఇప్పుడు పచ్చికొబ్బరిని ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోండి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఒక గుడ్డలోకి తీసుకుని పిండితే కొబ్బరి పాలు వస్తాయి. వాటిని పక్కన పెట్టుకోండి. మీకు రెడీమేడ్ గా పాలు
  3. ఒక ప్యాన్ తీసుకుని రెండు చెంచాల నూనె వేసుకోండి. వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, ఎండుమిర్చి వేసుకుని నిమిషం వేయించండి.
  4. అందులోనే మిక్సీ పట్టుకున్న మసాలాకూడా వేసి కలపండి. పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కూడా వేసి మెత్తబడనివ్వండి.
  5. ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి మరోసారి కలియబెట్టండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం, నీళ్లు పోసుకోండి.
  6. రుచికి తగినంత ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మీకిష్టముండే అర టీస్పూన్ పంచదార వేశారంటే రుచి మరింత బాగుంటుంది.
  7. అన్నీ వేశాక ఒక పొంగువచ్చేదాకా ఉడికించండి. ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు పోసేయండి. ఒక పొగు రాగానే స్టవ్ కట్టేసి కొత్తిమీర తరుగు చల్లి దించేసుకుంటే మీరు మర్చిపోలేని రుచితో కొబ్బరి చారు రెడీ.

Whats_app_banner