Labour Day Quotes : ఆనందంతో చేసే పని అద్భుతం.. మే డే నినాదాలు షేర్ చేయండి-labour day 2024 greetings quotes whatsapp status facebook message may day wishes in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Labour Day Quotes : ఆనందంతో చేసే పని అద్భుతం.. మే డే నినాదాలు షేర్ చేయండి

Labour Day Quotes : ఆనందంతో చేసే పని అద్భుతం.. మే డే నినాదాలు షేర్ చేయండి

Anand Sai HT Telugu
Apr 30, 2024 03:30 PM IST

May Day : మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం. దేశం బాగుపడాలంటే కార్మికుల శ్రమే కీలకం. అలాంటి వారు గురించి గొప్ప గొప్పవారు మంచి మాటలు చెప్పారు. అవేంటో చూద్దాం.

ప్రపంచ శ్రామికుల దినోత్సవం
ప్రపంచ శ్రామికుల దినోత్సవం (Unsplash)

ఎంతో మంది శ్రామికుల చేతులు కలవకుండా ఏ పారిశ్రామికవేత్త విజయం సాధించలేడు. ప్రతి పారిశ్రామికవేత్త విజయం వెనుక వేల మంది ఉద్యోగులు/కార్మికుల కృషి ఉంటుంది. మే 1న కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచంలో శ్రామికులు లేకుంటే ఏ వ్యాపారవేత్త లేడు. శ్రామికులు లేని దేశం.. దేశమే కాదు. శ్రామికులను తప్పకుండా గౌరవించుకోవాలి. వారిని అగౌరవపరచకూడదు. ఎందుకుంటే జీవితంలో మెట్టు ఎక్కేందుకు ఎందరో శ్రామికులు చేయి వేస్తారు. అప్పుడే ముందుకు సాగగలరు. అలాంటి వారిని తప్పుకుండా గౌరవించుకోవడం అందరి బాధ్యత

ఈ నేప‌థ్యంలో శ్రామికుల గురించి గొప్పగా చెప్పిన కొన్ని నినాదాలు ఉన్నాయి. గొప్ప గొప్ప వ్యక్తులు కొన్ని నినాదాలు చెప్పారు. అవి చాలా స్ఫూర్తిమంతమైనవి. వీటిని మన జీవితంలో అలవర్చుకుంటే తప్పకుండా ఉన్నతంగా ఎదగగలం. మరి ఎవరు ఏం చెప్పారో చూద్దాం. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా వీటని షేర్ చేద్దాం..

పని అనేది డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు, మీ జీవితానికి అర్థం ఇవ్వడానికి. - మార్క్ చాగల్

శ్రమ యొక్క ముగింపు విశ్రాంతిని కనుగొనడం - అరిస్టాటిల్

మానవత్వాన్ని అభివృద్ధి చేసే అన్ని పనులకు గౌరవం, ప్రాముఖ్యత ఉంటుంది. వాటిని గొప్పగా పరిగణించాలి - మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్.

ఒక రాజు ఒక పనిని ప్రారంభిస్తాడు.. ఒక సేవకుడు దానిని ఒంటరిగా పూర్తి చేస్తాడు.. - జోసెఫ్ జౌబర్ట్

ఎంత కష్టమైనా మనం ముందుకు సాగాలి. అప్పుడే మన మార్గం సాఫీగా సాగుతుంది. - గ్రెగ్ కిన్‌కైడ్

పని లేని పురుషులు తక్కువ గౌరవం కలిగి ఉంటారు - నెవిల్ షూట్

చిన్న పనిని గౌరవించండి, కీర్తించండి. ఎందుకంటే మన జీవితం కింద నుండి ప్రారంభమవుతుంది.. పై నుండి కాదు. - బుకర్ v వాషింగ్టన్

మనం సుదూర లక్ష్యం వైపు వెళుతున్నప్పుడు, మన హృదయ ద్వారం వద్ద ఉన్న గొప్ప కోరికను నెరవేర్చడానికి మనం మనవి చేయాలి. మన శక్తికి సమానమైన పని కావాలని కాదు, మన పని కోసం బలం కావాలని ప్రార్థించండి. - హెలెన్ కెల్లర్

పనిలోని ఆనందం.. పనిలో పరిపూర్ణతను ఇస్తుంది. -అరిస్టాటిల్

విజేతలు 1 శాతం, శ్రామిక వర్గం 99శాతం మందికి స్ఫూర్తినిస్తాయి. - థామస్ ఎడిసన్

శ్రమ లేకుండా ఏదీ వర్ధిల్లదు - సోఫోకిల్స్

కష్టపడి పనిచేయడంకంటే ఏదీ విలువైనది కాదు. - బుకర్ టి. వాషింగ్టన్

నిజాయితీగా ఉండటానికి ధైర్యం కావాలి.. పనివాడిగా ఉండటానికి భయపడకూడదు. - రాబర్ట్ బర్న్స్

మీరు ఇష్టపడేదాన్ని కనుగొనండి, మీరు మీ జీవితాంతం పని చేయవలసిన అవసరం లేదు. - హార్వే మాకే

మనం చేసే పని అద్భుతం కాదు. ఆనందంతో చేసే పని అద్భుతం - మదర్ థెరిసా

ఎవరూ గొప్ప ప్రయత్నం లేకుండా గొప్ప వ్యక్తి కాలేరు - ఆండ్రీ గైడ్

మీరు చేస్తే తప్ప.. దానంతట అదే ఏదీ పని చేయదు - మాయా ఏంజెలో

WhatsApp channel

టాపిక్